BSNL కొత్త ఆఫర్లు, రూ.19, రూ.8
సెప్టంబర్ 4 నుంచి ఈ ప్లాన్స్ pan-India మొత్తం అమల్లోకి వస్తాయని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.
ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ రెండు సరికొత్త వాయిస్ కట్టర్ ప్లాన్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది. రూ.19, రూ.8 టారిఫ్‌లలో ఈ ప్లాన్స్ అందుబాటులో ఉంటాయి. సెప్టంబర్ 4 నుంచి ఈ ప్లాన్స్ pan-India మొత్తం అమల్లోకి వస్తాయని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.

రూ.19 వాయిస్ కట్టర్ ప్లాన్ ఆఫర్స్..
కొత్తగా పరిచయం కాబోతోన్న రూ.19 వాయిస్ కట్టర్ ప్లాన్‌లో భాగంగా బీఎస్ఎన్ఎల్ టు బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ మధ్య చేసుకునే కాల్స్‌కు నిమిషానికి 15 పైసలు మాత్రమే ఛార్జ్ చేయటం జరుగుతుంది. ఇదే సమయంలో బీఎస్ఎన్ఎల్ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసుకునే కాల్స్‌కు నిమిషానికి 35 పైసలు ఛార్జ్ చేయటం జరుగుతుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ వచ్చేసరికి 90 రోజులు ఉంటుంది.

రూ.8 వాయిస్ కట్టర్ ప్లాన్ ఆఫర్స్..
రూ.8 వాయిస్ కట్టర్ ప్లాన్‌లో భాగంగా బీఎస్ఎన్ఎల్ టు బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ మధ్య చేసుకునే కాల్స్‌కు నిమిషానికి 15 పైసలు మాత్రమే ఛార్జ్ చేయటం జరుగుతుంది. ఇదే సమయంలో బీఎస్ఎన్ఎల్ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసుకునే కాల్స్‌కు నిమిషానికి 35 పైసలు ఛార్జ్ చేయటం జరుగుతుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ వచ్చేసరికి 30 రోజులు మాత్రమే.

రూ.429 టారిఫ్ ప్లాన్...
ఇవే కాకుండా రూ.429 టారిఫ్ పేరుతో సరికొత్త ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ మార్కెట్లో
లాంచ్ చేసింది. ఈ ప్లాన్ లో భాగంగా 90 రోజుల పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 1జీబి డేటా అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications