గూగుల్‌తో కలిసిన BSNL, ఇకపై ఉచిత వైఫై సేవలు

By Gizbot Bureau
|

ప్రభుత్వ టెలికం రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రైవేటు టెలికం రంగ సంస్ధలకు దీటుగా వినియోగదారులను ఆకర్షించేందుకు సరికొత్త పంథాతో ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా టెక్ దిగ్గజం 'గూగుల్’తో జత కట్టింది. దేశవ్యాప్తంగా 'వై-ఫై’ సేవలను విస్తరించాలన్న లక్ష్యంతో గూగుల్ సంస్థతో బీఎస్ఎన్ఎల్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది.

 
గూగుల్‌తో కలిసిన BSNL, ఇకపై ఉచిత వైఫై సేవలు

డిజిటల్‌ ఇండియాలో భాగంగా ఎప్పటికప్పుడు పెరుగుతున్న డిమాండ్‌తోపాటు 'హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ కోసం వివిధ టెక్నాలజీ కంపెనీలతో BSNL ఒప్పందాలు కుదుర్చుకుంటూ వస్తోంది. తాజాగా గూగుల్‌ సంస్థతో ఒప్పందం కుదర్చుకొని హైస్పీడ్‌ ఇంటర్నెట్‌తో ఉచిత వైఫై సేవలకు సిద్ధమైంది.

 హైదరాబాద్‌ లో ఉచిత వైఫై సేవలు

హైదరాబాద్‌ లో ఉచిత వైఫై సేవలు

హైదరాబాద్‌ మహా నగరంలో ఇటీవల సుమారు 25 ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌-గూగుల్‌ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఈ స్టేషన్ల ద్వారా అన్‌లిమిటెడ్‌ హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలను అందిస్తోంది. వినియోగదారులు స్టేషన్‌ పరిధిలోకి వచ్చి వైఫై ఓపెన్‌ చేస్తే బీఎస్‌ఎన్‌ఎల్‌ గూగుల్‌ స్టేషన్‌ వైఫై సిగ్నల్‌ వస్తోంది. కనెక్ట్‌ చేస్తే మొబైల్‌కు సంక్షిప్త సమాచారం వస్తోంది. దానిని ఎంటర్‌ చేస్తే ఓటీపీ జనరేట్‌ అవుతోంది. దానిని కాపీ చేసి ఎంటర్‌ చేస్తే వైఫ్‌ కనెక్ట్‌ అవుతుంది. వినియోగదారులు ఉచితంగా అన్‌లిమిటెడ్‌ డేటాను పొందవచ్చు.

‘డిజిటల్‌ ఇండియా’లో భాగాంగా
 

‘డిజిటల్‌ ఇండియా’లో భాగాంగా

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తు న్న ‘డిజిటల్‌ ఇండియా'లో భాగాంగా గ్రామీణ ప్రాంతాల్లో వైఫై సేవలు విస్తరించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ హైదరాబాద్‌ నగర శివార్లలో స్వంతంగా 125 హాట్‌స్పాట్లను ఏర్పాటు చేసింది. హాట్‌ స్పాట్‌ పరిధిలో వైఫై కనెక్ట్‌ అయ్యే వినియోగదారుడు తన మొబైల్‌ కనెక్షన్‌ ద్వారా నెలకు 4 జీబీ డేటాను ఉచితంగా పొందవచ్చు.

           ఇప్పటివరకు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ వంటి ప్రైవేట్ సంస్థల దూసుకు వెళుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘డిజిటల్ ఇండియాను ప్రభుత్వ రంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ ద్వారా ముందుకు తీసుకువెళ్లాలని వ్యూహం రచిస్తోంది. ఇందులో భాగంగానే ‘డిజిటల్ ఇండియా'ఇన్షియేటివ్‌ లక్ష్యాలను చేరుకునేందుకు వివిధ సంస్థల భాగస్వామ్యంతో కలిసి పని చేస్తున్నామని బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ (సీఎఫ్ఎ) వివేక్ బన్సాల్ తెలిపారు. తద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్ అందించాలన్న డిమాండ్ చేరుకోగలమన్నారు.

ఫ్రీ ‘వై-ఫై’ సర్వీసులు

ఫ్రీ ‘వై-ఫై’ సర్వీసులు

ఇదివరకే బీఎస్ఎన్ఎల్ - గూగుల్ సంస్థతో కలిసి ఫ్రీ ‘వై-ఫై' సర్వీసుల కార్యక్రమాన్ని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ అనుపమ్ శ్రీవాత్సవ్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ సంస్థకు 38 వేల ‘వై-ఫై' హాట్ స్పాట్ కేంద్రాలు ఉన్నాయి. రూ.19 ఓచర్లను కొనుగోలు చేస్తే ‘వై-ఫై' సేవలు అందుబాటులోకి వస్తాయి. తాజాగా హైదరాబాద్ లో ఉచిత వైఫై సేవలు అందించడం కొసమెరుపు

Most Read Articles
Best Mobiles in India

English summary
BSNL partners Google to expand WiFi footprint in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X