బీఎస్ఎన్ఎల్ 100జీబి ఆఫర్

ఇంటర్నెట్ సర్వీసుల విభాగంలో మరింతగా రాణించేందుకు కొత్త వ్యూహం

|

బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసుల విభాగంలో మరింతగా రాణించేందుకు గాను ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త వ్యూహాలను రచిస్తోంది. తాజాగా డేటామెయిల్ ప్రొవైడర్ Data Xgenతో జతకట్టి ఓ ప్రత్యేకమైన ఈ-మెయిల్ సర్వీసును బీఎస్ఎన్ఎల్ అనౌన్స్ చేసింది.

Read More : ఇక Paytmలో జియో రీఛార్జ్ ప్లాన్స్, డిస్కౌంట్స్ కూడా..

100జీబి స్టోరేజ్ స్పేస్‌..

100జీబి స్టోరేజ్ స్పేస్‌..

బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మెయిల్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, 100జీబి స్టోరేజ్ స్పేస్‌ను కూడా ఆఫర్ చేయటం జరుగుతుంది.

8 భారతీయ భాషల్లో

8 భారతీయ భాషల్లో

8 భారతీయ భాషల్లో బీఎస్ఎన్ఎల్ మెయిల్ సర్వీస్ అందుబాటులోకి ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ యూజర్లు DataMail యాప్‌లోకి వెళ్లి తమ సొంత భాషలో ఈమెయిల్ ఐడీని క్రియేట్ చేసుకోవచ్చు.

తెలుగు సహా..

తెలుగు సహా..

తెలుగు సహా తమిళం, హిందీ, గుజరాతీ, ఉర్దూ, పంజాబీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో మెయిల్ ఐడీలను క్రియేట్ చేసుకునే అవకాశాన్ని బీఎస్ఎన్ఎల్ కల్పిస్తోంది.

 గూగల్ ప్లే స్టోర్ నుంచి..
 

గూగల్ ప్లే స్టోర్ నుంచి..

ఈ డేటామెయిల్ సర్వీసును ఆండ్రాయిడ్ యూజర్లు గూగల్ ప్లే స్టోర్ నుంచి యాపిల్ ఐఫోన్ యూజర్లు ఐఓఎస్ స్టోర్‌ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ సర్వీసులో భాగంగా DataOne.Bharat అనే డొమైన్ నుంచి మెయిల్ ఐడీని క్రియేట్ చేసకోవల్సి ఉంటుంది. ఉదాహరణకు మీ పేరు అక్షయ్ అనుకోండి. అక్షయ్@ DataOne.Bharat అని మెయిల్ ఐడీని క్రియేట్ చేసుకునే వీలుంటుంది.

రెండు సరికొత్త ప్లాన్‌లను..

రెండు సరికొత్త ప్లాన్‌లను..

ప్రభుత్వరంగ టెలికం సంస్ధ బీఎస్ఎన్ఎల్ రెండు సరికొత్త ప్లాన్‌లను అనౌన్స్ చేసింది. రూ.42, రూ.88 టారిఫ్ లలో ఈ ప్లాన్స్ అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాన్స్‌లో భాగంగా ఆన్-నెట్ వాయిస్ కాల్స్ పై నిమిషానికి 10 పైసలు, ఆఫ్-నెట్ వాయిస్ కాల్స్ పై నిమిషానికి 30 పైసలను వసూలు చేస్తారు.

Best Mobiles in India

English summary
BSNL Partners With Data Xgen To Launch Linguistic Email Service With Free 100GB Storage Space. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X