Home
News

Airtel, జియోలకు BSNL షాక్, 90 రోజుల పాటు అన్నీ అన్‌లిమిటెడ్

రిలయన్స్‌ జియోకు పోటీగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బిఎస్‌ఎన్‌ఎల్‌‌) సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది.

By Hazarath

రిలయన్స్‌ జియోకు పోటీగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బిఎస్‌ఎన్‌ఎల్‌‌) సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల వినియోగదారుల కోసం 429 రూపాయలతో ఆకర్షణీయమైన వాయిస్‌, డేటా ఆధారిత ప్లాన్‌ను తీసుకువచ్చినట్లు బిఎస్‌ఎన్‌ఎల్‌ వెల్లడించింది. దీంతో పాటు ఇతర కంపెనీల ప్లాన్ల వివరాలు కూడా ఇస్తున్నాం ఓ సారి చెక్ చేయండి.

 BSNL

BSNL

BSNL అందిస్తునన్న ఈ ప్లాన్‌ను వినియోగదారులు ఎంచుకోవడం ద్వారా అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌తోపాటు రోజుకు 1 జీబీ డేటా చొప్పున 90 రోజులపాటు పొందవచ్చు. ఈ నెల నాలుగో తేదీ నుంచే ఈ ఆఫర్ అందుబాటులో ఉందని తెలిపింది.

జియో

జియో

జియో రూ. 399 ప్లాన్ ఇక జియో ఆఫర్ గురించి చాలా మందికి తెలిసిందే. రూ. 399 పెట్టి రీచార్జ్ చేసుకుంటే 84 రోజులపాటు రోజుకి 1జీబీ చొప్పున హైస్పీడ్ 4జీ డాటాను పొందొచ్చు. అలాగే వీవోఎల్టీఈ టెక్నాలజీపై హెచ్‌డీ క్వాలిటీతో అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే రోజుకి 100 ఎస్ఎంఎస్‌లు వస్తాయి.

 ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్

ఇక ఎయిర్‌టెల్ జియోకి కౌంటర్ గా ఇచ్చిన 399 ప్లాన్లో 4జీ స్పీడ్ తో రోజుకు 1జిబి చొప్పున 84 రోజులు పాటు ఎంజాయ్ చేయవచ్చు.లోకల్ ఎస్టీడీ కాల్స్ అపరిమితం.

వొడాఫోన్ రూ. 352 ప్లాన్

వొడాఫోన్ రూ. 352 ప్లాన్

రోజుకి 1జీబీ హైస్పీడ్ 4జీ డాటాను 84 రోజులపాటు అందించడానికి వొడాఫోన్ రూ. 352 ప్లాన్‌ను తీసుకొచ్చింది. డాటాతో పాటు ఉచిత రోమింగ్, అపరిమిత కాల్స్ కూడా అందిస్తోంది. ఎయిర్‌టెల్ ప్లాన్‌లో లేని అపరిమిత మెసేజ్ ఆఫర్ ఈ వొడాఫోన్ ప్లాన్‌లో ఉంది.

 

 

ఐడియా

ఐడియా

ఐడియా రోజుకి 1జిబి చొప్పున 28 రోజుల పాటు 28 జిబి డేటాను అందిస్తోంది. కాల్స్ అపరిమితం ప్లాన్ ఖరీదు 348 రూపాయలు.

Best Mobiles in India

English summary
BSNL Plan 429 gives 90 GB data, unlimited voice calls: Check out the details Read more At Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X