Home
News

BSNL నుంచి 4G లాంచ్! మరి 5G ఎప్పుడంటే! వివరాలు 

By Maheswara

ప్రస్తుతం ప్రైవేట్ టెలికాం నెట్వర్క్ లు 5G నెట్వర్క్ లాంచ్ లో బిజీ గా ఉంటే. BSNL మాత్రం 200 సైట్‌లతో 4G నెట్‌వర్క్‌ను లాంచ్ చేయడం ప్రారంభించిందని సంస్థ తెలిపింది. దాదాపు మూడు నెలల ట్రయల్ తర్వాత, ప్రస్తుతం రోజుకు సగటున 200 సైట్‌లను ప్రారంభిస్తుందని కేంద్ర ఐటీ మరియు కమ్యూనికేషన్ల మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం తెలిపారు.

అంతేకాక, ఈ సంవత్సరం నవంబర్-డిసెంబర్ నాటికి BSNL 4G నెట్‌వర్క్‌ను 5Gకి అప్‌గ్రేడ్ చేస్తామని మంత్రి చెప్పారు. "మేము భారతదేశంలో అభివృద్ధి చేసిన 4G-5G టెలికాం స్టాక్ విస్తరణ BSNLతో ప్రారంభమైంది. చండీగఢ్ మరియు డెహ్రాడూన్ మధ్య, 200 సైట్‌ల ఇన్‌స్టాలేషన్‌లు పూర్తయ్యాయి మరియు తర్వాత గరిష్టంగా రెండు వారాల్లో, ఈ 4G అందుబాటులోకి వస్తుందని," వైష్ణవ్ చెప్పారు.

BSNL Planning To Launch 4G In Next Two Weeks, 5G Network By The End Of The Year, Details Here

BSNL టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మరియు ITI లిమిటెడ్‌తో 1.23 లక్షల కంటే ఎక్కువ సైట్‌లతో కూడిన 4G నెట్‌వర్క్ విస్తరణ కోసం ₹19,000 కోట్లకు పైగా ముందస్తు కొనుగోలు ఆర్డర్‌ను చేసింది.

"BSNL 4G ని అమలు చేసే వేగం చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మూడు నెలల పాటు పరీక్షించిన తర్వాత, ప్రస్తుతం రోజుకు 200 సైట్‌లను ఇన్‌స్టాలేషన్‌ చేస్తాము. BSNL నెట్‌వర్క్ ప్రారంభంలో 4G లాగా పని చేస్తుంది. అతి త్వరలో, నవంబర్-డిసెంబరులో చాలా చిన్న సాఫ్ట్‌వేర్ సర్దుబాటుతో ఇది 5G అవుతుంది" అని వైష్ణవ్ చెప్పారు.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో కలిసి గంగోత్రిలో 2,00,000వ స్థలాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. "ఈరోజు ఆచరణాత్మకంగా ప్రతి నిమిషం ఒక 5G సైట్ యాక్టివేట్ అవుతోంది.ఈ వేగానికి ప్రపంచం ఆశ్చర్యపోతోంది. 2,00,000వ సైట్‌ను చార్‌ధామ్‌లో ఇన్‌స్టాల్ చేయడం మాకు గర్వకారణం" అని వైష్ణవ్ అన్నారు.

5జీలో ప్రపంచంతో పాటు భారతదేశం నిలుస్తుందని, 6జీలో అగ్రగామిగా నిలుస్తుందని ప్రధాని చెప్పారని ఆయన పేర్కొన్నారు. టెక్నాలజీ బదిలీలపై సంతకాలు చేసే రోజులు పోయాయని వైష్ణవ్ అన్నారు. "నేడు భారతదేశం టెక్నాలజీ ఎగుమతిదారుగా మారింది" అని వైష్ణవ్ జోడించారు.

మేడ్ ఇన్ ఇండియా టెక్నాలజీలు
అక్టోబ‌ర్ 1న ప్ర‌ధాన మంత్రి సేవ‌ను ప్రారంభించిన 5 నెల‌ల్లోనే తొలి లక్ష 5జీ సైట్‌లు అందుబాటులోకి వచ్చాయి. రాబోయే మూడు నెలల్లో తదుపరి లక్ష సైట్‌లు అందుబాటులోకి వస్తాయి.

"డిసెంబర్ 31, 2023 నాటికి సుమారు 1.5 లక్షల సైట్‌లను కలిగి ఉండాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇప్పటికే 2 లక్షల సైట్‌లు పూర్తయ్యాయి, డిసెంబర్ 31 నాటికి ఇది 3 లక్షల కంటే ఎక్కువ సైట్‌లు కావాలని నేను భావిస్తున్నాను" అని వైష్ణవ్ చెప్పారు.

అమెరికా వంటి దేశాలు మేడ్-ఇన్-ఇండియా టెలికాం టెక్నాలజీలను అమలు చేయడం ప్రారంభించాయని చెప్పారు."ఈరోజు, చార్‌ధామ్ భక్తులకు 5G సైట్ రూపంలో కానుక లభించింది. ఇప్పుడు, మన సరిహద్దు ప్రాంతం కూడా మొబైల్ కనెక్టివిటీతో అభివృద్ధి చేయబడి ఉంది. ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతంలో హై-స్పీడ్ కనెక్టివిటీ గురించి మనం చూసిన కల. ఈ రోజు నెరవేరింది" అని ధామి చెప్పారు.

ఈ హై-స్పీడ్ సర్వీస్ లు ప్రారంభం సహాయం మరియు విపత్తు నిర్వహణ, నిఘా మరియు ఆర్థిక వ్యవస్థను పెంచడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు. ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ -- బద్రీనాథ్, కేదార్‌నాథ్, యమునోత్రి మరియు గంగోత్రి ప్రాంతాలలో ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీని కూడా మంత్రి ప్రారంభించారు.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Planning To Launch 4G In Next Two Weeks, 5G Network By The End Of The Year, Details Here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X