Home
News

BSNL వినియోగదారులకు గుడ్‌ న్యూస్.. 4G సేవలు ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయంటే..!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న 4G సర్వీసులు (BSNL 4G Services) త్వరలో ప్రారంభం కానున్నాయి. ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా 4G సర్వీసులు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్బర్‌ విధానంలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోనుంది.

TCS మరియు C-DoT ల కన్సార్షియం :
పంజాబ్‌లో ఇప్పటికే BSNL 4G సేవలను ప్రారంభించింది. ప్రముఖ ఐటీ సంస్థ TCS మరియు భారత ప్రభుత్వం టెలికాం పరిశోధన సంస్థ C-DoT ల కన్సార్షియం రూపొందించిన టెక్నాలజీతో పంజాబ్‌లో 4G సర్వీసులను బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రారంభించింది. సుమారు 8 లక్షల మంది వినియోగదారులను కలిగి ఉంది.

BSNL 4G services to start from august 2024

గత సంవత్సరం జులైలో :
పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారుచేయగా.. పరీక్షల దశలో 700- 2100 MHz స్పెక్ట్రమ్‌ బ్యాండ్‌లో 4G నెట్‌వర్క్‌తో 40- 45 MBPS డేటా వేగాన్ని రికార్డు చేసినట్లు తెలిసింది. గత సంవత్సరం జులైలో పంజాబ్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌ తన 4G నెట్‌వర్క్‌ ను ప్రారంభించింది. అక్కడ మెరుగైన ఫలితాలను అందిస్తోంది.

దేశవ్యాప్తంగా ఆగస్టు నుంచి :
అయితే ఈ కన్సార్షియం తయారుచేసిన క్లిష్టమైన టెక్నాలజీ పూర్తి స్థాయిలో నిరూపించుకొనేందుకు (Stabilize) 12 నెలల సమయం కావాల్సి ఉండగా.. కేవలం 10 నెలల్లోనే స్టెబిలైజ్‌ అయింది. దీంతో దేశవ్యాప్తంగా ఆగస్టు నుంచి 4G సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని BSNL కు చెందిన ఉన్నతాధికారి ధ్రువీకరించారు.

BSNL 4G services to start from august 2024

1.12 లక్షల టవర్లు :
TCS, తేజస్‌ నెట్‌వర్క్‌ మరియు ప్రభుత్వ రంగ సంస్థ ITI కు 4G నెట్‌వర్క్‌ విస్తరణ కోసం సుమారు రూ.19000 వేల కోట్ల ఆర్డర్‌లను అందించింది. ఈ ఆత్మనిర్బర్ విధానంలో రూపొందిన ఈ 4G టెక్నాలజీని సులభంగా 5G అప్‌గ్రేడ్‌ అయ్యేలా రూపొందించారు. దీంతోపాటు 4G మరియు 5G సేవల కోసం దేశవ్యాప్తంగా 1.12 లక్షల టవర్లను ఏర్పాటుచేసేందుకు సంస్థ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

6000 టవర్లు యాక్టివ్‌ గా :
ఇందులో భాగంగా BSNL ఇప్పటికే 9000 టవర్‌లను ఇన్‌ స్టాల్‌ చేసింది. ఇందులో పంజాబ్‌, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌, యూపీ వెస్ట్‌ వంటి సర్కిల్‌ లలో సుమారు 6000 టవర్లు యాక్టివ్‌ గా ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

BSNL 4G services to start from august 2024

BSNL సంస్థ గత 4 -5 సంవత్సరాల నుంచే 4G సిమ్‌ కార్డులను విక్రయిస్తోంది. అయితే ఇప్పటికీ పాత సిమ్‌ కార్డులను వినియోగిస్తున్నట్లయితే మెరుగైన సర్వీసుల కోసం అప్‌ గ్రేడ్‌ కావాలని సూచిస్తున్నారు. ఆగస్టు నుంచి 4G సేవల ప్రారంభం.. అనేక మందికి ఉపయోగపడనుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Plans to Launch 4G services across india from august 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X