BSNL 5G నెట్‌వర్క్‌ని ఎప్పుడు ప్రారంభించనున్నదో తెలుసా?

|

ఇండియాలో టెలికాం రంగం రోజురోజుకి వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఇండియాలోని ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు అన్ని కూడా తన యొక్క వినియోగదారులకు ఈ ఏడాది చివర్లో 5G సేవలను అందుబాటులోకి తీసుకొనిరావాలని భావిస్తున్నారు. దేశమంతా ఎదురుచూస్తున్న ఏకైక విషయం స్పెక్ట్రమ్ వేలం ఎప్పుడు జరుగుతుందా అని. అయితే ఈ వేలం కోసం ప్రభుత్వం నిర్ణీత తేదీని ఇంకా ప్రకటించలేదు కాబట్టి దానిపై ఇంకా స్పష్టత లేదు.

ప్రైవేట్ టెల్కోలు

ప్రైవేట్ టెల్కోలు అన్ని కూడా ఈ సంవత్సరం చివరినాటికి 5G నెట్‌వర్క్ లాంచ్ చేసే ఆలోచనలో ఉండగా ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) మాత్రం 2023లో 5Gని ప్రారంభించే అవకాశం ఉన్నట్లుగా కొన్ని నివేదికలు తెలిపాయి. ఈ సంవత్సరం దేశం మొత్తం మీద 4G నెట్‌వర్క్‌లను ప్రారంభించడంపై టెల్కో అధికంగా దృష్టిని సారించింది. ఈ ప్రభుత్వ టెల్కో ఎప్పటికి 2G మరియు 3G సేవలను కొనసాగిస్తున్నది. ఇండియాలో స్వదేశీ 4G నెట్‌వర్క్‌లను ప్రారంభించాలని లక్ష్యంగా ఈ టెల్కో పెట్టుకుంది. ఇప్పటికే TCS (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) మరియు C-DoT (సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్) భాగస్వామ్యంతో స్వదేశీ 4G కోర్‌ను అభివృద్ధి చేసింది.

BSNL స్వదేశీ 5G నెట్‌వర్క్‌లు

BSNL స్వదేశీ 5G నెట్‌వర్క్‌లు

ప్రైవేట్ టెల్కోలు 5G నెట్‌వర్క్‌లను అందుబాటులోకి తీసుకొనిరావడానికి స్వదేశీ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయో లేదో అని అస్పష్టంగా ఉన్నది. కానీ 5G నెట్‌వర్క్‌ల మాత్రం BSNL సంస్థ స్వదేశి టెక్నాలజీపై అదరపడుతున్నట్లు స్పష్టంగా ఉంది. ప్రభుత్వ ఆధీనంలోని ఈ టెలికాం ఆపరేటర్ తన స్థానిక భాగస్వాములతో 4G పరిష్కారాలను పరీక్షిస్తున్న సమయంలోనే 5G 5G నెట్‌వర్క్‌లను కూడా అందుబాటులోకి తీసుకొనిరావడంపై పని చేస్తోంది. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే ప్రభుత్వం ఇంకా 5G స్పెక్ట్రమ్‌ను BSNLకి కేటాయించలేదు. ఎటువంటి స్పెక్ట్రమ్‌ కొనుగోలు లేనప్పటికీ కూడా 5G సేవలను అందించడం కోసం BSNL డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నుండి పొందే ప్రసారాలను చూడటం ఆసక్తికరంగా ఉంది.

BSNL 4G కోర్

BSNL 4G కోర్ ద్వారా 5Gని ప్రారంభించనున్నట్లు మరికొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. మరోక మాటలో చెప్పాలంటే భారతదేశంలోని వినియోగదారుల కోసం 5G సేవలను ప్రారంభించేందుకు టెల్కో 5G NSA (నాన్-స్టాండలోన్) టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది. ఇందుకోసం ముందుగా BSNLకి 4G నెట్‌వర్క్‌ల అవసరం ఎంతగానో ఉంది. ఈ విధంగా చూసుకున్న కూడా ఈ సంవత్సరం చివరి నాటికి BSNL దేశంలో పూణే, మహారాష్ట్ర మరియు కేరళ వంటి పలు రాష్ట్రాలు/నగరాల్లో 4Gని ప్రారంభించే అవకాశం అధికంగా ఉంది.

BSNL

2022 సంవత్సరం ఆగస్టు నాటికి BSNL టెల్కో కేరళలోని నాలుగు జిల్లాల్లో 4G నెట్‌వర్క్‌లను పరీక్షించడం ప్రారంబించనున్నది అని ఇప్పటికే స్పష్టం చేసింది. అదే సమయంలో ప్రభుత్వ నిర్వహణలోని టెల్కో ఇతర రాష్ట్రాల్లో కూడా 4G నెట్‌వర్క్‌లను పరీక్షించవచ్చు. ప్రస్తుతానికి BSNL దీని గురించి ఏమీ చెప్పలేదు అయితే మరికొన్ని నెలల్లో ఈ విషయాలపై స్పష్టమైన వివరణ దొరికే అవకాశం కనిపిస్తాయి. ప్రస్తుతం టెలికాం ఇండస్ట్రీ దృష్టి అంతా స్పెక్ట్రమ్ వేలంపైనే ఉంది.

సరసమైన ధరలో BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌లు

సరసమైన ధరలో BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌లు

BSNL యొక్క సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్‌ల జాబితాలో మొదటి రెండు ప్లాన్‌లు టెల్కో అందించే చౌకైన ఎంపికలు. BSNL నుండి STV_49 ప్లాన్ రూ.49 ధర వద్ద 24 రోజుల చెల్లుబాటు వ్యవధితో మొత్తంగా 2GB డేటాతో పాటు 100 నిమిషాల ఉచిత వాయిస్ కాల్‌లను అందిస్తుంది. మరోవైపు BSNL యొక్క STV_99 ప్యాక్ 22 రోజుల చెల్లుబాటు వ్యవధికి అపరిమిత వాయిస్ కాల్‌లను అందిస్తుంది. అలాగే Voice_135 ప్యాక్ కూడా రూ.135 ధరతో లభిస్తూ 24 రోజుల చెల్లుబాటు వ్యవధికి 1440 నిమిషాల వాయిస్ కాల్‌ను అందిస్తుంది. డేటా ఆఫర్‌లతో కూడిన ప్యాక్‌లను ఎంచుకోనే వారికి BSNL నుండి STV_118 ప్లాన్ ను రూ.118 ధరతో ఎంచుకోవచ్చు. ఇది 26 రోజుల చెల్లుబాటు వ్యవధికి అపరిమిత వాయిస్ కాల్‌లతో పాటు రోజుకు 0.5GB డేటాను అందిస్తుంది. మరోవైపు టెల్కో నుండి STV_147 ప్యాక్ 30 రోజుల చెల్లుబాటు వ్యవధికి అపరిమిత వాయిస్ కాల్‌లతో పాటు మొత్తం వాలిడిటీకి 10GB డేటాను అందిస్తుంది. అదనంగా BSNL ట్యూన్‌లకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది.

Best Mobiles in India

English summary
BSNL Plans to Launch 5G Network in Next Year 2023: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X