Home
News

దూసుకొస్తున్న బీఎస్ఎన్ఎల్ ‘కార్పెట్ నెట్‌వర్క్’

ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్, తన ప్రతిష్టాత్మక కార్పెట్ నెట్‌వర్క్ ప్రాజెక్టులో భాగంగా అంతరాయం లేని వై-ఫై కవరేజ్‌ను ఆఫర్ చేసేందుకు గాను వాయిస్ టెలిఫోనీ ఓవర్ వై-ఫై (VoWiFi) సేవలను అందుబాటులోకి

ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్, తన ప్రతిష్టాత్మక కార్పెట్ నెట్‌వర్క్ ప్రాజెక్టులో భాగంగా అంతరాయం లేని వై-ఫై కవరేజ్‌ను ఆఫర్ చేసేందుకు గాను వాయిస్ టెలిఫోనీ ఓవర్ వై-ఫై (VoWiFi) సేవలను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇందుకుగాను రెవెన్యూ షేరింగ్ మోడల్ క్రింద బ్యాండ్‌విడ్త్‌ను ప్రొవైడ్ చేసేందుకు గాను పలు కంపెనీలతో చర్చలు జరిపేందుకు బీఎస్ఎన్ఎల్ సిద్థమయ్యింది.

నెట్‌వర్క్‌ విస్తరణలో భాగంగా...

నెట్‌వర్క్‌ విస్తరణలో భాగంగా...

నెట్‌వర్క్‌ విస్తరణలో భాగంగా కంపెనీలు అడ్వాన్సుడ్ ఎక్విప్‌మెంట్‌తో ముందుకొచ్చినట్లయితే రెవెన్యూ షేరింగ్ మోడల్ క్రింద బ్యాండ్‌విడ్త్‌ను ప్రొవైడ్ చేసేందుకు తాము సిద్థమని బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్ అనుపమ్ శ్రీవాస్తవ ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. రెవెన్యూ షేరింగ్ అగ్రిమెంట్ క్రింద దేశంలో ఎంపిక చేసిన లొకేషన్స్‌లో అన్‌బ్రోకెన్ వై-ఫై నెట్‌వర్క్‌లను నెలొకల్పే లక్ష్యంగా తాము అడుగులు వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

బీఎస్ఎన్ఎల్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న రిలయన్స్ జియో...

బీఎస్ఎన్ఎల్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న రిలయన్స్ జియో...

పలు మీడియా రిపోర్ట్స్ ప్రకారం బీఎస్ఎన్ఎల్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న రిలయన్స్ జియో ఇప్పటికే వాయిస్ ఓవర్ వై-ఫై సర్వీసులను టెస్ట్ చేయటం ప్రారంభించింది. ఫ్రీ-ఆఫ్-ఛార్జ్ ఎయిర్‌వేవ్స్ క్రింద బీఎస్ఎన్ఎల్‌ రోల్ అవుట్ చేయబోతోన్న వై-ఫై ద్వారా దేశంలో మరిన్ని వై-ఫై హాట్‌స్పాట్‌లను నెలకొల్పే వీలుంటుంది.

5 GHz బ్యాండ్‌లోని 605 MHz స్పెక్ట్రమ్‌ను....

5 GHz బ్యాండ్‌లోని 605 MHz స్పెక్ట్రమ్‌ను....

గతేడాది అక్టోబర్‌లో 5 GHz బ్యాండ్‌లోని 605 MHz స్పెక్ట్రమ్‌ను ప్రభుత్వం డీలైసెన్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో కంపెనీలకు ఏ విధమైన రుసుము చెల్లించకుండా వై-ఫై ఆధారిత టెలికం సేవలను ఆఫర్ చేసే అవకాశం లభించింది. వాయిస్ ఓవర్ వై-ఫై వ్యవస్థను రోల్ అవుట్ చేసే క్రమంలో పాన్ ఇండియా అంతటా శక్తివంతమైన ఆప్టిక్ ఫైబర్‌ను కూడా ఏర్పాటు చేసేందుకు తాము సిద్థంగా ఉన్నామని బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు.

5జీ టెక్నాలజీ సర్వీసెస్‌కు...

5జీ టెక్నాలజీ సర్వీసెస్‌కు...

5జీ టెక్నాలజీ సర్వీసెస్‌కు సైతం ఇదే విధమైన ఫైబరైజేషన్ అవసరమవుతుందని, 5జీ ఇంకా వై-ఫై నెట్‌వర్క్‌లు కొన్ని అంశాల్లో కామన్ ఎలిమెంట్స్‌ను కలిగి ఉన్నాయని ఇదే సమయంలో వీటికి బ్యాకెండ్ ఫైబర్ అనేది అవసరమవుతుందని శ్రీవాస్తవ్ వెల్లడించారు. భారత్ నెట్ 2 ప్రోగ్రామ్ క్రింద ప్రభుత్వం ఆదేశిస్తే 10కి పై రాష్ట్రాల్లో వై-ఫై సేవలను అందిచాలన్న కృతనిశ్చయంతో బీఎస్ఎన్ఎల్ ఉంది. 2022 నాటికి దేశవ్యాప్తంగా 10 మిలియన్ల వై-ఫై హాట్ స్పాట్ లను నెలకొల్పాలను ప్రభుత్వం భావిస్తోన్న నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ఈ టెక్నాలజీ పై ఎక్కువుగా దృష్టిసారిస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL plans voice telephony over WiFi services with ‘Carpet’ network.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X