Home
News

BSNL బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు రూ.75 నుండి ప్రారంభం!! ప్రైవేట్ టెల్కోలకు ఎదురుదెబ్బ

ఇండియాలోని ప్రైవేట్ టెలికాం సంస్థలు తమ యొక్క ప్రీపెయిడ్ టారిఫ్‌ల పెంపుతో ప్రజలు రీఛార్జ్ కోసం అధిక మొత్తంలో ఖర్చు చేయవలసి వస్తోంది. అయితే ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ప్రీపెయిడ్ టారిఫ్‌ల పెంపు సమయంలో ఇతర సర్వీస్ ప్రొవైడర్‌లతో పోలిస్తే తన యొక్క ప్రత్యేక టారిఫ్ వోచర్ (STV)లు రూ.250 కంటే తక్కువ ధరతో లభిస్తున్నందున వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తున్నాయి.

BSNL బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు

BSNL బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు

రూ.94 ధర వద్ద లభించే BSNL యొక్క ప్లాన్ 75 రోజుల ఆకర్షణీయమైన చెల్లుబాటును అందిస్తుంది. ఇది చెల్లుబాటు కాలంలో 3GB డేటా, 100 డొమెస్టిక్ నిమిషాలు ఏదైనా నెట్‌వర్క్‌కి మరియు ముంబై మరియు ఢిల్లీలో జాతీయ రోమింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. అదనంగా ఇది 60 రోజుల పాటు ఉచిత BSNL రింగ్‌టోన్‌లను కూడా అందిస్తుంది. చాలా రోజుల పాటు బ్రాడ్‌బ్యాండ్‌ని ఉపయోగించే కస్టమర్‌లకు వారి ఇంటి వెలుపల ఉన్నప్పుడు ఫోన్ డేటా అవసరం అయితే 3GB డేటా తగినంత ప్లాన్ కావచ్చు. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్

BSNL యొక్క బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ లలో తదుపరిది రూ.88 ధర వద్ద లభించే ప్లాన్. ఈ ప్లాన్ 90 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. అలాగే రూ.209 ధర కలిగిన కాంబో వాయిస్ వోచర్ 90 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. అలాగే రూ.198 ధర కలిగిన STV ప్లాన్ 50 రోజుల చెల్లుబాటును కలిగి ఉండి 2GB రోజువారీ డేటాను ఇస్తుంది. పోస్ట్ పరిమితి తరువాత డేటా స్పీడ్ 40 Kbpsకి పరిమితం చేస్తుంది. BSNL యొక్క తదుపరి ప్రీపెయిడ్ ప్లాన్ రూ.97 ధర వద్ద లభిస్తుంది.ఈ ప్లాన్ 2GB రోజువారీ డేటాను 18 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. ఇది లోక్‌ధున్ కంటెంట్‌కు యాక్సెస్‌ను అందిస్తుంది. ఇది భారతదేశం అంతటా అపరిమిత వాయిస్ కాల్‌లతో వస్తుంది. తదుపరిది రూ.99 ధర వద్ద లభించే ప్లాన్ అపరిమిత వాయిస్ కాల్స్, 99 SMS మరియు రింగ్‌టోన్‌లను అందిస్తుంది మరియు కస్టమర్‌లకు 22 రోజుల చెల్లుబాటును అందిస్తుంది.

రింగ్‌టోన్‌

BSNL తన యొక్క వినియోగదారులకు 50 రోజుల చెల్లుబాటుతో రూ.75 ఖర్చుతో కూడుకున్న ప్లాన్‌ను అందిస్తుంది. ఇది 2GB డేటా, 100 నిమిషాల వాయిస్ కాల్స్ మరియు ఉచిత రింగ్‌టోన్‌లకు యాక్సెస్‌ను 50 రోజుల చెల్లుబాటు కాలంతో అందిస్తుంది. అలాగే BSNL యొక్క రూ.247 ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత వాయిస్ కాల్‌లను మరియు 50GB డేటాను అందిస్తుంది. డేటా పరిమితి తర్వాత డేటా వేగాన్ని 80 Kbpsకి తగ్గిస్తుంది. ఈ ప్లాన్ రోజుకు 100 SMSలను కూడా అందిస్తుంది. BSNL రింగ్‌టోన్‌లకు యాక్సెస్‌ను అదనంగా కలిగి ఉండడమే కాకుండా 30 రోజుల చెల్లుబాటును కలిగి ఉంటుంది.

ప్రత్యేక టారిఫ్ వోచర్‌

BSNL 56 రోజుల చెల్లుబాటుతో రూ.298 ధర వద్ద మరో ప్రత్యేక టారిఫ్ వోచర్‌ను కలిగి ఉంది. ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాల్స్, 1GB రోజువారీ డేటా మరియు రోజుకు 100 SMSలను అందిస్తుంది. చివరిగా BSNL 75 రోజుల చెల్లుబాటుతో అపరిమిత వాయిస్ కాల్స్‌తో రూ.319 ధర వద్ద మరొక ప్రీపెయిడ్ ప్లాన్‌ని కలిగి ఉంది. BSNL రూ.395 వోచర్ 71 రోజుల చెల్లుబాటు కాలానికి 3000 నిమిషాల ఉచిత ఆన్-నెట్ కాల్స్, ఉచిత 1800 నిమిషాల ఆఫ్-నెట్ కాల్స్ మరియు 2Gb రోజువారీ డేటా ప్రయోజనాలను అందిస్తుంది.

BSNL 4G 2022లో ప్రారంభించబడుతుంది

BSNL 4G 2022లో ప్రారంభించబడుతుంది

BSNL టెల్కో సెప్టెంబర్ 2022 నాటికి తన 4G సేవలను ఇండియా అంతటా అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. విస్తరణ ద్వారా మొదటి సంవత్సరంలో సుమారు రూ.900 కోట్ల ఆదాయం పెరుగుతుందని కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసిన్ చౌహాన్ పార్లమెంట్‌లో వెల్లడించారు. BSNL మరియు MTNL యొక్క డిజిన్వెస్ట్‌మెంట్ కోసం ఎటువంటి ప్రతిపాదన పరిశీలనలో లేదని ఆయన తెలిపారు.

BSNL బ్రాడ్‌బ్యాండ్  కొత్త కనెక్షన్ మొదటి నెల తగ్గింపు ఆఫర్

BSNL బ్రాడ్‌బ్యాండ్ కొత్త కనెక్షన్ మొదటి నెల తగ్గింపు ఆఫర్

BSNL యొక్క బ్రాడ్‌బ్యాండ్ సేవలను ఎంచుకున్న కొత్త కస్టమర్లకు మొదటి నెలలో రూ.500 వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్‌ను టెల్కో తన యొక్క వెబ్ సైట్ లో ప్రకటించింది. కొత్త BSNL బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కోసం వెళ్లే కస్టమర్‌లు దేశంలోని అన్ని బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు మరియు సర్కిల్‌లలో వారి మొదటి నెల ఛార్జీపై రూ.500 వరకు అంటే 90% తగ్గింపును పొందేందుకు అర్హులు అవుతారు. ఇది ప్రమోషనల్ ఆఫర్ అయినందున ఈ ఆఫర్ 90 రోజుల వ్యవధి వరకు మాత్రమే ఉంటుంది. ఈ ఆఫర్ ద్వారా BSNL తన బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్ బేస్‌కు మరింత మంది కొత్త కస్టమర్‌లను జోడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ దీనిని 'దీపావళి ధమాకా ఆఫర్ 2021' పేరుతో పిలుస్తోంది. ఈ ప్రత్యేకమైన ఆఫర్ నవంబర్ 1, 2019 నుండి జనవరి 29, 2022 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీకు BSNL నుండి కొత్త బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కావాలంటే మీరు నేరుగా మీ ఇంటి వద్ద కూర్చొని కంపెనీ వెబ్‌సైట్ నుండి బుక్ చేసుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Prepaid Plans Comes at Budget Prices to Compete With Private Telcos
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X