BSNL ప్రీపెయిడ్ ప్లాన్స్ మరింత ఖరీదైనవిగా మారాయి!! వివరాలు ఇవిగో

|

భారత ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన ప్రీపెయిడ్ ప్లాన్‌ల టారిఫ్‌లను పెంచింది. ఇతర ఆపరేటర్ల మాదిరే ఈ టెల్కో కూడా తన ప్రతి కస్టమర్ నుండి మరింత ఆదాయాన్ని పొందాలని చూస్తోంది. వొడాఫోన్ ఐడియా (Vi) మరియు భారతీ ఎయిర్‌టెల్‌ కూడా ఇప్పటికే ధరలను పెంచాయి. అంతేకాకుండా ఇప్పుడు పరిశ్రమలో సగటున ప్రతి కస్టమర్ (ARPU) సగటు ఆదాయం కనీసం రూ.200 కి పెంచాలని చూస్తున్నారు.

BSNL

కానీ ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఈ ధరను అందుకోవడం చాలా కష్టం. అందువల్ల ఆపరేటర్లు టారిఫ్ పెంపు వైపు చూస్తున్నారు మరియు ప్లాన్‌ల ధరలను పెంచుతున్నారు లేదా వారి ప్రస్తుత ప్లాన్‌ల ప్రయోజనాలను తగ్గించి అదే ధరకే అందిస్తున్నారు. BSNL కూడా పరోక్ష టారిఫ్ పెంపును అమలు చేసింది. ఎందుకంటే దాని ప్రస్తుత ప్లాన్ల ప్రయోజనాలను తగ్గించింది కానీ ధరను ఏమాత్రం మార్చలేదు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

<strong>WhatsApp డెస్క్‌టాప్ యాప్‌లో కొత్తగా ఎడిటింగ్ టూల్స్ !! వివరాలు ఇవిగో</strong>WhatsApp డెస్క్‌టాప్ యాప్‌లో కొత్తగా ఎడిటింగ్ టూల్స్ !! వివరాలు ఇవిగో

ఖరీదైనవిగా మారిన BSNL ప్రీపెయిడ్ ప్లాన్స్

ఖరీదైనవిగా మారిన BSNL ప్రీపెయిడ్ ప్లాన్స్

BSNL రూ.49, రూ.75 మరియు రూ.94 వోచర్లతో సహా మూడు ప్రత్యేక టారిఫ్ వోచర్‌లను (STV లు) సవరించింది. వీటితో పాటుగా రూ.106, రూ.107, రూ.197, మరియు రూ.397 ప్లాన్ వోచర్‌లు (PV లు) కూడా ఇప్పుడు సవరించిన ప్రయోజనాలతో వస్తాయి. ఈ ప్లాన్ల ద్వారా అందించే ప్రయోజనాలను BSNL టెలికం తగ్గించింది. పైన పేర్కొన్న అన్ని ప్లాన్‌లు ఇప్పుడు తగ్గిన చెల్లుబాటుతో వస్తాయి. ఈ మార్పులు ఆగస్టు 1, 2021 న అమలులోకి వచ్చాయి.

STV ప్లాన్

వినియోగదారులకు 28 రోజుల చెల్లుబాటును అందించే రూ.49 STV ప్లాన్ ఇప్పుడు కేవలం 24 రోజులు వాలిడిటీని మాత్రమే అందిస్తుంది. అదేవిధంగా 60 రోజుల చెల్లుబాటుతో వచ్చిన రూ.75 STV ప్లాన్ ఇప్పుడు 50 రోజులు మాత్రమే వస్తుంది.

ARPU

BSNL ఇప్పుడు దాని వినియోగదారుల నుండి అధిక ARPU ని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో రెండవ అతిపెద్ద ఆపరేటర్ అయిన భారతీ ఎయిర్‌టెల్ భారతదేశవ్యాప్తంగా తన రూ.49 ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా తీసివేసింది. ఇప్పుడు కస్టమర్‌లు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు డేటా సేవలను వినియోగించుకోవడానికి ఎయిర్‌టెల్‌తో కనీసం రూ.79 ఖర్చు చేయాల్సి ఉంటుంది. పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం రాబోయే రోజుల్లో BSNL తన ప్రీపెయిడ్ ప్లాన్‌ల టారిఫ్‌లను పెంచే అవకాశం ఉంది. ఈ మార్పు చూడటానికి ఆశ్చర్యం కలిగించదు మరియు టెల్కోల ఉద్దేశాన్ని చాలా మంది అర్థం చేసుకుంటారు.

Best Mobiles in India

English summary
BSNL Prepaid Plans Have Become More Expensive!! Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X