Home
News

BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌లు... రోజువారి 5GB డేటా

ఇండియాలో వున్న అన్ని టెలికాం కంపెనీలలో భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) ఆపరేటర్ తప్ప మిగతా అన్ని టెల్కోలు వాటి యొక్క ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచాయి. 2019 చివరలో దేశంలోని అన్ని ప్రైవేట్ టెలికాం కంపెనీలు వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్‌టెల్ మరియు రిలయన్స్ జియోలు తమ సుంకాలను 40% పెంచడం చూశాము.

బిఎస్ఎన్ఎల్

ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ తన పాత రిటైల్ ధరల వద్దనే ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నది. ఇతర ఆపరేటర్లు డేటా మరియు వాయిస్ ప్లాన్లను అధిక ధర వద్ద అందిస్తున్నాయి. వినియోగదారుల కోసం బిఎస్ఎన్ఎల్ యొక్క ప్లాన్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నందున బిఎస్ఎన్ఎల్ మిగతా వాటికి గట్టి పోటీని ఇస్తున్నది.

 

 

ప్రీపెయిడ్ ప్లాన్‌

ఎక్కువ మంది వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి మరొక కారణం కూడా ఉంది. మిగతా అన్ని టెలికాం ఆపరేటర్లు నెలకు 2GB, 3GB లేదా 1.5GB రోజువారీ డేటాతో ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఎక్కువగా అందిస్తుండగా BSNLమాత్రం 5GB రోజువారీ డేటాను అందించే ప్లాన్లను తీసుకువస్తున్నాయి. వాటి గురించి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

5GB డైలీ డేటాతో BSNL ప్రీపెయిడ్ ప్లాన్

5GB డైలీ డేటాతో BSNL ప్రీపెయిడ్ ప్లాన్

అధిక మొత్తంలో భారీగా డేటాను వినియోగించే వినియోగదారుల కోసం బిఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లో గల మొదటి ప్రీపెయిడ్ ప్లాన్ PRBSTV రూ.548. ఇది దీని పేరుకు తగ్గట్లుగానే ఈ ప్లాన్ బిఎస్‌ఎన్‌ఎల్ నుండి వస్తున్న స్పెషల్ టారిఫ్ వోచర్ (STV) ఇది 548 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. ఈ STV ప్లాన్ యొక్క చెల్లుబాటు 90 రోజులు. ఈ ప్లాన్ రోజుకు 5 జిబి డేటాను అందిస్తుంది. ప్రతి రోజు 5GB డేటా అయిపోయిన తరువాత దాని యొక్క స్పీడ్ 80 Kbps కి తగ్గుతుంది. అయితే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఎటువంటి కాలింగ్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనంతో రాదని చందాదారులు గమనించాలి.

 

 

డేటా క్యాప్ లేని బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్లు

డేటా క్యాప్ లేని బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్లు

బిఎస్ఎన్ఎల్ నుండి వస్తున్న మరోక ప్రత్యేకమైన ప్లాన్లలో రూ.1,098 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా ఉంది. బిఎస్ఎన్ఎల్ నుండి వస్తున్న ఈ ప్రీపెయిడ్ ప్లాన్ లాంగ్ టర్మ్ ప్లాన్లలో ఒకటి. ఇది 84 రోజుల చెల్లుబాటు కాలంతో వస్తుంది. సెప్టెంబర్ 2019 లో బిఎస్ఎన్ఎల్ ఈ ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క
చెల్లుబాటును 75 రోజులకు తగ్గించింది.

 

ప్రయోజనాలు

ప్రయోజనాలు

కానీ ఇప్పుడు ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటును మళ్ళి 84 రోజులకు పెంచినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ప్లాన్ రోజువారీ డేటా పరిమితితో కాకుండా అపరిమిత డేటాను అందిస్తుంది. ఏదేమైనా ఈ ప్లాన్ తన మొత్తం చెల్లుబాటు కాలంలో మొత్తంగా 375GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ వంట ప్రయోజనాలను అందిస్తుంది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 

 

 

 

రోజుకు 3GB డేటాతో బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్

రోజుకు 3GB డేటాతో బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్

బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క ప్రీపెయిడ్ ప్లాన్లలో రోజుకు 3 జిబి డేటాను అందించే ప్లాన్లు కూడా ఉన్నాయి. అయితే పైన పేర్కొన్న ప్లాన్‌లతో పోలిస్తే ఈ ప్లాన్ కేవలం 8 రోజుల పరిమిత చెల్లుబాటుతో వస్తుంది. ఈ చెల్లుబాటు వ్యవధిలో బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క రూ.78 STV డేటా ప్లాన్ చందాదారులు రోజుకు 3 జిబి డేటాను అందిస్తుంది. ఈ డేటా అయిపోయన తరువాత దీని యొక్క డేటా వేగం 40Kbps కు తగ్గించబడుతుంది. ఇందులో రోజుకు 250 నిమిషాల వాయిస్ కాలింగ్ ప్రయోజనం కూడా ఉంటుంది. అదనపు ప్రయోజనాలలో 250 నిమిషాల వాయిస్ కాలింగ్‌తో పాటు ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 250 నిమిషాల వీడియో కాలింగ్ కూడా లభిస్తుంది. వీటన్నిటితో పాటు ఈ ప్లాన్ EROS NOW ఎంటర్టైన్మెంట్ సర్వీసును కూడా అందిస్తుంది.

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.1,999 ప్రీపెయిడ్ ప్లాన్

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.1,999 ప్రీపెయిడ్ ప్లాన్

బిఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న రూ.1,999 ప్రీపెయిడ్ ప్లాన్ సాధారణంగా 365 రోజుల చెల్లుబాటుతో అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తుంది. ఇండియా యొక్క 71 వ గణతంత్ర దినోత్సవం కనుకగా కంపెనీ రూ.1,999 ప్లాన్ యొక్క చెల్లుబాటును మరొక 71 రోజుల పాటు పొడిగించింది. ఈ ఆఫర్ లో భాగంగా ఈ ప్లాన్ 436 రోజుల పాటు యాక్సిస్ ను అందిస్తుంది. ఇది అందిస్తున్న ప్రయోజనాల విషయానికొస్తే వినియోగదారులు ప్రతిరోజూ 250 నిమిషాల వాయిస్ కాలింగ్, 3GB రోజువారీ డేటా మరియు రోజుకు 100 SMSల ప్రయోజనాలు లభిస్తాయి. ఇతర ప్రయోజనాలలో మొత్తం చెల్లుబాటు కాలానికి BSNL TV చందా కూడా లభిస్తుంది.

 

 

బిఎస్‌ఎన్‌ఎల్ రూ .1,999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్రయోజనాలు

బిఎస్‌ఎన్‌ఎల్ రూ .1,999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్రయోజనాలు

ఈ ఆఫర్ వ్యవధి 2020 జనవరి 26 నుండి 2020 ఫిబ్రవరి 15 వరకు మాత్రమే ఉంటుంది. గత నెలలో బిఎస్ఎన్ఎల్ రూ.1,999 ప్లాన్ 60 రోజుల అదనపు వాలిడిటీని ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ పరిమిత కాల ఆఫర్ లలో భాగంగా అదే ప్లాన్‌ 71 రోజుల అదనపు చెల్లుబాటును అందిస్తున్నది. టెల్కో తన ARPU ని పెంచడానికి మరియు రూ .1,999 ప్లాన్‌తో కొత్త వినియోగదారులను ఆకర్షించాలని చూస్తోంది. BSNL నుండి వస్తున్న ఈ లాంగ్ టర్మ్ రీఛార్జ్ ప్లాన్ ఇప్పటికే ఉన్న మరియు క్రొత్త కస్టమర్లకు అందుబాటులో ఉంది. కొత్త బిఎస్‌ఎన్‌ఎల్ చందాదారులు తమ మొదటి రీఛార్జ్ ఎంపికగా రూ.1,999 ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Prepaid Plans Offer up to 5GB Mobile Data daily
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X