BSNL యొక్క ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ల వాలిడిటీలో సరికొత్త సవరణలు...
భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఏకైక టెలికాం ఆపరేటర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ BSNL ప్రైవేట్ ఆపరేటర్లకు పోటీగా ఉండడానికి ఎప్పటికప్పుడు తన యొక్క ప్లాన్‌లలో మార్పులను చేస్తున్నది. అందులో భాగంగా ఇప్పుడు రూ.187 ప్రీపెయిడ్ ప్లాన్‌ను సవరించింది. BSNL యొక్క అన్ని సర్కిల్ లలో దాని ప్రీపెయిడ్ ప్లాన్‌ల కొత్త మార్పులను సంబందించిన వివరాలను ట్విట్టర్ ద్వారా బహిర్గతం చేసింది. అదే ప్రకారం రూ.187 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్‌ను టెల్కో సవరించినట్లు స్పష్టమైంది. ఈ ప్లాన్ రూ.147, రూ.247, రూ.447 మరియు అంతకంటే ఎక్కువ ధర కలిగిన ఇతర ప్లాన్‌లతో పాటు అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. సవరించిన BSNL ప్రీపెయిడ్ ప్లాన్ అందించే కొత్త ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL రూ.187 ప్రీపెయిడ్ ప్లాన్ కొత్త సవరణలు
BSNL యొక్క రూ.187 ప్రీపెయిడ్ ప్లాన్ కొత్త సవరణల విషయానికి వస్తే ఈ ప్లాన్ ఇప్పుడు 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అయితే ఇది గతంలో 24 రోజుల తక్కువ చెల్లుబాటుతో మాత్రమే లభించేది. ఇంకా ఈ ప్లాన్ ఇప్పుడు లోకల్ లేదా STD కాల్స్ అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. ఢిల్లీ మరియు ముంబై సర్కిల్‌లలోని MTNL నెట్‌వర్క్‌కు కూడా అపరిమిత వాయిస్ కాల్‌లు వర్తిస్తాయి. అలాగే ఈ ప్లాన్ రోజుకు 2GB డేటా ప్రయోజనంను అందిస్తుంది. రోజువారి FUP డేటా ముగిసిన తర్వాత డేటా వేగం 80 kbpsకి తగ్గించబడుతుంది. ఇది కాకుండా ఈ ప్లాన్ ఏ నెట్‌వర్క్‌కైనా రోజుకు 100 SMSలు మరియు ఉచిత PRBT రింగ్‌టోన్‌లను అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు కొత్తగా సవరించబడినందున దీనిని BSNL వెబ్‌సైట్ లేదా థర్డ్-పార్టీ యాప్‌లు లేదా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. ప్రత్యర్థుల నుండి సారూప్య ప్లాన్‌లతో పోలిస్తే ఇది 4 రోజుల అదనపు చెల్లుబాటు మరియు అదనపు డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇది ఎంచుకోవడానికి మంచి ఆఫర్.

BSNL సవరించిన ఇతర ప్రీపెయిడ్ ప్లాన్‌లు
ప్రభుత్వ టెల్కో BSNL రూ.187 ప్రీపెయిడ్ ప్లాన్‌ను సవరించిన తర్వాత సంస్థ రూ. 56, రూ. 57 మరియు రూ. 58 సరసమైన ధరల వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్‌లను కూడా సవరించింది. టెల్కో ఈ ప్లాన్‌ల ధరలను తగ్గించింది మరియు వాటిని మరింత సరసమైనదిగా చేసింది. అయితే ఈ తక్కువ-ధర ప్లాన్‌ల యొక్క బండిల్ ప్రయోజనాలు వాటి ధరల సవరణ తర్వాత అలాగే ఉంటాయి. అలాగే వాటి చెల్లుబాటు అలాగే ఉంటుంది. ఇటీవలి సవరణ ప్రకారం రూ. 58 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రూ.57కి అందుబాటులో ఉంది. అలాగే రూ.57 ప్లాన్ రూ.56 ధర వద్దకి సవరించబడింది. చివరిగా రూ.56 ప్రీపెయిడ్ ప్లాన్ రూ.54కి సవరించబడింది.

BSNL రూ.2,399 ప్లాన్‌లో మార్పులు
వినియోగదారులకు మొదటగా 365 రోజుల చెల్లుబాటును అందించే రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు 425 రోజుల వాలిడిటీతో వస్తుంది అంటే 60 రోజులు ఎక్కువ. ఈ ఆఫర్ 2021 ఆగస్టు 21 నుండి నవంబర్ 19 మధ్య రీఛార్జ్ చేసుకున్న వారికి వర్తిస్తుంది. వినియోగదారులు ఈ ప్లాన్ ద్వారా రోజువారీ 3GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను పొందుతారు. వీటితో పాటుగా వినియోగదారులకు ఇరోస్ నౌ మరియు BSNL ట్యూన్స్ యొక్క అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

BSNL రూ.1,999 ప్లాన్‌లో మార్పులు
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ టెల్కో మార్పులు చేసిన వాటిలో రూ.1,999 ప్లాన్ కూడా ఉంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 100GB అదనపు డేటాను కూడా పొందుతారు. ఈ ప్లాన్ కూడా 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇంకా ఈ ప్లాన్‌తో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS లతో పాటుగా లోక్‌ధన్ కంటెంట్ మరియు ఈరోస్ నౌ సబ్‌స్క్రిప్షన్‌ని ఉచితంగా పొందవచ్చు. ఇంతకుముందు ఈ కంపెనీ ఈ ప్లాన్‌తో 500GB సాధారణ డేటాను అందించేది కానీ ఇప్పుడు అది మొత్తంగా 600GB డేటాను అందిస్తుంది. అయితే FUP డేటా వినియోగం తర్వాత వినియోగదారులు డేటాను 80 Kbps వేగంతో బ్రోజ్ చేయడానికి అనుమతిస్తుంది.

BSNL 4G సిమ్ ఫ్రీ ఆఫర్
BSNL యొక్క కొత్త సిమ్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు మరియు ఇతర ఆపరేటర్ల నుండి BSNL నెట్‌వర్క్‌కు పోర్ట్ చేసే వారికి ఇప్పుడు ఉచితంగా 4G సిమ్ కార్డులను సంస్థ అందిస్తోంది. ప్రారంభంలో ఈ ఆఫర్ ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ప్రారంభించబడింది. తరువాత ఇది సెప్టెంబర్ వరకు ఆఫర్‌ను పొడిగించింది. ఇప్పుడు ఈ ఆఫర్ డిసెంబర్ వరకు పొడిగించబడినట్లు సంస్థ నివేదించింది. సాధారణంగా BSNL యొక్క 4G SIM కార్డ్ రూ.20 ధర వద్ద లభిస్తుంది. ఇది కొత్త వినియోగదారులకు మరియు MNP పోర్ట్ వినియోగదారులకు రూ.100 కంటే ఎక్కువ రీఛార్జ్ చేస్తే మినహాయించబడుతుంది. ఈ BSNL ఉచిత 4G సిమ్ ఆఫర్ BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్స్ (BSNL) మరియు రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా పొందవచ్చు.


Click it and Unblock the Notifications