BSNL బెస్ట్ ఫ్రీపెయిడ్ ప్లాన్లు ఇవే
దేశీయ రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియోకు పోటీగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ఇప్పటి వరకు చాలా ప్రీపెయిడ్ చాలా ఆఫర్లను ప్రకటించింది.
దేశీయ రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియోకు పోటీగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ఇప్పటి వరకు చాలా ప్రీపెయిడ్ చాలా ఆఫర్లను ప్రకటించింది. రూ.9 రీఛార్జ్ ప్లాన్ మొదలుకొని రూ.666 రీఛార్జ్ ప్లాన్ వరకు చాలా ప్లాన్ లను యూజర్లకు అందించింది. కాగా ఈ ఆగస్టు నెలలో చాలా ప్లాన్ లను మార్కెట్ లో ప్రవేశబెట్టింది. ఈ శీర్షికలో భాగంగా ఆగష్టు నెలలో బీఎస్‌ఎన్‌ఎల్ విడుదల చేసిన ప్లాన్ లను మీకు తెలుపుతున్నాము. ఒకసారి చెక్ చేసుకోండి.

రూ.9 , రూ.29 రీఛార్జ్ ప్లాన్స్....
బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకొచ్చిన ఈ రూ.9, రూ.29 రీఛార్జ్ ప్లాన్స్ ఢిల్లీ, ముంబై మినహా మిగతా అన్ని ప్రాంతాలకు లభ్యమవుతోంది. అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు,2జీబీ డేటా, 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, ఉచితంగా పర్సనలైజ్డ్ రింగ్‌బ్యాక్ టూన్లను ఆఫర్ చేయనుంది.అయితే రూ.9 రీఛార్జ్ ప్లాన్ ఒక్క రోజు వ్యాలిడిటీ కాగా , రూ.29 రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 7 రోజులు మాత్రమే

రూ.36 , రూ.37 రీఛార్జ్ ప్లాన్స్....
బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకొచ్చిన ఈ రూ.36, రూ.37 రీఛార్జ్ ప్లాన్స్ అన్ని ప్రాంతాలలో లభ్యమవుతోంది.అయితే ఈ రెండు ప్లాన్స్ లో అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. డేటా మాత్రం 50 mb BSNL ఆఫర్ చేస్తుంది. ఈ రెండు ప్లాన్స్ వాలిడిటీ కేవలం 30 రోజులు మాత్రమే. ఒక వేళా అధిక డేటా కావాలి అనుకున్నవారు ఇతర టాప్ అప్స్ తో ఈ ప్లాన్ ను పొడగించవచ్చు.

జై జవాన్ ప్లాన్....
బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకొచ్చిన ఈ జై జవాన్ ప్లాన్ రూ.113 తో రీఛార్జ్ చేసుకుంటే 2700మినిట్స్ bsnl టు bsnl ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు అలాగే 2700మినిట్స్ bsnl టు ఇతర నెట్వర్క్స్ కు ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు.అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు మాత్రమే.

రూ.186 రీఛార్జ్ ప్లాన్....
బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకొచ్చిన ఈ రూ.186 రీఛార్జ్ ప్లాన్ ఢిల్లీ, ముంబై మినహా మిగతా అన్ని ప్రాంతాలకు లభ్యమవుతోంది. అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు,1 జీబీ డేటా, 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, ఉచితంగా పర్సనలైజ్డ్ రింగ్‌బ్యాక్ టూన్లను ఆఫర్ చేయనుంది. అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే.

రూ.429 , రూ.485, రూ.666 రీఛార్జ్ ప్లాన్స్....
బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకొచ్చిన ఈ రూ.429 ప్లాన్ వాలిడిటీ 81 రోజులు కాగా రూ.485 మరియు రూ.666 ప్లాన్ల వాలిడిటీ 129,180 రోజులు మాత్రమే.ఈ మూడు ప్లన్స్ లోను అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు,1.5 జీబీ డేటా, 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, ఉచితంగా పర్సనలైజ్డ్ రింగ్‌బ్యాక్ టూన్లను ఆఫర్ చేయనుంది.


Click it and Unblock the Notifications








