600GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో BSNL రీఛార్జీ ప్లాన్.. 365 రోజుల వ్యాలిడిటీ!
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. గత నెలలో జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా సంస్థలు భారీగా రీఛార్జ్ ధరలు పెంచడంతో అనేక మంది యూజర్లు BSNL పోర్టింగ్ అవుతున్నారు. టెలికాం సర్కిల్ ల వారీగా లక్షల సంఖ్యలో యూజర్లు BSNL నెట్‌వర్క్ లో జాయిన్ అవుతున్నారు. రీఛార్జ్ ధరలు తక్కువగా ఉండడం సహా 4G, 5G సేవల ప్రారంభం కానున్న నేపథ్యంతో అనేక మంది BSNL వైపు చూస్తున్నారు.
31 రోజుల్లోనే 2.31 లక్షల మంది వినియోగదారులు :
జులై నెలలో ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 31 రోజుల్లోనే 2.31 లక్షల మంది వినియోగదారులు BSNL కనెక్షన్ లు తీసుకున్నట్లు తెలిపింది. 4G కొన్నిరోజుల్లో ప్రారంభం కానుండగా.. 5G నెట్‌వర్క్ కూడా 2025 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

నెలకు ఖర్చు కేవలం రూ.166 మాత్రమే..!
ప్రస్తుతం BSNL రీఛార్జ్ ప్లాన్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. అయితే ప్రస్తుతం 365 రోజుల వ్యాలిడిటీతో రూ.1999 రీఛార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. అంటే నెలవారీగా చూసుకుంటే కేవలం రూ.166 మాత్రమే ఖర్చు కానుంది. ప్రస్తుతం ఉన్న ప్లాన్‌లో మెరుగైన ప్లాన్‌గా గుర్తింపు పొందింది.
600GB హైస్పీడ్ డేటా :
బీఎస్‌ఎన్‌ఎన్ రూ.1999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తో అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు మొత‌్తంగా 600GB హైస్పీడ్ డేటాను పొందవచ్చు. ఈ డేటా వ్యాలిడిటీ 365 రోజులు ఉంటుంది. అంటే రోజువారీ డేటా వినియోగంపై ఎటువంటి పరిమితి లేదు. దీంతోపాటు మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.
ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో BSNL 4G సర్వీసులను ప్రారంభం కానున్నాయి. 4G నెట్‌వర్క్ కోసం దేశవ్యాప్తంగా లక్ష టవర్ల ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024 అక్టోబర్ చివరి నాటికి 80,000 టవర్‌లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి జోతిరాదిత్య సింధియా తెలిపారు. 2025 మార్చి నాటికి మిగిలిన 21,000 టవర్ల ఏర్పాటును పూర్తి చేస్తామన్నారు.
సెప్టెంబర్ నాటికి మరిన్ని ప్రాంతాల్లో 4G నెట్ వర్క్ అందుబాటులోకి తీసుకురావాలని BSNL భావిస్తోంది. గ్రామాల్లోనూ 4G సర్వీసులు అందించేందుకు అవసరమైన ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబర్ నెల చివరి నాటికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 4G ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. BSNL వినియోగదారులు 4G సిమ్ కార్డులకు అప్ గ్రేడ్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటోంది.
గిజ్ బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








