Home
News

రూ.200 కంటే తక్కువ ధరలో రీఛార్జ్‌ ప్లాన్‌ల కోసం చూస్తున్నారా.. లిస్ట్‌ ఇదిగో..!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL యూజర్లను ఆకట్టుకొనేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా లక్ష 4G టవర్లను ఏర్పాటు చేస్తోంది. దీంతోపాటు సిమ్‌ కార్డులను ఇంటి వద్దకే డెలివరీ చేసేలా ప్రత్యేక లింక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతోపాటు హైదరాబాద్‌లో Q-5G టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ప్రస్తుతం ఇతర టెలికాం సంస్థలతో పోలిస్తే BSNL.. తక్కువ ధరకు రీఛార్జ్‌ ప్లాన్‌లో అందుబాటులోకి తీసుకొస్తోంది. తక్కువ ధర కారణంగానే అనేక మంది బీఎస్‌ఎన్‌ఎల్‌ ను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం రూ.200 కంటే తక్కువ ధరలో అనేక ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి.

BSNL Prepaid Recharge plans under Rs200 benefits

రూ.107 రీఛార్జ్‌ ప్లాన్‌ :
బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లు ఈ ప్లాన్‌లో భాగంగా 200 నిమిషాల వాయిస్‌ కాలింగ్‌ సదుపాయం ఉంది. మరియు మొత్తంగా 3GB డేటాను పొందవచ్చు. ఈ డేటా వినియోగం అనంతరం ఇంటర్నెట్‌ వేగం 40 Kbps కు తగ్గుతుంది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 35 రోజులుగా ఉంది.

రూ.147 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD, రోమింగ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు యూజర్లు మొత్తంగా 10GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ డేటా అనంతరం డేటా వేగం 40 kbps గా ఉంటుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది.

BSNL Prepaid Recharge plans under Rs200 benefits

రూ.153 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు. మరియు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు డేటా పరంగా ప్రతిరోజు 1GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.

రూ.197 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు తొలి 15 రోజుల్లో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లు, ప్రతిరోజు 2GB డేటాను ఉపయోగించుకోవచ్చు. అయితే 15 రోజుల అనంతరం ఈ ప్రయోజనాలను అన్ని నిలిచిపోతాయి. అయితే 70 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ సమయంలో ఇన్‌కమింగ్ కాలింగ్‌ యాక్టివేట్‌లోనే ఉంటుంది.

రూ.199 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. డేటా పరంగా ప్రతిరోజు 2GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ డేటా వినియోగం అనంతరం ఇంటర్నెట్‌ స్పీడ్ 40 kbps కు తగ్గుతుంది.

BSNL ఇటీవలే సిమ్‌ కార్డుల డోర్‌ డెలివరీ సేవలను ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేకంగా పోర్టల్‌ను తీసుకొచ్చింది. పోస్ట్‌ పెయిడ్‌, ప్రీపెయిడ్‌ సిమ్‌ కార్డులతోపాటు పోర్టింగ్‌ ఆప్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం ఈ లింక్ https://sancharaadhaar.bsnl.co.in/BSNLSKYC/ ను లాంచ్‌ చేసింది.

ఈ లింక్‌ క్లిక్ చేసిన అనంతరం పిన్‌కోడ్, పేరు, ప్రత్యామ్నాయ ఫోన్‌ నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం సిమ్‌ కార్డు ఎవరి కోసం కొనుగోలు చేస్తున్నారో చెప్పాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయ ఫోన్‌ నంబర్‌కు వచ్చిన OTP ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సర్వీసులు ఉచితంగా అందిస్తుందో లేదో వెల్లడి కాలేదు. BSNL హెల్ప్‌లైన్‌ నంబర్‌ 18001801503 నంబర్‌కు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.

Best Mobiles in India

English summary
BSNL Prepaid Recharge plans under Rs200 Price here is the list and benefits
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X