రూ.200 కంటే తక్కువ ధరలో BSNL ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లు.. వీరికి బాగా ఉపయోగం..!
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL యూజర్లను ఆకట్టుకొనేందుకు అనేక రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా అనేక రీఛార్జ్ ప్లాన్‌లను విడుదల చేస్తోంది. అయితే ఈ రీఛార్జ్ ప్లాన్‌లు ప్రైవేటు నెట్‌వర్క్‌ల ధరల కంటే తక్కువకే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్ 4G నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా (BSNL Prepaid Recharge plans under Rs200)అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా టవర్ల నిర్మాణం చేపడుతోంది.
ఈ సంవత్సరం మే నెల నాటికి లక్ష టవర్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. దీంతోపాటు 5G నెట్‌వర్క్‌ను కూడా ఈ సంవత్సరం జూన్‌ను ప్రారంభించాలని భావిస్తోంది. ఎంపిక చేసిన నగరాల్లో తొలుత 5G అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం BSNL రూ.200 కంటే తక్కువ ధరలో అనేక బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. కేవలం కాలింగ్ కోసమే ఫోన్ ఉపయోగించే వారికి ఇవి అనుకూలంగా ఉంటాయి. ఇందులో కేవలం కాలింగ్, SMS ల కోసమే తీసుకొచ్చిన ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లు కూడా ఉన్నాయి. ఫీచర్ ఫోన్ యూజర్లు సహా ఇంటర్నెట్ అవసరం లేని వారి కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకురావాలని ఇటీవల ట్రాయ్ ఆదేశించింది. బీఎస్‌ఎన్‌ఎల్ సహా ఇతర టెల్కోలు కూడా ఈ తరహా ప్లాన్‌లను తీసుకొచ్చాయి.
BSNL రూ.99 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ (BSNL RS99 Recharge Plan) ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 17 రోజులుగా ఉంది. అదే రూ.107 ప్లాన్‌లో భాగంగా 3GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు 200 నిమిషాల వరకు కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 35 రోజులుగా ఉంది.
బీఎస్‌ఎన్‌ఎల్ రూ.118 రీఛార్జ్ ప్లాన్‌లో (BSNL RS118 Recharge Plan) భాగంగా 10GB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్ లోకల్ / STD కాల్స్ సదుపాయం ఉంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 20 రోజులుగా ఉంది. అదే రూ.147 ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ లోకల్ / STD కాలింగ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది.
బీఎస్‌ఎన్‌ఎల్ రూ.153 రీఛార్జ్ ప్లాన్‌లో (BSNL RS153 Recharge Plan) భాగంగా 26GB డేటాను పొందవచ్చు. ఈ డేటాను వినియోగించిన తర్వాత డేటా వేగం 40 kbps గా ఉండనుంది. దీంతోపాటు ప్రతిరోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఉంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 26 రోజులుగా ఉంది.
బీఎస్‌ఎన్‌ఎల్ రూ.187 ప్లాన్‌లో (BSNL RS187 Recharge Plan) భాగంగా అన్‌లిమిటెడ్ లోకల్ / STD కాల్స్ చేసుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. మరియు రోజువారీ 1.5GB డేటాను పొందవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.
రూ.198 రీఛార్జ్ ప్లాన్ ద్వారా BSNL యూజర్లు ఏకంగా 40 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ డేటాను వినియోగించిన అనంతరం ఇంటర్నెట్ వేగం 40kbps కు తగ్గుతుంది.
బీఎస్‌ఎన్‌ఎల్ రూ.199 రీఛార్జ్ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ సహా రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 2GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో భాగంగా జింగ్ మ్యూజిక్ సహా హార్డీ గేమ్స్, ఛాలెంజర్ ఏరీనా గేమ్స్ సహా ఇతర ప్రయోజనాలను పొందవచ్చు.


Click it and Unblock the Notifications








