Home
News

తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ సహా ప్రయోజనాలు అందించే BSNL ప్రీపెయిడ్‌ రీఛార్జీ ప్లాన్‌లు..!

ఇటీవల ప్రముఖ టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా తమ ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ల ధరలను భారీగా పెంచిందింది. సుమారు సంస్థలు 11 శాతం నుంచి గరిష్టంగా 25 శాతం వరకు ధరలను పెంచాయి. జియో, ఎయిర్‌టెల్‌ కొత్త ధరలు జులై 3వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. వోడాఫోన్‌ ఐడియా కొత్త ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ రంగ సంస్థ BSNL మినహా మిలిగిన సంస్థలు ధరలు పెంచడంతో అధిక శాతం మొబైల్ వినియోగదారులపై భారం పడింది.

అయితే ప్రభుత్వం రంగ టెలికాం సంస్థ BSNL మాత్రం పాత ధరల్లోనే సేవలను అందిస్తోంది. మిగిలిన సంస్థలతో పోలిస్తే ఈ ధరలు చాలా తక్కువ అయితే అధికర ప్రయోజనాలను అందిస్తోంది. అధిక ధరలతో మొబైల్‌ ఫోన్‌ల వినియోగదారులు BSNL వైపు చూసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న వినియోగదారులు సహా ఇతరుల కోసం రీఛార్జ్‌ ధరల వివరాలు మీకోసం.

BSNL recharge plans 2024

BSNL రూ.107 ప్లాన్‌ : ఈ ప్లాన్‌ ద్వారా 35 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా 200 నిమిషాల కాలింగ్‌ సమయాన్ని పొందవచ్చు. మరియు మొత్తంగా 3G డేటాను పొందవచ్చు. BSNL అందిస్తున్న అత్యంత తక్కువ ధర కలిగిన ప్లాన్‌లలో ఇది కూడా ఒకటిగా ఉంది.

BSNL రూ.108 ప్లాన్‌ : ఇది కొత్త యూజర్లకు తొలి రీఛార్జ్‌ కూపన్‌ (FRC) ప్లాన్‌ గా ఉంది. దీని ద్వారా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు. మరియు 1GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.

రూ.147 రీఛార్జీ ప్లాన్‌ : ఈ ప్లాన్‌తో రీఛార్జీ చేయించుకుంటే 30 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సహా 10GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు BSNL ట్యూన్‌లను ఉచితంగా పొందవచ్చు. ఈ ప్లాన్‌లో ఎటువంటి ఉచిత SMS లు లభించవు.

రూ.197 ప్రీపెయిడ్‌ రీఛార్జీ ప్లాన్‌ : సిమ్‌ యాక్టివ్‌గా ఉంచేందుకు ఎదురుచూస్తున్న యూజర్లు ఈ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా 70 రోజుల వరకు వ్యాలిటిడీని పెంచుకోవచ్చు. తొలి 15 రోజులు మాత్రం అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సహా రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. అలాగే తొలి 15 రోజులపాటు రోజువారీ 100 SMS లను పొందవచ్చు.

BSNL రూ. 298 రీఛార్జీ ప్లాన్‌ : ఈ ప్రీపెయిడ్‌ రీఛార్జీ ప్లాన్‌ ద్వారా 52 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 1GB డేటా ను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను కూడా పొందవచ్చు.

BSNL రూ.397 ప్లాన్‌ : ఈ బీఎస్‌ఎన్‌ఎల్ రీఛార్జీ ప్లాన్‌ ద్వారా 150 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. అయితే తొలి 30 రోజులు మాత్రమే అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS, రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. కేవలం తొలి 30 రోజులు మాత్రమే ఈ సదుపాయాలను పొందవచ్చు. మిలిగిన రోజులు సిమ్‌ కార్డు యాక్టివ్‌గా ఉండనుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL prepaid recharge plans with low price and more validity benefits 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X