Home
News

BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల కొనుగోలుపై రూ.600 ఆదా చేసే గొప్ప అవకాశం!!!

భారతప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఏకైక టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో భారత్ ఫైబర్ పేరుతో తన యొక్క కస్టమర్ల కోసం అనేక ఆఫర్లను అందిస్తున్నది. అందులో భాగంగా ఇప్పుడు కొత్తగా ప్రమోషనల్ ఆఫర్ను ప్రకటించింది. బిఎస్‌ఎన్‌ఎల్ ఫైబర్ కస్టమర్ల కోసం ప్రభుత్వ టెల్కో ఈ కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా వినియోగదారులు తమ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లపై రూ.600 వరకు ఆదా చేయవచ్చు. ఇది ప్రమోషనల్ ఆఫర్ కనుక కేవలం 90 రోజుల వరకు మాత్రమే అమలులో ఉంటుంది. అయితే ఈ ఆఫర్ ప్రస్తుతము బిఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ ను వినియోగిస్తున్న కస్టమర్లకు మాత్రమే అందించబడుతుందని గమనించాలి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ ల్యాండ్‌లైన్ వినియోగదారుల కోసం BSNL ఆఫర్

బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ ల్యాండ్‌లైన్ వినియోగదారుల కోసం BSNL ఆఫర్

బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ను వినియోగించని బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క ప్రస్తుత ల్యాండ్‌లైన్ కస్టమర్లు భారత్ ఫైబర్ యొక్క ఆఫర్‌ల నుండి ఇప్పుడు ఒక ప్లాన్ ను కొనుగోలు చేస్తే కనుక వారికి బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో రూ.600 వరకు ఆదా చేసే సువర్ణ అవకాశం లభిస్తుంది. బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించే అన్ని సర్కిల్‌లలో ఈ ఆఫర్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ ప్రమోషనల్ ఆఫర్ కోసం అర్హత ఉన్న ఏ కస్టమర్ అయినా మొదటి ఆరు నెలలు తమ భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల మీద రూ.100 తగ్గింపును పొందుతారు.

 

 

బ్రాడ్‌బ్యాండ్

ప్రస్తుతం బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ ను పొందిన ప్రతి కస్టమర్ మొదటి ఆరు నెలల కాలంలో మొత్తం మీద రూ.100 వరకు తగ్గింపుతో సంస్థ నుండి బిల్లును అందుకుంటారు. ఆరు నెలల తరువాత ఈ ఆఫర్ వల్ల వినియోగదారులకు రూ.600 వరకు తగ్గింపు లభిస్తుంది. ప్రమోషనల్ ఆఫర్ 3 నెలలు (90 రోజులు) ఉంటుంది. అంటే ఇది సెప్టెంబర్ 12, 2021 తో ముగుస్తుంది. ఈ కాలం వరకు బిఎస్ఎన్ఎల్ యొక్క ప్రస్తుత ల్యాండ్లైన్ వినియోగదారులు కంపెనీ నుండి ఫైబర్-టు-హోమ్ (ఎఫ్టిటిహెచ్) ప్లాన్ను కొనుగోలు చేయవచ్చు మరియు భారత్ ఫైబర్ సర్వీస్ యొక్క అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు.

BSNL భారత్ ఫైబర్ ప్లాన్ లు

BSNL భారత్ ఫైబర్ ప్లాన్ లు

మీరు భారత్ ఫైబర్ ప్లాన్ కొనాలని ఆలోచిస్తుంటే కనుక మీరు ఎంచుకోవడానికి అనేక ఎంపికలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఎంట్రీ లెవల్ ప్లాన్ నెలకు 449 రూపాయల ధర వద్ద లభిస్తుంది. ఇది 30 Mbps వేగంతో లభిస్తుంది. అలాగే 60 Mbps , 100 Mbps , 200 Mbps , 200 Mbps , మరియు 300 Mbps వేగంతో లభించే ప్లాన్ ల యొక్క ధరలు నెలకు వరుసగా రూ.599, రూ.799, రూ.999, రూ.1,277, రూ.1,499 ధరను కలిగి ఉన్నాయి. రూ.999 మరియు రూ.1,499 ధరల వద్ద లభించే ఖరీదైన ప్లాన్‌లు వినియోగదారులకు డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియం యొక్క ఉచిత చందాతో లభిస్తాయి. ఇందులో రూ.1,499 ప్లాన్ 4TB డేటాతో లభించగా మిగిలిన అన్ని ప్లాన్లు 3.3TB FUP డేటాతో లభిస్తాయని గమనించండి.

Best Mobiles in India

English summary
BSNL Promotional Offer!! Great Opportunity to Save up to Rs.600 on Broadband Plans
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X