BSNL యూజర్లకు బంపర్ ఆఫర్!! రెండు ప్రీపెయిడ్ ప్లాన్లపై 25% డిస్కౌంట్...
ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఏకైక టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ తన యొక్క వినియోగదారుల బేస్ ను పెంచుకోవడానికి ఇటీవల కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను విడుదల చేయడంతో పాటుగా ఇప్పుడు ప్రత్యేకంగా గ్రేస్ పీరియడ్ 2 లో డిస్కౌంట్ ను ప్రకటించింది. టెల్కో యొక్క స్పెషల్ టారిఫ్ వోచర్ (STV) 187 మరియు రూ.1,499 వోచర్ ప్లాన్ యొక్క రెండు ప్రీపెయిడ్ ప్లాన్లపై 25% ప్రత్యేక తగ్గింపును అందిస్తున్నది. ప్రీపెయిడ్ వినియోగదారులకు 25% తగ్గింపుతో అందిస్తున్న కొత్త ప్లాన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL STV 187, రూ.1,499 వోచర్ ప్లాన్ పై 25% డిస్కౌంట్ ఆఫర్
గ్రేస్ పీరియడ్ 2 లో భాగంగా ప్రీపెయిడ్ వినియోగదారులకు బిఎస్ఎన్ఎల్ యొక్క STV 187 మరియు రూ.1,499 వోచర్ ప్లాన్ మీద 25% డిస్కౌంట్ ను ఇస్తోంది. కాబట్టి డిస్కౌంట్ పొందిన తర్వాత ప్రీపెయిడ్ ప్లాన్ల యొక్క ధరలు STV187కి రూ.139 మరియు రూ.1,499 వోచర్ ప్లాన్ యొక్క ధర రూ.1119 గా లభిస్తుంది.

BSNL గ్రేస్ పీరియడ్ 2 ప్రమోషనల్ ఆఫర్ నిబంధనలు
బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ ప్రత్యేక ఆఫర్‌ను పొందడానికి కొన్ని నిబంధనలు మరియు షరతులు ఉన్నాయి. వేల్యూ -యాడెడ్ సర్వీస్ (VAS) ఈ రెండు రాయితీ వోచర్‌లకు విస్తరించబడవు. ప్రమోషనల్ ఆఫర్ కింద ప్రీపెయిడ్ వినియోగదారులకు గ్రేస్ పీరియడ్ 2 మరియు గ్రేస్ పీరియడ్ 2 దాటి ఇన్కమింగ్ మరియు SMS సౌకర్యం అందించబడుతుంది. ఆఫర్ ముగిసిన తర్వాత SMS సౌకర్యం మళ్లీ ఆగిపోతుంది. గ్రేస్ పీరియడ్ 2 లోని వినియోగదారులకు టెల్కో నుండి ప్రతిరోజూ రెండు SMSలు అదనంగా ఇవ్వబడుతుంది.

BSNL STV 187 ప్లాన్ ప్రయోజనాలు
బిఎస్‌ఎన్‌ఎల్ STV 187 ప్లాన్ ప్రతిరోజూ 2GB ఫెయిర్ యూజ్ పాలసీ (FUP) డేటాతో పాటుగా వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. FUP డేటా అయిపోయిన తర్వాత వినియోగదారులు మిగిలిన రోజుల్లో 80 Kbps వేగంతో బ్రౌజింగ్ ను కొనసాగించవచ్చు. దీనితో పాటు వినియోగదారులు రోజుకు 100SMS ప్రయోజనాలను కూడా పొందుతారు. STV187 ప్లాన్ యొక్క వాలిడిటీ 28 రోజులు.

BSNL రూ.1,499 వోచర్ ప్లాన్ ప్రయోజనాలు
బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క రూ.1,499 వోచర్ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు 24GB ఉచిత డేటా మరియు రోజుకు 100SMS ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ సాధారణంగా 365 రోజులు. అయితే ఈ ప్లాన్ విడుదలైన 90 రోజులలోపు కొనుగోలు చేసే వినియోగదారులకు 30 రోజుల అదనపు వాలిడిటీ లభిస్తుందని టెల్కో ఇంతకుముందే ప్రకటించింది. కాబట్టి ప్లాన్ వోచర్ రూ.1,499 యొక్క మొత్తం వాలిడిటీ 395 రోజులు.


Click it and Unblock the Notifications