Home
News

BSNL యొక్క ఈ ప్లాన్‌లు అధిక డేటా & వాలిడిటీతో లభిస్తున్నాయి...

ఇండియాలోని టెలికాం రంగంలో ప్రస్తుతం రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా అనే మూడు ప్రైవేట్ ప్లేయర్‌లు అధిక మంది యూజర్లను కలిగి ఉండి ఆధిపత్యంను చెలాయిస్తున్నాయి. అయితే ప్రభుత్వ యాజమాన్యంలోని టెల్కో BSNL ఇతర ఆపరేటర్లు అందించే ప్రయోజనాల మాదిరిగానే గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. వాస్తవానికి BSNL దాని స్వల్ప మరియు దీర్ఘకాలిక వ్యాలిడిటీ ప్లాన్‌లతో వినియోగదారులకు గణనీయంగా అధిక మొత్తంలో డేటాను అందిస్తుంది. అధిక మొత్తంలో డేటాను అందించే BSNL యొక్క దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL STV_399 & STV_429 ప్లాన్లు

BSNL STV_399 & STV_429 ప్లాన్లు

BSNL యొక్క అధిక డేటా మరియు వాలిడిటీ జాబితాలోని మొదటి ప్లాన్ STV_399. ఇది రూ.399 ధరతో 80 రోజుల చెల్లుబాటు కాలానికి రోజుకు 1GB డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ BSNL ట్యూన్‌లు మరియు లోక్‌ధున్ కంటెంట్‌కు ఉచిత యాక్సిస్ ను కూడా అందిస్తుంది. జాబితాలోని STV_429 రెండవ ప్లాన్ కొంచెం మెరుగైన ప్రయోజనాలతో లభిస్తుంది. ఇది 81 రోజుల వాలిడితో రోజుకు 1GB డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. అదనంగా Eros Now ఎంటర్‌టైన్‌మెంట్ సేవలకు కూడా ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది.

డేటా-ఆధారిత ప్రీపెయిడ్ ప్లాన్

జాబితాలో తదుపరిది టెల్కో అందించే డేటా-ఆధారిత ప్రీపెయిడ్ ప్లాన్ మొత్తంగా 100GB హై-స్పీడ్ డేటాను రూ.447 ధర ట్యాగ్‌తో అందిస్తుంది. 100GB డేటా సెట్ పరిమితిని దాటిన తరువాత వినియోగదారులు 80 Kbps వేగంతో ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఈ ప్లాన్ 60 రోజుల చెల్లుబాటు వ్యవధితో ఇది వస్తుంది. ఇది వెబ్‌సైట్‌లో 'డేటా వోచర్' క్రింద పేర్కొన్నప్పటికీ ఇది రోజుకు 100 SMSలతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్‌ను కూడా అందిస్తుంది. STV_447 ప్లాన్‌తో వినియోగదారులు BSNL ట్యూన్స్ మరియు ఈరోస్ నౌ ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసెస్‌కు ఉచిత యాక్సిస్ ను పొందవచ్చు.

STV_499 ప్యాక్‌

BSNL వినియోగదారులు మూడు నెలల చెల్లుబాటు వ్యవధితో STV_499 ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. రూ.499 ధరతో లభించే ఈ ప్లాన్ 90 రోజుల చెల్లుబాటు కాలానికి రోజుకు 2GB డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ ప్లాన్ ఎలాంటి OTT సబ్‌స్క్రిప్షన్‌లను అందించదు. జాబితాలోని మరొక ప్లాన్ ఏడాది చెల్లుబాటుతో లభించే ప్రీపెయిడ్ ప్లాన్‌. దీనిని వినియోగదారులు రూ.1,498 ధర ట్యాగ్‌తో 365 రోజుల చెల్లుబాటు వ్యవధికి రోజుకు 2GB డేటా ప్రయోజనంతో పొందవచ్చు.

STV_WFH_599 ప్రీపెయిడ్ ప్లాన్

STV_WFH_599 ప్రీపెయిడ్ ప్లాన్

జాబితాలో చివరిది దీర్ఘకాలిక మరియు అధిక డేటా STV_WFH_599 ప్రీపెయిడ్ ప్లాన్. రూ. 599 ధర వద్ద లభించే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 5GB డేటాను అందిస్తుంది. డేటా పరిమితి తర్వాత వినియోగదారులు 80 Kbps వేగంతో ఇంటర్నెట్‌ని ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు వ్యవధి 84 రోజులు. ముంబై మరియు ఢిల్లీలో రోమింగ్‌తో సహా హోమ్ LSA మరియు నేషనల్ రోమింగ్‌లో వినియోగదారులు నిజంగా అపరిమిత కాల్‌లు మరియు రోజుకు 100 SMSలను పొందుతారు. ఈ ప్లాన్ Zing స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌కు కూడా ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఉన్న మరో ప్రయోజనం ఏమిటంటే వినియోగదారులు రాత్రి సమయాలలో 00:00 గంటల నుండి ఉదయం 05:00 గంటల వరకు అపరిమిత డేటాను యాక్సిస్ చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Provide Amazing Heavy-Data Prepaid Plans With Long-Term Validity
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X