Home
News

భారత్ ఎయిర్ ఫైబర్ కనెక్షన్‌ను ఉచితంగా అందిస్తున్న BSNL!! వివరాలు ఇవిగో...

భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన ఫ్రాంఛైజీలకు ఉచితంగా ఎయిర్ ఫైబర్ కనెక్షన్‌ను అందిస్తోంది. వీటిని సాధారణంగా రేడియో బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్ (RBSP) అని పిలుస్తారు. అర్హత కలిగిన ఫ్రాంచైజీలకు కనెక్షన్‌తో పాటుగా ప్రభుత్వ టెల్కో 40 Mbps ప్లాన్‌ను కూడా ఉచితంగా అందిస్తోంది. కానీ ఏ ఫ్రాంఛైజీ కంపెనీ నుండి ఉచిత కనెక్షన్ పొందలేరు. BSNL నుండి ఈ ఆఫర్‌కు అర్హత పొందడానికి భారత్ ఎయిర్ ఫైబర్ ఫ్రాంచైజీలు కనీసం 50 FTTH కనెక్షన్‌లను అందించాలి. ఇప్పటి వరకు 50 కంటే ఎక్కువ FTTH కనెక్షన్‌లను అందించిన ఫ్రాంచైజీ ఉంటే కనుక వారు ఆటోమేటిక్‌గా ఈ ఆఫర్‌కు అర్హత పొందుతారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL ఉచిత భారత్ ఎయిర్ ఫైబర్ కనెక్షన్ ఆఫర్ వివరాలు

BSNL ఉచిత భారత్ ఎయిర్ ఫైబర్ కనెక్షన్ ఆఫర్ వివరాలు

కొన్ని నివేదికల ప్రకారం BSNL ఎయిర్‌ఫైబర్ బేసిక్ ప్లస్ ప్లాన్‌తో భారత్ ఎయిర్ ఫైబర్ కనెక్షన్ యొక్క ఉచిత డెమో లభిస్తుంది. ఇది 40 Mbps వేగాన్ని అందిస్తుంది. కనీసం 50 బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లను ఎయిర్‌ఫైబర్ ఛానెల్ భాగస్వామి యొక్క ప్రతి కార్యాలయానికి రూ.699 ఖర్చుతో అందిస్తుంది. ఈ డెమో కనెక్షన్‌ను BSNL ఫ్రాంఛైజీలు పరీక్షా ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించవచ్చని గమనించండి. ఫ్రాంఛైజీలు డెమో కనెక్షన్‌ను ఎవరికీ విక్రయించడానికి అనుమతించబడరు. డెమో కనెక్షన్ కోసం BSNL ఎటువంటి బిల్లులను జారీ చేయదు.

BSNL భారత్ ఎయిర్ ఫైబర్ కనెక్షన్ అంటే ఏమిటి?

BSNL భారత్ ఎయిర్ ఫైబర్ కనెక్షన్ అంటే ఏమిటి?

తక్కువ జనాభా మరియు ఆర్థిక ప్రయోజనం లేనందున చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఫైబర్ కనెక్షన్లు మరియు టెరెస్ట్రియల్ నెట్‌వర్క్ అందించబడవు. అటువంటి ప్రాంతాల్లో నివసించే వ్యక్తులు వారి జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ప్రాథమిక డిజిటల్ టూల్లను యాక్సెస్ చేయలేరు. అటువంటి ప్రాంతాలు మరియు భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గించడానికి BSNL భారత్ ఎయిర్ ఫైబర్ సర్వీసును ప్రకటించింది.

Wi-Fi

ఈ సర్వీస్ కింద BSNL ఇంటర్నెట్ అందించడానికి లైసెన్స్ లేని Wi-Fi స్పెక్ట్రంను ఉపయోగించుకుంటుంది. ఇది పూర్తిగా వైర్‌లెస్ కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వినియోగదారులు స్థిరమైన ఇంటర్నెట్ సేవలను కూడా పొందవచ్చు. కంపెనీ నెలకు రూ.499 ధర వద్ద భారత్ ఎయిర్ ఫైబర్ సేవలను అందిస్తుంది. BSNL తన గ్రామీణ టవర్లు ఉన్న చోట కూడా ఈ సర్వీసును అందిస్తుంది కానీ FTTH ఉనికి లేదు.

Best Mobiles in India

English summary
BSNL Provides Bharat Air Fiber Connection For Free of Cost
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X