సిమ్‌తో పనిలేకుండా ఇకపై ఫోన్ కాల్స్ మాట్లాడుకోవచ్చు

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియాలో తొలిసారిగా సరికొత్త సర్వీసులను లాంచ్ చేసింది.

|

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియాలో తొలిసారిగా సరికొత్త సర్వీసులను లాంచ్ చేసింది. ఈ సర్వీసుల్లో భాగంగా మొబైల్‌లో సిమ్‌కార్డు లేకపోయినా ఇకపై ఎంచక్కా మీరు కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఇందుకు కావాల్సిందల్లా వైఫై లేదా ఇంటర్‌నెట్‌ సదుపాయాలే. ఈ వినూత్న సాంకేతికతతో కూడిన వింగ్స్‌ అనే వినూత్న పథకాన్ని భారత సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బిఎస్‌ఎన్‌ఎల్‌) లాంఛనంగా ఆవిష్కరించింది. లాంచింగ్ రొజే నుంచే ఈ సర్వీసు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాల్లోకెళితే..

సిమ్ లేకుండా కాల్ చేసుకోవడం ఎలా ? సిమ్ లేకుండా కాల్ చేసుకోవడం ఎలా ?

వింగ్స్ అనేది ఒక యాప్.

వింగ్స్ అనేది ఒక యాప్.

వింగ్స్ అనేది ఒక యాప్. ఈ యాప్ సర్వీసును BSNL జూలై 11న లాంచ్ చేయగా నేటి నుంచి అధికారికంగా సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కాగా ఒక్కరోజునే 4000 బుకింగ్స్ నమోదయ్యాయి. ఈ వింగ్స్ యాప్ ద్వారా యూజర్లు ఇకపై సిమ్ లేకుండా కాల్స్ మాట్లాడుకోవచ్చు.

ఏడాదికి రూ.1099

ఏడాదికి రూ.1099

కాగా ఈ సర్వీసు కోసం ఏడాదికి రూ.1099 చెల్లిస్తే చాలు. సంవత్సరం పాటు అన్‌లిమిటెడ్‌ ఫోన్‌కాల్స్‌తో పాటు నాలుగు ప్రత్యేక జీబీ డాటా ప్లాన్‌లను పొందే సదుపాయం కల్పించారు. గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ సేవలు వినియోగించుకోవచ్చు.

సిమ్‌ కార్డుతో పనిలేకుండా

సిమ్‌ కార్డుతో పనిలేకుండా

బిఎస్‌ఎన్‌ఎల్‌ విడుదల చేసిన వింగ్స్‌ పథకం ద్వారా ఏడాది పాటు ఇష్టమొచ్చినంత మేర సమయం మాట్లాడుకోవచ్చు. సిమ్‌ కార్డుతో పనిలేకుండా వైఫై లేదా ఇంటర్‌నెట్‌ సదుపాయం ఉంటే సరిపోతుంది.

 రూ.2 వేలు అదనంగా చెల్లిస్తే ఇంటర్‌నెట్‌ కాల్స్‌

రూ.2 వేలు అదనంగా చెల్లిస్తే ఇంటర్‌నెట్‌ కాల్స్‌

ఏ మొబైల్‌ కంపెనీలకైనా, ఈ నెంబర్‌లకైనా గంటల కొద్దీ మాట్లాడుకోవచ్చునన్నారు. కాకపోతే మరో రూ.2 వేలు అదనంగా చెల్లిస్తే ఇంటర్‌నెట్‌ కాల్స్‌ కూడా అన్‌లిమిటెడ్‌గా వినియోగించుకోవచ్చు.

ప్రీ పెయిడ్‌ ల్యాండ్‌లైన్‌

ప్రీ పెయిడ్‌ ల్యాండ్‌లైన్‌

వింగ్స్‌ పథకంతో పాటు ప్రీ పెయిడ్‌ ల్యాండ్‌లైన్‌, రాష్ట్ర స్థాయిలో సియుజి గ్రూప్‌, మల్టీమీడియా వీడియో కాన్ఫరెన్సింగ్‌, ఫిక్స్‌డ్‌ మొబైల్‌ కాన్వర్‌జేషన్‌ వంటి పథకాలను ఇదే సందర్భంగా విడుదల చేశారు.

4జి సేవలను అందుకొనే వారు..

4జి సేవలను అందుకొనే వారు..

ప్రస్తుతం బిఎస్‌ఎన్‌ఎల్‌ 3జి సేవలను అందిస్తోంది. 4జి సేవలను అందుకొనే వారు దరఖాస్తులు సమర్పించుకోవాల్సి ఉంటుంది. మల్టీ వీడియో కాన్ఫరెన్స్‌ ప్లాన్‌లో ఒక మొబైల్‌ నెంబర్‌తో 29 మంది ఏక కాలంలో కాన్ఫరెన్స్‌లో పాల్గొనవచ్చు.

తొలి 10 నిమిషాల పాటు..

తొలి 10 నిమిషాల పాటు..

తొలి 10 నిమిషాల పాటు నిమిషానికి 10 రూపాయల రుసుం చెల్లించాలి. కాగా బిఎస్‌ఎన్‌ఎల్‌ అన్ని శాఖల్లో నూతన ఉత్పత్తుల వివరాలను అందుబాటులో ఉంచారు.

Best Mobiles in India

English summary
BSNL receives over 4,000 bookings for ‘Wings’ internet telephony service more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X