ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన BSNL.. రూ.1515కే 365 రోజులు, రోజుకి 2GB డేటా
BSNL Recharge: ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL ప్రైవేట్ కంపెనీలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. కేవలం రూ.1515లకే ఏడాది మొత్తం, రోజుకి 2GB డేటా ప్లాన్‌ను ప్రకటించింది. ఇది డేటా మాత్రమే వోచర్, దీని వ్యాలిడిటీ ఏకంగా 365 రోజులు. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా లాంటి ప్రైవేట్ కంపెనీలు వణికిపోయేలా BSNL అదిరిపోయే పోటీని తీసుకొచ్చింది. రోజుకి 2GB డేటా అయిపోయాక స్పీడ్ కాస్త తగ్గుతుంది, కానీ ఆగదు. 40Kbps స్పీడ్‌తో కనెక్షన్ ఉంటుంది.
రోజుకి దాదాపు రూ.4 ఖర్చుతో ఈ ప్లాన్ వస్తుంది. ఇంత తక్కువ ధరలో ఇంత కాలం డేటా ఇచ్చే ప్లాన్ ఇండియాలో ఇంకోటి లేదంటే నమ్మండి. ఈ ప్లాన్ గురించి గొప్పగా చెప్పారు. రెగ్యులర్‌గా డేటా కావాల్సిన వాళ్లకి, మళ్లీ మళ్లీ రీఛార్జ్ చేసుకునే బాధ లేకుండా ఉండాలనుకునే వాళ్లకి ఇది మంచి ఆప్షన్.

జస్ట్ రూ.1515 పెడితే చాలు, ఏడాది మొత్తం ఇంటర్నెట్ వాడొచ్చు. స్టూడెంట్స్, ఉద్యోగులు, రోజు డేటా బ్రౌజ్ చేసేవాళ్లకి ఇది బాగా ఉపయోగపడుతుంది." అని BSNL తెలిపింది. ఈ ప్లాన్ మెయిన్‌గా డేటా కోసం మాత్రమే డిజైన్ చేశారు. ఇందులో కాల్స్, SMS బెనిఫిట్స్ ఉండవు.
కానీ, కేవలం ఇంటర్నెట్ మాత్రమే కావాలనుకునేవాళ్లకి ఇది చాలా తక్కువ ధరలో వచ్చే బెస్ట్ సొల్యూషన్. ఇకపోతే BSNL కొత్త ప్లాన్లు పరిచయం చేస్తూనే పాత వాటిని తీసేస్తోంది. రీసెంట్ గా మూడు మొబైల్ ప్రీపెయిడ్ ప్లాన్లను తొలగించి ఆశ్చర్యపరిచింది అవేవో ఇప్పుడు చూద్దాం.
* కొన్ని పాత ప్లాన్లకు BSNL గుడ్‌బై..
కొత్త ప్లాన్‌ను తీసుకొస్తూనే, BSNL కొన్ని పాత ప్లాన్లను తీసేస్తోంది. రిపోర్ట్స్ ప్రకారం, రూ.201, రూ.797, ఇంకా రూ.2999 ప్లాన్లు 2025, ఫిబ్రవరి 10 నుంచి ఉండవు. తరచూ ఈ ప్లాన్లకు రీఛార్జ్ చేసుకునే వాళ్లు ఈ మార్పును తప్పక గమనించాలి. కంపెనీ తక్కువ ప్లాన్లతోనే ఎక్కువ వాల్యూ ఇచ్చే ప్లాన్లపై ఫోకస్ చేస్తోంది.
* BSNL ఫ్రీ లైవ్ టీవీ సర్వీస్
ఇంకో గుడ్‌న్యూస్ ఏంటంటే, BSNL ఫ్రీ లైవ్ టీవీ సర్వీస్ BiTVను కూడా లాంచ్ చేసింది. దీని ద్వారా 450కి పైగా టీవీ ఛానెల్స్‌ను చూడొచ్చు. BSNL మొబైల్ యూజర్లందరికీ ఈ సర్వీస్ ఫ్రీగా అందుబాటులో ఉంటుంది, రూపాయి కూడా ఎక్స్‌ట్రా కట్టక్కర్లేదు. ఏ ప్లాన్ తీసుకున్నా సరే లైవ్ టీవీకి ఫ్రీగా యాక్సెస్ పొందొచ్చు.
BSNL అధికారి మాట్లాడుతూ "BiTVతో BSNL యూజర్లకు ఫ్రీ ఎంటర్టైన్‌మెంట్ ఇస్తోంది. నెలకు రూ.99 ప్లాన్ వేసుకునేవాళ్లు కూడా ఎక్స్‌ట్రా డబ్బులు కట్టకుండా లైవ్ టీవీ చూడొచ్చు" అని చెప్పారు. BiTV యాప్ BSNL మొబైల్ యూజర్లందరికీ అందుబాటులో ఉంది. యూజర్లు లైవ్ టీవీ, వెబ్ సిరీస్‌లు, సినిమాలు డైరెక్ట్‌గా ఫోన్‌లోనే చూడొచ్చు.
ట్రయల్ ఫేజ్‌లో BSNL 300 ఫ్రీ ఛానెల్స్ ఇచ్చింది, కానీ ఇప్పుడు 450+ ఛానెల్స్‌కి పెంచింది. తక్కువ ధర ప్లాన్లు, ఫ్రీ ఎంటర్టైన్‌మెంట్ సర్వీస్‌లతో BSNL కస్టమర్లను బాగా ఆకట్టుకునేలా దూసుకుపోతోంది. ప్రైవేటు కంపెనీలకు మాత్రం తరచుగా షాక్‌లు ఇస్తోంది. వారి యూజర్లను తన వైపు తిప్పుకుంటుంది.


Click it and Unblock the Notifications








