Home
News

BSNL వినియోగదారులకు భారీ షాక్.. ఆ రెండు ప్లాన్‌ల వ్యాలిడిటీ తగ్గింపు.. పూర్తి వివరాలు ఇవే..!

BSNL prepaid plans validity Reduced: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన BSNL, తమ వినియోగదారులకు ఒక ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది. తమ పాపులర్ లాంగ్-టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్‌లలో రెండింటి విషయంలో కీలక మార్పు చేసింది. అవే రూ. 1499, రూ.2399 ప్లాన్లు. ఎక్కువ కాలపరిమితితో, తక్కువ ధరకే లభించడంతో ఈ ప్లాన్లకు మంచి ఆదరణ ఉంది.

కానీ, BSNL ఇప్పుడు ఈ ప్లాన్‌ల వ్యాలిడిటీని (కాలపరిమితిని) తగ్గించేసింది. అంటే, ఇకపై మీరు అదే ధరకు తక్కువ రోజుల సర్వీసును పొందుతారు. అయితే, ఈ మార్పు తర్వాత కూడా, మార్కెట్లో ఉన్న ప్రైవేట్ టెలికాం కంపెనీల ప్లాన్‌లతో పోలిస్తే ఇవి ఇంకా మంచి డీల్ అనే చెప్పాలి.

BSNL Reduces Validity for Popular Rs2399 And Rs1499 plans

* BSNL రూ.1499 ప్లాన్ - ఇప్పుడు కేవలం 336 రోజులే
BSNL రూ. 1499 ప్లాన్‌లో కూడా మార్పు వచ్చింది. గతంలో ఇది పూర్తి సంవత్సరం, అంటే 365 రోజుల వ్యాలిడిటీతో వచ్చేది. కానీ ఇప్పుడు, BSNL దీన్ని కేవలం 336 రోజులకు తగ్గించింది. అంటే దాదాపు నెల రోజుల వ్యాలిడిటీని తగ్గించారన్నమాట. ఈ ప్లాన్‌లో కూడా భారతదేశంలోని అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాల్స్ లభిస్తాయి.

దానితో పాటు, రోజుకు 100 SMSలు, మొత్తం కాలపరిమితికి కలిపి 24GB డేటా వస్తుంది. ఈ ప్లాన్‌లో రోజువారీ డేటా ఉండదు. 24GB డేటాను మీరు 336 రోజుల పాటు వాడుకోవాలి. కాబట్టి, మొబైల్ డేటా అప్పుడప్పుడు మాత్రమే వాడుతూ, ఎక్కువ కాలం పాటు కాలింగ్, SMS సేవలు కావాలనుకునే వారికి ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది.

* BSNL రూ.2399 ప్లాన్ - ఏకంగా 30 రోజులు కట్
ఇంతకు ముందు BSNL రూ.2399 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే ఏకంగా 425 రోజుల వ్యాలిడిటీ వచ్చేది. కానీ ఇప్పుడు, BSNL దీన్ని 395 రోజులకు తగ్గించేసింది. అంటే, సరిగ్గా 30 రోజుల వ్యాలిడిటీని తగ్గించింది. ఈ ప్లాన్‌లో, మీరు భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.

రోజుకు 100 SMSలు, ఇంకా రోజుకు 2GB డేటా కూడా లభిస్తుంది. కొత్తగా మారిన 395 రోజుల వ్యాలిడిటీ ప్రకారం, వినియోగదారులు మొత్తం 790GB డేటాను పొందుతారు. వ్యాలిడిటీ తగ్గినా, BSNL ఇప్పటికీ ఏడాదికి పైగా సర్వీసును అందిస్తోంది. ఈ ధరలో ఇంత ఎక్కువ వ్యాలిడిటీ ఇవ్వడం ప్రస్తుతం BSNL ప్రత్యేకత.

చాలా ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఇలాంటి లాంగ్-టర్మ్ ప్లాన్లకు కేవలం 365 రోజులు, అంతకంటే తక్కువ వ్యాలిడిటీనే ఇస్తున్నాయి, అదీ ఎక్కువ షరతులతో, తక్కువ ప్రయోజనాలతో. కానీ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ ఇచ్చే వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లు అందరికీ అందుబాటు ధరల్లో ఉంటున్నాయి. సిగ్నల్ బాగా వచ్చే వారికి ఇవి ఒక వరం.

* లాంగ్-టర్మ్ యూజర్లకు బెస్ట్
ఈ రెండు ప్లాన్‌లలోనూ అదనంగా యాప్ సబ్‌స్క్రిప్షన్లు లేదా కాలర్ ట్యూన్స్ వంటి ఉచితాలు ఏవీ ఉండవు. అలాగే, BSNL ఇంకా 5G సేవలను ప్రారంభించలేదు కాబట్టి, ఈ ప్లాన్‌లు ఇప్పటికీ BSNL 4G నెట్‌వర్క్‌పైనే పనిచేస్తాయి. అయితే, శుభవార్త ఏంటంటే, BSNL ఇప్పటికే దేశవ్యాప్తంగా తన 4G సేవలను వేగంగా విస్తరిస్తోంది.

2025, జూన్ నాటికి లక్ష 4G సైట్‌లను యాక్టివేట్ చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల చాలా ప్రాంతాల్లో నెట్‌వర్క్ నాణ్యత, వేగం మెరుగుపడతాయి. రాబోయే నెలల్లో ఈ ప్రీపెయిడ్ ప్లాన్లు మరింత ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది. దీనివల్ల భారతీయులు చాలా ప్రయోజనం పొందుతారు.

* వ్యాలిడిటీ తగ్గినా, డీల్ మాత్రం బాగుంది
BSNL చేసిన ఈ మార్పు కొంతమంది వినియోగదారులను నిరాశపరచవచ్చు. కానీ, తక్కువ ధరలో, ఎక్కువ కాలం పాటు పనిచేసే ప్రీపెయిడ్ ఆప్షన్లు కావాలనుకునే వారికి, అపరిమిత కాలింగ్, ఓ మోస్తరు డేటా ప్రయోజనాలతో ఇవి ఇప్పటికీ ఆకర్షణీయంగానే ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Reduces Validity for Popular Rs2399 And Rs1499 Long Term Prepaid Plans in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X