BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌ల రీఛార్జ్‌పై తగ్గింపు!! కానీ ఈ యాప్ ద్వారా రీఛార్జ్ చేయాలి...

|

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ప్రస్తుతం ప్రైవేట్ టెల్కోల కంటే తక్కువ ధరకే ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందించడమే కాకుండా తన మొబైల్ యాప్ - సెల్ఫ్‌కేర్ ద్వారా రీఛార్జ్ చేసుకునే కస్టమర్ల కోసం ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరల మీద తగ్గింపును కూడా అందిస్తోంది. BSNL కొన్ని నెలల క్రితం సెల్ఫ్‌కేర్ మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. ఇది చూడడానికి వోడాఫోన్ ఐడియా (Vi) మొబైల్ యాప్‌లా కనిపిస్తుంది. సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులు ప్రీపెయిడ్ ప్లాన్‌లపై 4% తగ్గింపును పొందవచ్చు అని టెల్కో తెలిపింది. అయితే ఈ తగ్గింపు ఆఫర్ మార్చి 31, 2022 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది అని గమనించాలి. అంతేకాకుండా ఈ తగ్గింపు రీఛార్జ్ ఆఫర్ రూ.201 మరియు అంతకంటే ఎక్కువ విలువ కలిగిన ప్లాన్‌లపై మాత్రమే వర్తిస్తుందని గుర్తుంచుకోండి.

BSNL రీఛార్జ్ డిస్కౌంట్ ఆఫర్

BSNL రీఛార్జ్ డిస్కౌంట్ ఆఫర్ అనేది కేవలం సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. గూగుల్ పే, ఫోన్ పే వంటి మరిన్నింటి థర్డ్-పార్టీ మొబైల్ యాప్‌ల ద్వారా రీఛార్జ్‌లు చేసుకుంటున్న వ్యక్తులకు ఈ డిస్కౌంట్ ఆఫర్ అందించబడదు. వెబ్‌సైట్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉన్న ప్రతి ప్లాన్ సెల్ఫ్‌కేర్ యాప్‌లో అందుబాటులో ఉంటుంది.

BSNL సెల్ఫ్‌కేర్ డిస్కౌంట్ ఆఫర్ వినియోగదారులకు ఎంత వరకు ఉపయోగకరం

BSNL సెల్ఫ్‌కేర్ డిస్కౌంట్ ఆఫర్ వినియోగదారులకు ఎంత వరకు ఉపయోగకరం

BSNL వినియోగదారులు సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా రూ.201 ధర వద్ద గల ప్లాన్‌తో రీఛార్జ్ చేయడంతో కేవలం 4% అంటే రూ.8.04 మాత్రమే డిస్కౌంట్ లభిస్తుంది. కనుక మొబైల్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవడానికి వినియోగదారులకు ఇది ఎక్కువ ప్రోత్సాహక ఆఫర్ కాదు. ఇంత చిన్న మొత్తాన్ని ఆదా చేయడానికి ప్రజలు పెద్దగా ప్రేరేపించబడకపోవచ్చు. తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఇప్పటికే యాప్‌ని కలిగి ఉన్న వ్యక్తులు మరియు లేని వారితో సహా మరింత మంది వినియోగదారులను BSNL సెల్ఫ్‌కేర్ పోర్టల్‌కి తీసుకురావడం కోసం ఇది ఖచ్చితంగా వ్యూహం మాత్రమే. iOS మరియు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు రెండింటినీ ఉపయోగించే కస్టమర్‌లకు BSNL సెల్ఫ్‌కేర్ అందుబాటులో ఉంది.

BSNL సెల్ఫ్‌కేర్ యాప్

BSNL సెల్ఫ్‌కేర్ యాప్

BSNL సెల్ఫ్‌కేర్ యొక్క యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో 4.4 స్టార్స్ రేటింగ్‌ను కలిగి ఉంది. దీనిని ఇప్పటికే మిలియన్ కంటే ఎక్కువ మంది వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇది చాలా తేలికైన అప్లికేషన్ కావున ఇది అధిక డేటాను వినియోగించదు. ఈ యాప్ ద్వారా BSNL వినియోగదారులు రీఛార్జ్‌లు, బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడం, వారి స్నేహితులు మరియు బంధువుల రీఛార్జ్‌లను నిర్వహించడం వంటి మరిన్నింటితో సహా ప్రతిదీ చేయవచ్చు. వినియోగదారులు పాత My BSNL యాప్ నుండి సెల్ఫ్‌కేర్ యాప్‌లోకి మారాలని BSNL కోరుకుంటోంది. కానీ 4% తగ్గింపు దాని వినియోగదారుల జీవితాల్లో పెద్ద మార్పును తీసుకురాదు కాబట్టి టెల్కో ఇతర మార్గాలను ప్రయత్నించాలి.

BSNL కొత్త ప్లాన్‌లు

BSNL కొత్త ప్లాన్‌లు

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కొత్తగా ప్రవేశపెట్టిన ప్లాన్‌లలో మొదటిది రూ.184 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్‌ 1GB రోజువారీ డేటా, 100 SMS మరియు అపరిమిత వాయిస్ కాలింగ్‌ ప్రయోజనాలతో లభిస్తాయి. అలాగే రూ.185 మరియు రూ.186 ధరల వద్ద లభించే ప్లాన్‌లు కూడా 1GB రోజువారీ డేటా మరియు 100 SMS మరియు అపరిమిత వాయిస్ కాలింగ్‌ ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఈ మూడు ప్లాన్‌లు కూడా 28 రోజుల వాలిడిటీతో వస్తాయి. ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP) డేటా వినియోగం తర్వాత మూడు ప్లాన్‌లతో వినియోగదారు ఇంటర్నెట్ స్పీడ్ 80 Kbpsకి పడిపోతుంది. మూడు ప్లాన్‌లు వాలిడిటీలో ఒకే రకంగా ఉన్నప్పటికీ ప్రతి దానిలో భిన్నమైన విషయానికి వస్తే రూ.184 ప్రీపెయిడ్ ప్లాన్‌తో వినియోగదారులు Lystn పాడ్‌కాస్ట్ యొక్క అదనపు ప్రయోజనాన్ని పొందుతారు. అయితే రూ.185 ప్రీపెయిడ్ ప్లాన్‌తో వినియోగదారులు "M/S ఆన్‌మొబైల్ గ్లోబల్ లిమిటెడ్ మరియు BSNL ట్యూన్స్ ద్వారా ప్రోగ్రెసివ్ వెబ్ APP (PWA)లో సవాళ్ల బండ్లింగ్ అరేనా మొబైల్ గేమింగ్ సర్వీస్‌ను పొందుతారు. అలాగే రూ.186 ప్లాన్ హార్డీ గేమ్‌లు మరియు BSNL ట్యూన్స్ యొక్క అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. రూ.347 ధర వద్ద లభించే మరొక కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌తో వినియోగదారులు 2GB రోజువారీ డేటా, 100 SMS మరియు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్లాన్ 56 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.

Best Mobiles in India

English summary
BSNL Reducing The Prices of Prepaid Plans For Those Who Recharge Through This App

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X