BSNL యూజర్లకు చేదు వార్త!! ఈ 5 STV ప్లాన్లను తొలగించారు...
ఇండియాలోని టెలికాం సంస్థలలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఏకైక సంస్థ బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు తన యొక్క పోర్టుపోలియోలో రూ.1,498 ధర వద్ద లభించే డేటా STV ప్లాన్ ను తొలగించింది. బిఎస్ఎన్ఎల్ ఇటీవల తన అనేక STV ప్లాన్లను అప్‌డేట్ చేసింది. రూ.1,498 ధర వద్ద లభించే డేటా STV వినియోగదారులకు 91GB డేటాను ఎటువంటి రోజువారీ లేదా నెలవారీ పరిమితి లేకుండా 365 రోజుల చెల్లుబాటు కాలానికి అందించేది. ఇదే కాకుండా STV-1498 , STV-13, STV-20, STV-93, STV-111లను కూడా తొలగించినట్లు బిఎస్‌ఎన్‌ఎల్ తన అధికారిక వెబ్‌సైట్‌లో ధృవీకరించింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

బిఎస్‌ఎన్‌ఎల్ STV-1498 ప్లాన్ తొలగింపు
బిఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన STV -1498 ప్లాన్ ఒక సంవత్సరం చెల్లుబాటుతో 91GB డేటాను అందించేది. ఇది BSNL అందించే ప్రసిద్ధ STV ప్లాన్లలో లేదు కానీ ఒక సంవత్సరం పాటు స్థిరమైన డేటా ప్రయోజనం కోసం చూస్తున్న వినియోగదారుల కోసం ఇది మంచి ఎంపికగా ఉంటుంది. రాబోయే వారాల్లో బిఎస్‌ఎన్‌ఎల్ స్థిర డేటా ప్రయోజనంతో కొత్త ప్రీపెయిడ్ ఎస్‌టివిని ప్రవేశపెడుతుందని ఆశించవచ్చు.

బిఎస్‌ఎన్‌ఎల్ తొలగించిన ఇతర 5 ప్రీపెయిడ్ STV ప్లాన్లు
బిఎస్‌ఎన్‌ఎల్ తొలగించిన ఇతర STV ప్లాన్ల విషయానికొస్తే ఏడు రోజుల చెల్లుబాటుతో లభించే STV-13 ప్లాన్, ఏ నెట్‌వర్క్‌కు అయిన 265 SMSలను 15 రోజులకు అందించే STV-20 ప్లాన్, ఉచిత ఇన్‌కమింగ్ కాల్‌లను అనుమతించడంతో పాటు అన్ని నెట్‌వర్క్‌లకు 120 నిమిషాల ఉచిత అవుట్‌గోయింగ్ కాల్స్ లను 30 రోజుల చెల్లుబాటుకు అందించే STV-93 మరియు ఎస్‌టివి -111 ప్లాన్ రూ.90 టాక్‌టైమ్‌తో, రూ.70 విలువైన ఆన్-నెట్ నిమిషాల అవుట్‌గోయింగ్ కాల్ లను అనుమతించే ప్లాన్ లను కూడా తొలగించింది.

బిఎస్‌ఎన్‌ఎల్ STV ప్లాన్లను తొలగించిన సర్కిల్‌లు
బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క ఈ ఐదు STVల తొలగింపుకు సంబంధించిన సమాచారం బిఎస్‌ఎన్‌ఎల్ తన కర్ణాటక వెబ్‌సైట్‌లో అధికారికంగా ప్రకటన చేసింది. అయినప్పటికీ మేము STN-1498 ను BSNL తెలంగాణ మొబైల్ నంబర్‌లో రీఛార్జ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, ప్లాన్ చూపబడలేదు. బిఎస్ఎన్ఎల్ చెన్నై సర్కిల్ విషయంలో కూడా ఇదే పరిస్థితి. కాబట్టి బిఎస్‌ఎన్‌ఎల్ పనిచేస్తున్న అనేక సర్కిల్‌లలో మొత్తం ఐదు ఎస్‌టివిలు తొలగించబడినట్లు అనిపిస్తుంది.


Click it and Unblock the Notifications