Home
News

BSNL రిపబ్లిక్ డే 2021 ఆఫర్లలో ఈ ప్లాన్‌లపై అదనపు వాలిడిటీ!! త్వరపడండి

ప్రభుత్వ-టెలికాం ఆపరేటర్ బిఎస్ఎన్ఎల్ ప్రతి సంవత్సరం జనవరి నెలలోని గణతంత్ర దినోత్సవం సందర్భంగా తన యొక్క వినియోగదారులకు కొత్త ఆఫర్లను ముందుకు తీసుకువస్తుంది. అలాగే 72 వ గణతంత్ర దినోత్సవం ఆఫర్లలో రూ.2,399 మరియు రూ.1,999 రెండు దీర్ఘకాలిక ప్రీపెయిడ్ రీఛార్జిలపై అదనపు చెల్లుబాటును తీసుకువచ్చింది. ఇవే కాకుండా 30 రోజుల వాలిడిటీతో కొత్తగా STV398 ప్లాన్ ను కూడా విడుదల చేసింది. బిఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్‌లలోని రోజువారీ 250 నిమిషాల FUP వాయిస్ కాలింగ్ పరిమితిని ఇటీవల తొలగించుతూ అతి పెద్ద మార్పులకు శ్రీకారం మొదలుపెట్టింది. బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న రిపబ్లిక్ డే 2021 ఆఫర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL రూ.1,999 ప్లాన్ రిపబ్లిక్ డే ఆఫర్

BSNL రూ.1,999 ప్లాన్ రిపబ్లిక్ డే ఆఫర్

బిఎస్ఎన్ఎల్ టెల్కో రూ.1,999 ధర వద్ద వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. రిపబ్లిక్ డే 2021 ఆఫర్లలో భాగంగా ఈ ప్లాన్ యొక్క వాలిడిటీని అదనంగా మరొక 21 రోజులపాటు పెంచింది. ఇది ప్లాన్ యొక్క మొత్తం వాలిడిటీని 386 రోజులకు పెంచింది. ఈ అదనపు చెల్లుబాటు ఆఫర్ జనవరి 31, 2021 లోపు రీఛార్జ్ చేసిన వారికి మాత్రమే లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికొస్తే భారతదేశంలోని అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 3GB డేటా మరియు రోజుకు 100SMS లు లభిస్తాయి. ఇవేకాకుండా 365 రోజుల కాలంలో అపరిమిత మార్పు ఎంపికతో హలో ట్యూన్స్ ను ఉచితంగా అందిస్తుంది. అలాగే ఈరోస్ నౌ చందాను 365 రోజులకు మరియు మొదటి 60 రోజులు లోక్‌ధన్ కంటెంట్‌తో లభిస్తుంది.

BSNL రూ.2,399 ప్లాన్ రిపబ్లిక్ డే ఆఫర్

BSNL రూ.2,399 ప్లాన్ రిపబ్లిక్ డే ఆఫర్

2021 లోని 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బిఎస్ఎన్ఎల్ టెల్కో తన యొక్క రూ.2,399 దీర్ఘకాలిక ప్లాన్ వాలిడిటీని అదనంగా మరొక 72 రోజులకు పెంచింది. ఇది రోజువారీ FUP పరిమితి లేకుండా అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS‌లు మరియు రోజుకు 3GB డేటా వంటి ప్రయోజనాలను అందిస్తుంది. అదనపు ప్రయోజనాలలో 365 రోజులకు ఉచిత హలో ట్యూన్ మరియు మొత్తం వాలిడిటీ కాలానికి ఈరోస్ నౌ చందాను అందిస్తుంది.

BSNL రూ.398 ప్లాన్ రిపబ్లిక్ డే ఆఫర్

BSNL రూ.398 ప్లాన్ రిపబ్లిక్ డే ఆఫర్

ఇండియా టెలికాం మార్కెట్లో ప్రైవేట్ టెల్కోలకు పోటీగా ఉండటానికి బిఎస్ఎన్ఎల్ కొన్ని వారాల క్రితం STV398 ప్లాన్ ను తీసుకువచ్చింది. అయితే రిపబ్లిక్ డే 2021 ఆఫర్లలో భాగంగా టెల్కో దీనిని మార్కెటింగ్ చేస్తోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత డేటా ప్రయోజనంతో వస్తుంది. కొంత మొత్తంలో డేటా వినియోగం తర్వాత రోజువారీ FUP పరిమితి లేదా డేటా స్పీడ్ గురించి బిఎస్‌ఎన్‌ఎల్ ప్రస్తావించలేదు కాబట్టి ఈ ప్లాన్ ఎటువంటి పరిమితి లేకుండా అపరిమిత డేటాను అందిస్తుంది. ఢిల్లీ మరియు ముంబై సర్కిల్‌లతో సహా అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాల్‌లను మరియు రోజుకు 100 SMS ల ప్రయోజనాలను అందిస్తుంది.

BSNL రిపబ్లిక్ డే 2021 ఆఫర్ ఫుల్ టాక్ టైమ్ ప్లాన్లు

BSNL రిపబ్లిక్ డే 2021 ఆఫర్ ఫుల్ టాక్ టైమ్ ప్లాన్లు

బిఎస్ఎన్ఎల్ 2021లోని రిపబ్లిక్ డే ఆఫర్లలో భాగంగా చివరిగా కొన్ని టాప్‌అప్‌లు కూడా ఉన్నాయి. ఇవి పరిమిత కాలానికి పూర్తి టాక్ టైమ్ ప్రయోజనాన్ని అందిస్తాయి. వీటిలో రూ.120, రూ.150, రూ.200, రూ .220, రూ .300, రూ .500, రూ .550, రూ .1,100, రూ .1,100, రూ .2,000, రూ.3,000, రూ.5,000 ప్లాన్ లు ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ రిపబ్లిక్ డే 2021 ఆఫర్లలో ఇవి పరిమిత సమయానికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇందులో మీకు ఇష్టమైన ప్లాన్ ను ఎంచుకోవచ్చు.

Best Mobiles in India

English summary
BSNL Republic Day 2021 Offers: These Long-Term Plans Get Extra Validity
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X