100Mbps స్పీడుతో 3000జిబి డేటా ప్లాన్ గురించి తెలుసా ?
దేశీయ టెలికాం రంగంలో పెనుమార్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో దిగ్గజ టెల్కోలు అన్నీ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ల మీద దృష్టిని నిలిపాయి.
దేశీయ టెలికాం రంగంలో పెనుమార్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో దిగ్గజ టెల్కోలు అన్నీ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ల మీద దృష్టిని నిలిపాయి. రిలయన్స్ జియో అతి త్వరలోనే గిగా ఫైబర్ సేవలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, పోటీని తట్టుకునేందుకు అన్ని కంపెనీలు సరికొత్త వ్యూహాలతో ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఆకర్షణీయమైన ఆఫర్ ను ప్రకటించింది. ఎఫ్ టీటీహెచ్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లను సవరిస్తూ, సెకనుకు 100 మెగాబైట్ల వేగంపై నెలకు 3000 మెగాబైట్ల డేటాను ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని టెలికాం టాక్ రిపోర్ట్ చేసింది. టెలికాం టాక్ రిపోర్ట్ ప్రకారం..

BSNL నాలుగు రకాల ప్లాన్లను..
BSNL నాలుగు రకాల ప్లాన్లను సవరించింది. Rs. 3,999, Rs. 5,999, Rs. 9,999, and Rs.16,999 ఈ ప్లాన్లపై ఎక్కువ డేటాను ఆఫర్ చేయనుంది. ఈ ప్లాన్లలో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

రూ. 3,999
రూ. 3,999 కాంబో ప్లాన్ ప్రకారం 50Mbps స్పీడుతో నెలకి 500GB FUP dataను వినియోగదారులకు అందించనుంది. ఇంతకు ముందు ఈ ప్లాన్ లో 20Mbps స్పీడుతో 300GB డేటా మాత్రమే లభించేది.దీంతో పాటు అన్ లిమిడెట్ డేటా ఆఫర్ చేస్తోంది. FUP అయిన తరువాత 4Mbps స్పీడుతో అన్ లిమిడెట్ డేటాను వాడుకోవచ్చు.

రూ. 5,999
రూ. 5,999 కాంబో ప్లాన్ ప్రకారం 60Mbps స్పీడుతో నెలకి 1000GB FUP dataను వినియోగదారులకు అందించనుంది. ఇంతకు ముందు ఈ ప్లాన్ లో 30Mbps స్పీడుతో 400GB డేటా మాత్రమే లభించేది.దీంతో పాటు అన్ లిమిడెట్ డేటా ఆఫర్ చేస్తోంది. FUP అయిన తరువాత 4Mbps స్పీడుతో అన్ లిమిడెట్ డేటాను వాడుకోవచ్చు.

Rs. 9,999
రూ. 5,999 కాంబో ప్లాన్ ప్రకారం 80Mbps స్పీడుతో నెలకి 2000GB FUP dataను వినియోగదారులకు అందించనుంది. ఇంతకు ముందు ఈ ప్లాన్ లో 50Mbps స్పీడుతో 600GB డేటా మాత్రమే లభించేది.దీంతో పాటు అన్ లిమిడెట్ డేటా ఆఫర్ చేస్తోంది. FUP అయిన తరువాత 6Mbps స్పీడుతో అన్ లిమిడెట్ డేటాను వాడుకోవచ్చు.

Rs.16,999
రూ. 5,999 కాంబో ప్లాన్ ప్రకారం 100Mbps స్పీడుతో నెలకి 3000GB FUP dataను వినియోగదారులకు అందించనుంది. ఇంతకు ముందు ఈ ప్లాన్ లో 100Mbps స్పీడుతో 800GB డేటా మాత్రమే లభించేది.దీంతో పాటు అన్ లిమిడెట్ డేటా ఆఫర్ చేస్తోంది. FUP అయిన తరువాత 6Mbps స్పీడుతో అన్ లిమిడెట్ డేటాను వాడుకోవచ్చు.

ఎంపిక చేసిన సర్కిళ్లలో ఈ ప్లాన్లు
ఎంపిక చేసిన సర్కిళ్లలో ఈ ప్లాన్లు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు మిగతా అన్ని రకాల రీచార్జ్ ప్యాక్ లనూ సవరించామని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.

జియో
ఇదిలా ఉంటే జియో వచ్చే నెల నుంచి తన గిగాపైబర్ సేవలను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. 1జిబిపిఎస్ స్పీడుతో ఈ సేవలు అందుతాయని కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








