సరికొత్త బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ తో దూసుకొస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్

By Anil
|

దేశీయ టెలికాం రంగంలో పెను మార్పులు చోటు చేసుకోవడం ఆ మార్పులు బ్రాడ్ బ్యాండ్ వైపుకు వెళ్లడం శరవేగంగా జరిగిపోతోంది. అన్ని టెల్కోలు ఇప్పుడు బ్రాడ్ బ్యాండ్ వైపు దృష్టి సారించాయి.ఇందులో భాగంగానే రిలయన్స్ జియో తన బ్రాడ్‌బ్యాండ్ సేవలు విస్తరించేందుకు రెడీ అయింది. అయితే రిలయన్స్ జియో కీ పోటీగా బీఎస్‌ఎన్‌ఎల్ నూతనంగా పలు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది.అయితే ఈ సరికొత్త ప్లాన్ అన్ని రాష్ట్రాల్లో కాకుండా చెన్నై లో మాత్రమే ప్రవేశపెట్టింది.

 

రూ.4,999 కే..

రూ.4,999 కే..

తాజాగా రూ.4,999 కే మరో నూతన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ లాంచ్ చేసింది. బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన ఎఫ్‌టీటీహెచ్ (ఫైబర్ టు ది హోమ్) బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌ను వాడేవారి కోసం ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

1.5టిబి  డేటా:

1.5టిబి డేటా:

రూ.4,999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో కస్టమర్లకు 1.5టిబి డేటా లభిస్తుంది. దీనికి 30 రోజుల వాలిడిటీ ఉంటుంది. 1.5టిబి ముగిసే వరకు ఇంటర్నెట్ స్పీడ్ గరిష్టంగా 100 ఎంబీపీఎస్ వరకు వస్తుంది. తరువాత స్పీడ్ తగ్గుతుంది. అప్పుడు కస్టమర్లకు కేవలం 2 ఎంబీపీఎస్ స్పీడ్ మాత్రమే వస్తుంది.

రూ.1299:
 

రూ.1299:

అలాగే రూ.1299 కు మరో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను కూడా బీఎస్‌ఎన్‌ఎల్ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో 30 రోజులకు గాను 400 జీబీ డేటా ఉచితంగా వస్తుంది. దీంట్లో ఉచిత డేటా అయిపోగానే స్పీడ్ 100 ఎంబీపీఎస్ నుంచి 2 ఎంపీబీఎస్ కు పడిపోతుంది. ఈ రెండు ప్లాన్లు ఫైబ్రో కాంబో యూఎల్‌డీ పేరిట లభిస్తున్నాయి.బీఎస్‌ఎన్‌ఎల్ ఇటీవలే తన సరికొత్తగా రూ.1045, రూ.1395, మరియు రూ.1895 ప్లాన్లను ప్రకటించింది

బీఎస్‌ఎన్‌ఎల్ ఇతర ప్లాన్స్:

బీఎస్‌ఎన్‌ఎల్ ఇతర ప్లాన్స్:

రూ.1,699 ప్లాన్ 80Mbps వేగంతో 550GB డేటాను అందిస్తుంది
రూ.1,999 ప్లాన్ 80Mbps వేగంతో 800GB డేటాను అందిస్తుంది
రూ.2,999 ప్లాన్ 80Mbps వేగంతో 900GB డేటాను అందిస్తుంది

అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు :

అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు :

ఈ ప్లాన్లపై రోజువారీ డేటా ప్రయోజనాలతో పాటు, అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ సౌకర్యాలను యూజర్లు పొందవచ్చు.అలాగే ఈ ప్లాన్లపై బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉచిత ఈ-మెయిల్‌ ఐడీ ఇస్తుంది.

జియో గిగా ఫైబర్:

జియో గిగా ఫైబర్:

జియో ఈ నెల ప్రారంభంలో జియో గిగా ఫైబర్ ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది.ఇందులో 1Gbps వరకు స్పీడ్ వస్తుంది . మొబైల్ పరికరాల కోసం వాల్ టు వాల్ బ్రాడ్ బ్యాండ్ సేవలను అందించడం లక్ష్యంగా జియో దీనిని ప్రారంభించింది ,ఇది GigaTV సెట్-టాప్ బాక్సలు మరియు స్మార్ట్ హోమ్ పరికరాల సహాయంతో TV లలో కూడా పని చేస్తుంది. GigaTV ఉన్నవారు ఇతర టీవీలు, ఫోన్లు మరియు టాబ్లెట్లకు ఫోన్ కాల్స్ చేయగలరు.ఈ జియో జిగాఫైబర్ నెట్వర్క్ లు టీవీ, మల్టీ-పార్టీ వీడియో కాన్ఫరెన్సింగ్, వాయిస్ యాక్టివేటెడ్ వర్చువల్ అసిస్టెంట్, వర్చువల్ రియాలిటీ గేమింగ్ మరియు షాపింగ్ మరియు స్మార్ట్ హోమ్ సొల్యూషన్స్ వంటి సేవలను చందాదారులకు అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Now that Jio GigaFiber broadband service has been announced, Bharat Sanchar Nigam Limited (BSNL) is revamping its own plans to give some competition to Reliance Jio. The company has now increased the FUP limit on its premium FTTH (Fibre-to-the-Home) plans in the Chennai circle. For the Chennai circle, BSNL is now offering 1.5TB data limit on the Rs. 4,999 plan

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X