180 పాటు రోజులు అన్‌లిమిటెడ్, కేవలం రూ. 186కే, మరో కొత్త ప్లాన్ షురూ !

Written By:

జియో దెబ్బకు అన్ని టెల్కోలు భారీ నష్టాలను మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ సైతం జియో దెబ్బకు కుదేలయింది. ఇప్పుడు పోయిన చోటే వెతుక్కోవాలన్న చందంగా BSNL సరికొత్త ప్లాన్లకు తెరలేపింది. పాత ప్లాన్ లో సరికొత్త మార్పులు చేసి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

100 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో విరుచుకుపడుతున్న టెల్కోలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.187ల ప్లాన్‌లో BSNL సరికొత్త మార్పులు..

దాదాపు నెల రోజుల క్రితం లాంచ్‌ చేసిన రూ.187ల ప్లాన్‌లో BSNL సరికొత్త మార్పులు తీసుకొచ్చింది. 28 రోజుల వాలిడిటీ ఉన్న ఈప్లాన్‌లో 1 జీబీ డేటాతోపాటు అన్‌లిమిటెడ్‌ (నేషనల్‌ రోమింగ్‌) కాలింగ్‌ను అందిస్తోంది.

ఈ ప్లాన్‌లో 1 జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌

ఇంతకు ముందు ఈ ప్లాన్‌లో 1 జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ (హోమ్ సర్కిల్‌లో)లోక్‌ల్‌ కాలింగ్‌మాత్రమే అందుబాటులో ఉండేంది. ఢిల్లీ, ముంబాయి నగరాలు తప్ప దేశ వ్యాప్తంగా మిగిలిన అన్ని ప్రదేశాలకు ఈ ప్లాన్ వర్తిస్తుంది.

మరో ప్లాన్‌ రూ. 186లో..

బీఎస్‌ఎన్‌ఎల్‌ మరో ప్లాన్‌ రూ. 186లో అన్‌లిమిటెడ్‌ లోకల్‌ అండ్‌ ఎస్టీడీ వాయిస్ కాల్స్ , 1 జీబీ డేటా అందిస్తోంది. ఈ ప్లాన్‌ 180 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులోకి వచ్చింది.

ఈ ప్లాన్లో కొన్ని పరిమితులు

అయితే ఈ ప్లాన్లో కొన్ని పరిమితులు ఉన్నాయి. డేటా మొదటి 28 రోజుల్లో మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. అపరిమిత వాయిస్ కాల్స్ ఆన్-నెట్ , ఆఫ్-నెట్ వాయిస్ కాల్స్ 180 రోజులు అందుబాటులో ఉంటాయి .

రీచార్జ్ చేసుకునే సమయంలో

వినియోగదారులు ఈ ప్లాన్ రీచార్జ్ చేసుకునే సమయంలో ఈ ప్లాన్‌కి అర్హులమో కాదో ఓ సారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అర్హులయితే ప్లాన్ వేసుకోవచ్చు.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BSNL revises Rs 187 plan to offer unlimited roaming calls, 1GB data for 28 days more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot