రివైజ్ అయిన BSNL చోట రీఛార్జి ప్లాన్స్ ఇప్పుడు 1 జీబీ డేటా మాత్రమే
ఆగష్టులో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) దాని ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ ను మార్కెట్లో ప్రవేశ పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అందులో ఒకటి రూ.29 ప్లాన్ కాగా మరొకటి రూ.9 ప్లాన్ .
ఆగష్టులో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) దాని ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ ను మార్కెట్లో ప్రవేశ పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అందులో ఒకటి రూ.29 ప్లాన్ కాగా మరొకటి రూ.9 ప్లాన్ . అయితే ఇప్పుడు ఈ రెండు ప్లాన్స్ బిఎస్ఎన్ఎల్ రివైజ్ చేయబోతుంది. గతంలో రూ.29కే అపరిమిత కాలింగ్ మరియు 2 జీబీ ఉచిత డేటా ఆఫర్ చేసేది అయితే ఇప్పుడు దానిని రివైజ్ చేస్తూ 1 జీబీ డేటా మాత్రం ఆఫర్ చేస్తుంది .

రూ.29 రీఛార్జ్ ప్లాన్
బీఎస్‌ఎన్‌ఎల్ రివైజ్ చేసిన రూ.29 రీఛార్జ్ ప్లాన్ ఢిల్లీ, ముంబై మినహా మిగతా అన్ని ప్రాంతాలకు లభ్యమవుతోంది. అపరిమిత వాయిస్ కాలింగ్, 1 జీబీ ఉచిత డేటా తో 300 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, ఉచితంగా పర్సనలైజ్డ్ రింగ్‌బ్యాక్ టూన్లను ఆఫర్ చేయనుంది. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ 7 రోజులు మాత్రమే.

రూ.9 రీఛార్జ్ ప్లాన్
బీఎస్‌ఎన్‌ఎల్ రివైజ్ చేసిన ఈ రూ.9 రీఛార్జ్ ప్లాన్ కూడా ఢిల్లీ, ముంబై మినహా మిగతా అన్ని ప్రాంతాలకు లభ్యమవుతోంది. అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు,100 ఎంబీ డేటా, 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, ఉచితంగా పర్సనలైజ్డ్ రింగ్‌బ్యాక్ టూన్లను ఆఫర్ చేయనుంది. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ 1 రోజు మాత్రమే.

జియో vs బీఎస్‌ఎన్‌ఎల్
బీఎస్‌ఎన్‌ఎల్ రూ.29 ప్లాన్ తో జియో యొక్క రూ.52 ప్లాన్ పోటీపడుతుంది .కాగా జియో రూ.52 ప్లాన్ తో యూజర్ కు 1.5 జీబీ 4g డేటా , అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వీటితో పాటు 70 ఎస్ఎమ్ఎస్ లు ఉచితంగా లభిస్తాయి . ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 7 రోజులు మాత్రమే.మరో బీఎస్‌ఎన్‌ఎల్ రూ.9 ప్లాన్ తో జియో యొక్క రూ.19 ప్లాన్ పోటీపడుతుంది ఈ ప్లాన్ లో యూజర్ కు 150 MB 4g డేటా , అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి . ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 1 రోజు మాత్రమే

బీఎస్‌ఎన్‌ఎల్ రూ.29 ప్లాన్ తో మ్యాచ్ అయ్యే ఇతర టెలికాం కంపెనీ ప్లాన్స్...
ఎయిర్టెల్ రూ. 47 ప్లాన్...
ఎయిర్టెల్ రూ. 47 ప్లాన్ ఇందులో యూజర్ 150 నిమిషాల లోకల్,STD,రోమింగ్ కాల్స్ లభిస్తాయి. దీనితో పాటు 500 MB 3/4g డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 27 రోజులు మాత్రమే.
వోడాఫోన్ రూ. 47 ప్లాన్...
వోడాఫోన్ రూ. 47 ప్లాన్ ఇందులో యూజర్ 125 నిమిషాల లోకల్,STD,రోమింగ్ కాల్స్ లభిస్తాయి. దీనితో పాటు 500 MB 3/4g డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 27 రోజులు మాత్రమే


Click it and Unblock the Notifications








