బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు గుడ్ న్యూస్
రిలయన్స్ జియో రాకతో టెలికాం రంగంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం దేశం లో ఉన్న ప్రైవేట్ సంస్థలు రిలయన్స్ దెబ్బకి చతికల పడ్డ తరువాత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.
రిలయన్స్ జియో రాకతో టెలికాం రంగంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం దేశం లో ఉన్న ప్రైవేట్ సంస్థలు రిలయన్స్ దెబ్బకి చతికల పడ్డ తరువాత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి .పలు ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి.ప్రస్తుతం తమ పాత ప్లాన్లలో మార్పులు చేర్పులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా తన రూ.98 ప్లాన్ లో మార్పులు చేసింది.

బీఎస్ఎన్ఎల్ రూ.98 ప్లాన్
ఈ ప్లాన్లో భాగంగా కంపెనీ 26 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 జిబి డేటా చొప్పున అందిస్తోంది. అలాగే అన్ లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ కాల్స్ పాటు లభిస్తాయి. అలాగే రోజుకు 100 ఎసెమ్మెస్ లు ఉచితంగా లభిస్తాయి. అయితే మారిన ప్లాన్ ప్రకారం ఇకపై దీని మీద 2 జిబి డేటాను అందుకుంటారు.

బీఎస్ఎన్ఎల్ vs ఎయిర్‌టెల్
ఎయిర్‌టెల్ కూడా రూ.98 ప్లాన్ ను లంచ్ చేసింది .ఎయిర్‌టెల్ రూ.98 రీఛార్జి చేసుకున్న యూజర్ కు 5జిబి డేటాను 28 రోజుల పాటు అందిస్తోంది.అయితే ఇందులో ఎటువంటి కాల్ ఆఫర్స్ కానీ SMS ఆఫర్లు కానీ ఉండవు.ఈ ప్లాన్ కేవలం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సర్కిల్స్ లో మాత్రమే అందుబాటులో ఉంది.

బీఎస్ఎన్ఎల్ vs జియో
జియో లో కూడా రూ.98 ప్లాన్ అందుబాటులో ఉంది .జియో రూ.98 రీఛార్జి చేసుకున్న వారికి అపరిమిత కాల్స్ తో పాటు 2జీబీ డేటా, 300 SMS లభిస్తాయి అలాగే జియో యాప్స్ ను ఫ్రీ గా సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే


Click it and Unblock the Notifications








