వెనక్కి తగ్గిన బీఎస్ఎన్ఎల్, ఆఫర్లలో భారీ మార్పులు

పోటాపోటి ఆఫర్లతో జియోతో పాటు ఇతర ప్రయివేటు టెల్కోలకు చుక్కలు చూపిస్తోన్న ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ అదే బఆఫర్ల విషయంలో వెనక్కితగ్గినట్లు సమాచారం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొన్ని రిపోర్ట్స్ ప్రకారం..

ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోన్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం బీఎస్ఎన్ఎల్, ఇటీవల లాంచ్ చేసిన పలు ప్లాన్‌లకు సంబంధించి భారీ మార్పుచేర్పులను చేసినట్లు తెలియవచ్చింది.

Chaukka 444 plan రద్దు!

Keralatelecom.info పోస్ట్ చేసిన కధనం ప్రకారం Chaukka 444 planను బీఎస్ఎన్ఎల్ వెనక్కితీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా నెల క్రితం మార్కెట్లో లాంచ్ అయిన ఈ ప్రమోషనల్ ఆఫర్ క్రింద రూ.444 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే 90 రోజుల పాటు రోజుకు 4జీబి 3జీ డేటా లభిస్తుంది.

పనిలో పనిగా వాటిని కూడా..

పనిలో పనిగా Nehle per Dehla 395, Triple Ace 333 ప్లాన్‌లను కూడా బీఎస్ఎన్ఎల్ సవరించినట్లు తెలుస్తోంది.

SNL STV 395 ప్లాన్

తాజా సవరణలో భాగంగా BSNL STV 395 ప్లాన్ వ్యాలిడిటీని 71 రోజుల నుంచి 56 రోజులకు తగ్గించినట్లు తెలుస్తోంది. STV395 Nehle per Dehla ప్లాన్‌లో రోజుకు 2జిబి చొప్పున ఉపయోగించుకోవచ్చు. BSNL టూ BSNL 3000నిమిషాలు వరకు మాట్లాడుకోవచ్చు. ఇతర నెట్ వర్క్ లకు 1800 నిమిషాల పాటు మాట్లాడుకోవచ్చు.

జూలై 23 నుంచి వర్తింపు...

Triple Ace 333 ప్లాన్ వ్యాలిడిటీని 90 రోజుల నుంచి 56 రోజులకు తగ్గించినట్లు తెలుస్తోంది. ఇక పై ఈ ప్లాన్‌లో రోజుకు 2జీబి డేటా మాత్రమే వర్తించనుంది. జూలై 23, 2017 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నట్లు సమాచారం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BSNL Revises STV 395 and STV 333 Plans; To Discontinue Chaukka 444 Plan. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot