రూ.349 ప్లాన్‌లో భారీ మార్పులు చేసిన బిఎస్ఎన్ఎల్
దేశీయ టెలికాం రంగంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జియో రాకతో టెలికాం ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది.
దేశీయ టెలికాం రంగంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జియో రాకతో టెలికాం ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది. క్లుప్తంగా చెప్పాలంటే జియో రాక ముందు జియో తర్వాత అన్నట్లుగా టెలికాం రంగం మారిపోయింది. జియో దెబ్బతో దాదాపు అన్ని టెలికం సంస్థలు మూతపడగా, ఆ దెబ్బను తట్టుకుని నిలబడ్డ కొన్ని సంస్థలు జియోను అధిగమించడానికి సర్వశక్తులూ ఉపయోగిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బిఎస్‌ఎన్ఎల్ వినియోగదారుల కోసం అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తోంది.

రూ. 349 ప్రీపెయిడ్ ప్లాన్
బిఎస్‌ఎన్ఎల్ ఇప్పటికే అందిస్తున్న రూ. 349 ప్రీపెయిడ్ ప్లాన్‌లో తాజాగా మార్పులు చేసింది. ఈ ప్లాన్ క్రింద వినియోగదారులు ఇప్పటి వరకు అపరిమిత లోకల్ మరియు ఎస్‌టీడీ కాల్‌లతో పాటు ప్రతిరోజూ 1 జీబీ డేటాను పొందుతుండగా ఇక నుండి రూ. 349తో రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు అపరిమిత కాల్‌లతో పాటుగా 3.2 జీబీ డేటాను అందించనుంది.

వ్యాలిడిటీ 64 రోజులు
అంతే కాకుండా డేటా స్పీడ్‌ను కూడా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆ ఆఫర్ ఢిల్లీ, ముంబై సర్కిల్స్ మినహా అన్ని ప్రాంతాల వినియోగదారులకు వర్తిస్తుంది.దీని వ్యాలిడిటీ 64 రోజులుగా ఉంటుంది.

3.2 జీబీ డేటా
ఇదే మొత్తానికి జియో 1.5 జీబీ డేటాను అందిస్తుండగా బిఎస్‌ఎన్ఎల్ దానికి రెట్టింపు కంటే ఎక్కువగా 3.2 జీబీ డేటాను అందిస్తోంది. ఈ ఆఫర్లు ఇలాగే కొనసాగితే జియో కూడా నష్టాల్లోకి వెళ్లిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

బిఎస్ఎన్ఎల్ రూ. 98 ప్లాన్
ఈ ప్లాన్ వ్యాలిడిలీ 26 రోజులు. గతంలో ఉన్న 1.5 జిబికి అదనంగా 0.5జిబిని యాడ్ చేసింది. తద్వారా రోజుకు 2జిబి డేటాను యూజర్లు అందుకుంటారు. కాగా దీని వ్యాలిడిటీ 24 రోజులు. ఈ డేటా అయిపోయిన తర్వాత స్పీడే వేగం తగ్గుతుంది.

ప్లాన్లు రివిజన్
కాగా ఇప్పటికే Rs 14, Rs 19, Rs 40 and Rs 57 ప్లాన్లను రివైజ్ చేసిన సంగతి విదితమే. Rs 14 ప్లాన్లో ఇంతకు ముందు ఉన్న 110 ఎంబి డేటాకు ఇప్పుడు 1జ5 జిబి డేటాను అందిస్తోంది. అలాగే రూ. 29 ప్లాన్లో 3 రోజులకు 1జిబి డేటాను రూ. 57,రూ.47 ప్లాన్లలో రోజుకు 1జిబి డేటాను అందిస్తోంది.

అదనపు డేటా
కాగా జనవరలో Rs 186, STV 187, STV 333, STV 349, STV 444, STV 448, STV 1699, STV 2099, Rs 429, Rs 485, Rs 666 and Rs 999 ఈ ప్లాన్లలో అదనపు డేటాను అందిస్తూ నిర్ణయం తీసుకుంది.


Click it and Unblock the Notifications








