2018 నాటికి తెలుగు రాష్ట్రాల్లో BSNL 4జీ సేవలు

ఆంధ్రప్రదేశ్, తెలింగాణ ప్రాంతాల్లో 4జీ సేవల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్చి 2018 నాటికి తెలుగు రాష్ట్రాల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీసులు అందుబాటులో ఉంటాయని సంస్థ సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టెండర్ ఫర్మాలిటీస్ కొలిక్కి..

4జీ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు సంబంధించి రెండు రాష్ట్రాల్లో 1,150 4జీ సైట్‌లను ఇన్‌స్టాల్ చేసేందుకు టెండర్ ఫర్మాలిటీస్ ఇప్పటికే పూర్తయ్యాయిని బీఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎల్ అనంతరామ్ తెలిపారు.

తెలంగాణకు 550, ఆంధ్రప్రదేశ్‌కు 600

4జీ ప్రాజెక్టకు సంబంధించి టెండరింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. నెట్‌వర్క్ ఏర్పాటుకు సంబంధించి బీఎస్ఎన్ఎల్ హెడ్‌క్వార్టర్స్ నుంచి ఇప్పటికే గైడ్‌లైన్స్ అందాయి. వెండర్‌ని కూడా ఫైనలైజ్ చేసేసాం. బీఎస్ఎన్ఎల్ 4జీ ప్రాజెక్ట్ నిమిత్తం పాన్ ఇండియా మొత్తం మీద 10,000 4జీ సైట్‌లను ప్లాన్ చేయటం జరిగిది. వాటిలో తెలంగాణకు 550, ఆంధ్రప్రదేశ్‌కు 600 సైట్‌లను కేటాయించటం జరిగిందని బీఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ జనరల్ మేనేజర్ పి. సుధాకర్ రావు తెలిపారు.

కొత్త సిమ్ యాక్టివేషన్స్ విషయంలో ఏపీ సర్కిల్ ముందంజ..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను, మొదటి క్వార్టర్‌లో సౌత్ జోన్‌ పరిధిలో యాడ్ అయిన కొత్త సిమ్ యాక్టివేషన్స్ పరిశీలించినట్లయితే ఒక్క ఏపీ సర్కిల్ (తెలంగాణ+ఆంధ్రప్రదేశ్) నుంచే 4,27,209 కొత్త కనెక్షన్స్ లభించినట్లు అనంతరామ్ తెలిపారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను బీఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభాగాల నుంచి 2,500 కోట్ల రివెన్యూను అర్జించినట్లు వీరు తెలిపారు.

డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాం ఆదేశాల నేపథ్యంలో..

ప్రస్తుతం వినియోగంలో ఉన్న మొబైల్ నెంబర్లతో పాటు, భవిష్యత్‌లో వినియోగంలోకి రాబోయే అన్ని మొబైల్ ఫోన్ నెంబర్లకు సంబంధించి ఆధార్ ధృవీకరణను తప్పనిసరి చేయాలని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాం (DoT) టెలికం ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ఆధార్ రీ-వెరిఫికేషన్ ప్రాసెస్‌ను వేగవంతం చేసింది.

ఆధార్ రీ-వెరిఫికేషన్‌..

సుప్రీంకోర్డ్ ఉత్తర్వుల ప్రకారం ఫిబ్రవరి 6, 2018 నాటికి ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి కావల్సి ఉంది. ఆధార్ రీ-వెరిఫికేషన్‌కు సహకరించాలని బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే తమ వినియోగదారులకు ఎస్ఎంఎస్‌లు పంపుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BSNL to Roll Out 4G Services in Telangana, Andhra Pradesh by March 2018 Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting