జియోకు పోటీగా సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టిన BSNL
దేశీయ రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియోని ఎదుర్కునేందుకు ప్రభుత్వ రంగం దిగ్గజం BSNL సరికొత్త ప్లాన్లతో ముందుకు దూసుకొచ్చింది.
దేశీయ రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియోని ఎదుర్కునేందుకు ప్రభుత్వ రంగం దిగ్గజం BSNL సరికొత్త ప్లాన్లతో ముందుకు దూసుకొచ్చింది. ఇప్పటికే ఎయిర్టెల్,వోడాఫోన్ లాంటి సంస్థలు జియోతో పోటీనెదుర్కుంటున్న తరుణంలో ప్రభుత్వ రంగ దిగ్గజం జియోకి సవాల్ విసిరేందుకు సిద్ధమైంది.ఈ నేపథ్యంలో BSNL ఇతర టెలికాం కంపెనీలకు సవాలు విసురుతూ రూ.171 సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది.పూర్తి వివర్రాల్లోకి వెళ్తే

రూ.171 ప్లాన్ :
యూజర్లు రూ.171 ప్లాన్ తో రీఛార్జి చేసుకుంటే రోజు 2 జీబీ డేటా మరియు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వీటితో పాటు రోజుకి 100 ఎస్ఎమ్ఎస్ లు లభిస్తాయి . ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులు మాత్రమే.

Jio vs BSNL :
BSNL రూ.171 ప్లాన్ తో జియో యొక్క రూ. 149 ప్లాన్ కు గట్టి పోటీపడుతుంది . కాగా జియో రూ . 149 ప్లాన్ తో యూజర్ 1.5 జీబీ డేటా పొందుతూ అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ రోజు వారి 100 ఎస్ఎమ్ఎస్ లు పొందుతారు. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు మాత్రమే . అయితే BSNL మాత్రం జియోకు పోటీగా 2 జీబీ డేటాను అందిచబోతుంది. జియో యూజర్లుకు రిలయన్స్ జియో యోక్క యాప్స్ అన్ని యాక్సిస్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది.

MTNL రూ. 171 ప్లాన్ :
కాగా రీసెంట్ గా MTNL కూడా రూ. 171 అనే సరికొత్త ప్లాన్ నుప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ తో యూజర్లు 1.5 జీబీ డేటా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ రోజు వారి 100 ఎస్ఎమ్ఎస్ లు పొందుతారు. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు మాత్రమే.

BSNL రూ. 499 పోస్ట్ పెయిడ్ ప్లాన్ :
కాగా BSNL సరికొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్ కు తెరలేపింది. ఇందులో భాగంగా యూజర్ నెలకు 45 జీబీ డేటా అందించబోతుంది.డేటా తో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ రోజు వారి 100 ఎస్ఎమ్ఎస్ బెనిఫిట్లను అందిస్తుంది.ఆన్ లైన్ రిపోర్ట్ ప్రకారం యూజర్లు అన్‌లిమిటెడ్ లోకల్ కాల్స్ మరియు రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు. కాగా ఈ ప్లాన్ జియో రూ. 509 ప్లాన్ తో పోటీపడుతుంది .


Click it and Unblock the Notifications








