BSNL రూ.189తో 3జీబి డేటా, నెలంతా కాల్స్!
రూ.101, రూ.169 ప్లాన్స్ కూడా...
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన ప్రీపెయిడ్ ఖాతాదారుల కోసం రూ.101, రూ.169, రూ.189 రేంజ్‌లలో మూడు సరికొత్త ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్రమోషనల్ ఆఫర్స్ 90 రోజుల పాటు అందుబాటులో ఉంటాయి. 90 రోజులు తరువాత అప్పటి పరిస్థితులను బట్టి ప్లాన్‌లలో మార్పుచేర్పులు చేపట్టే అవకాశం ఉంటుంది.
Read More : దూసుకొస్తున్న జియో కేబుల్ టీవీ, ఆఫర్లే ఆఫర్లు..

90 రోజుల పాటు అందుబాటులో ఉంటాయి...
ఈ ప్రమోషనల్ ఆఫర్స్ 90 రోజుల పాటు అందుబాటులో ఉంటాయి. 90 రోజులు తరువాత అప్పటి పరిస్థితులను బట్టి ప్లాన్‌లలో మార్పుచేర్పులు చేపట్టే అవకాశం ఉంటుంది.

రూ.101, రూ.169
రూ.101 ప్లాన్‌ను తీసుకోవటం ద్వారా రూ.101 ప్రైమరీ టాక్ టైమ్ అలానే 7 రోజుల పాటు రోజుకు 500MB డేటా లభిస్తుంది. రూ.169 ప్లాన్‌ను తీసుకోవటం ద్వారా రూ.169 ప్రైమరీ టాక్ టైమ్‌తో పాటు 2జీబి డేటా అందుబాటులో ఉంటుంది. 21 రోజుల పాటు ఈ ప్యాక్ అందుబాటులో ఉంటుంది.

రూ.189 ప్లాన్ తీసుకున్నట్లయితే..
రూ.189 ప్లాన్‌ను ఆప్ట్ చేసుకోవటం ద్వారా రూ.189 మెయిన్ బ్యాలన్స్‌తో పాటు 3జీబి డేటా అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. మే 3 నుంచి ఈ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి.

ప్రయివేటు టెల్కోలకు ధీటుగా..
ప్రయివేటు టెల్కోలకు ధీటుగా బీఎస్ఎన్ఎల్ కొద్ది రోజుల క్రిత మూడు సంచలన ప్లాన్ లను మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. వాటి వివరాలు.. , దిల్ కోల్ కి బోల్ (STV349), ట్రిపుల్ ఏస్ (STV333), నెహెల్ పె దేహ్లా (STV395).

దిల్ కోల్ కి బోల్ రూ.349
దిల్ కోల్ కి బోల్ రూ.349 ప్లాన్ గురించి చర్చించుకున్నట్లయితే, ఈ ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకున్న వారికి 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ అందుబాటులో ఉంటాయి. 2జీబి డేటా కూడా వర్తిస్తుంది.

ట్రిపుల్ ఏస్ రూ.333 ప్లాన్
ట్రిపుల్ ఏస్ రూ.333 ప్లాన్ గురించి చర్చించుకున్నట్లయితే, ఈ ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకున్న వారికి 90 రోజుల పాటు రోజుకు 3జీబి డేటా అందుబాటులో ఉంటుంది.

నెహెల్ పె దేహ్లా రూ.395 ప్లాన్
నెహెల్ పె దేహ్లా రూ.395 ప్లాన్ గురించి చర్చించుకున్నట్లయితే, ఈ ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకున్న వారికి రోజుకు 2జీబి డేటా అందుబాటులో ఉంటుంది. BSNL టు BSNL నెట్‌వర్క్‌ల మధ్య 3000 నిమిషాల పాటు ఉచితంగా మాట్లాడుకోవచ్చు. ఇతర నెట్‌వర్క్‌ల మధ్య 1800 నిమిషాల పాటు ఉచితంగా మాట్లాడుకునే వీలుటుంది ప్లాన్ వ్యాలిడిటీ 71 రోజులు (10 వారాలు). ఉచిత టాక్‌టైమ్ పూర్తి అయిన తరువాత నిమిషానికి 20 పైసలు ఛార్జ్ చేస్తారు.


Click it and Unblock the Notifications