Home
News

BSNL గణతంత్ర దినోత్సవ ఆఫర్.... వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌పై 71 రోజుల అదనపు వాలిడిటి

ఇండియాలో జనవరి 26న జరగబోయే 71 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బిఎస్‌ఎన్‌ఎల్ తన చందాదారులకు గొప్ప ఆఫర్ను అందిస్తున్నది. బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క రూ.1,999 ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటును ఇప్పుడు మరొక 71 రోజుల పాటు పెంచింది. అంటే ఇప్పుడు ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు కాలం 436 రోజులు.

బిఎస్ఎన్ఎల్

బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.1,999 రీఛార్జ్ ప్లాన్ ను జనవరి 26, 2020 మరియు ఫిబ్రవరి 15, 2020 మధ్య రీఛార్జ్ చేసిన వారికి చెల్లుబాటు కాలంను 365 రోజుల నుండి 436 రోజులకు పెంచుతున్నది. అదనపు చెల్లుబాటు ఆఫర్ పరిమిత కాలానికి చెల్లుతుంది అని బిఎస్ఎన్ఎల్ తెలిపింది. ఈ ప్లాన్ అందిస్తున్న ప్రయోజనాల విషయాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

ప్రీపెయిడ్ టారిఫ్

బిఎస్ఎన్ఎల్ 2019 డిసెంబర్‌లో ప్రీపెయిడ్ టారిఫ్ ధరలను పెంచలేదు. ఈ సంస్థ ప్రతిసారీ ఎంపిక చేసిన ప్లాన్లతో అదనపు యాక్సిస్ ను కూడా అందిస్తోంది. ఇది టెల్కో నుండి వస్తున్న మంచి చర్య. ఇది దాని చందాదారుల సంఖ్యను కూడా పెంచుతుంది. బిఎస్‌ఎన్‌ఎల్‌కు ఉన్న ఏకైక ప్రతికూలత 4G సేవలు లేకపోవడం. అయితే మార్చి 2020 చివరి నాటికి 4G ని దేశం అంతటా తీసుకురావాలని భావిస్తున్నారు.

 

 

బిఎస్‌ఎన్‌ఎల్ రూ .1,999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్రయోజనాలు

బిఎస్‌ఎన్‌ఎల్ రూ .1,999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్రయోజనాలు

బిఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న రూ.1,999 ప్రీపెయిడ్ ప్లాన్ సాధారణంగా 365 రోజుల చెల్లుబాటుతో అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తుంది. ఇండియా యొక్క 71 వ గణతంత్ర దినోత్సవం కనుకగా కంపెనీ రూ.1,999 ప్లాన్ యొక్క చెల్లుబాటును మరొక 71 రోజుల పాటు పొడిగించింది. ఈ ఆఫర్ లో భాగంగా ఈ ప్లాన్ 436 రోజుల పాటు యాక్సిస్ ను అందిస్తుంది. ఇది అందిస్తున్న ప్రయోజనాల విషయానికొస్తే వినియోగదారులు ప్రతిరోజూ 250 నిమిషాల వాయిస్ కాలింగ్, 3GB రోజువారీ డేటా మరియు రోజుకు 100 SMSల ప్రయోజనాలు లభిస్తాయి. ఇతర ప్రయోజనాలలో మొత్తం చెల్లుబాటు కాలానికి BSNL TV చందా కూడా లభిస్తుంది.

 

 

అదనపు ప్రయోజనాలు

అదనపు ప్రయోజనాలు

ఈ ఆఫర్ వ్యవధి 2020 జనవరి 26 నుండి 2020 ఫిబ్రవరి 15 వరకు మాత్రమే ఉంటుంది. గత నెలలో బిఎస్ఎన్ఎల్ రూ.1,999 ప్లాన్ 60 రోజుల అదనపు వాలిడిటీని ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ పరిమిత కాల ఆఫర్ లలో భాగంగా అదే ప్లాన్‌ 71 రోజుల అదనపు చెల్లుబాటును అందిస్తున్నది. టెల్కో తన ARPU ని పెంచడానికి మరియు రూ .1,999 ప్లాన్‌తో కొత్త వినియోగదారులను ఆకర్షించాలని చూస్తోంది. BSNL నుండి వస్తున్న ఈ లాంగ్ టర్మ్ రీఛార్జ్ ప్లాన్ ఇప్పటికే ఉన్న మరియు క్రొత్త కస్టమర్లకు అందుబాటులో ఉంది. కొత్త బిఎస్‌ఎన్‌ఎల్ చందాదారులు తమ మొదటి రీఛార్జ్ ఎంపికగా రూ.1,999 ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.

 

 

జియో లాంగ్ టర్మ్ రీఛార్జ్ ప్లాన్

జియో లాంగ్ టర్మ్ రీఛార్జ్ ప్లాన్

బిఎస్‌ఎన్‌ఎల్ మాదిరిగానే రిలయన్స్ జియో ఒక సంవత్సరం ప్రీపెయిడ్ ప్లాన్‌ మీద రూ.2,199 ధర వద్ద అందిస్తున్నది. 2019 చివరిలో జియో యొక్క ఈ ప్లాన్‌ను 2,020 రూపాయలకు ప్రత్యేక ఆఫర్‌గా అందించడం ప్రారంభించింది. ఈ ఆఫర్ ఇప్పటికీ అందుబాటులో ఉంది. రూ.2,020 వద్ద రిలయన్స్ జియో కస్టమర్లకు రోజుకు 1.5 జిబి డేటా, అపరిమిత జియో టు జియో వాయిస్ కాల్స్, 12,000 నిమిషాల నాన్-జియో ఎఫ్‌యుపి నిమిషాలు మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌ల ప్రయోజనాలు 365 రోజుల చెల్లుబాటు కాలానికి లభిస్తాయి.

 

 

 

ఎయిర్‌టెల్ , వొడాఫోన్ లాంగ్ టర్మ్ రీఛార్జ్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ , వొడాఫోన్ లాంగ్ టర్మ్ రీఛార్జ్ ప్లాన్‌లు

మరోవైపు భారతి ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా యొక్క లాంగ్ టర్మ్ రీఛార్జ్ ప్లాన్ల యొక్క ధరలు వరుసగా రూ .2,398 మరియు రూ .2,399. ఈ రెండు ప్లాన్‌లు ప్రతి నెట్‌వర్క్‌కు ఎటువంటి ఎఫ్‌యుపి పరిమితి లేకుండా అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు మరియు రోజుకు 1.5 జిబి డేటాతో 365 రోజులు వస్తాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Rs.1,999 Annual Prepaid Plan Offers Extra 71 days Validity
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X