ఏ కాల్ చేసుకున్నా 25 పైసలే

రిలయన్స్ జియోకు ధీటుగా సంచలన ఆఫర్లతో బీఎస్ఎన్ఎల్ దూసుకొచ్చింది. తాజాగా ఈ ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ అనౌన్స్ చేసిన 'ఫ్రీడం ప్లాన్' టాక్ ఆఫ్ ద టౌన్‌గా నిలిచింది.

Read More : ఒకే రాకెట్‌‌లో 83 శాటిలైట్‌లు, భారత్ సంచలనం!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నిమిషానికి 25 పైసలు మాత్రమే

ఈ ప్లాన్ ధర రూ.136కాగా వ్యాలిడిటీ వచ్చే సరికి 730 రోజులు. బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న ఫ్రీడం ప్లాన్‌లో భాగంగా యూజర్లు అన్ని రకాల లోకల్, ఎస్టీడీ కాల్స్‌ను ఎక్కడి నుంచైనా ఏ నెట్‌‌వర్క్‌కు అయినా మొదటి నెల రోజుల పాటు నిమిషానికి 25 పైసలు మాత్రమే చెల్లించి కాల్స్ చేసుకోవచ్చు.

1జీబి డేటా ఉచితంగా

దీంతో పాటు మొదటి 30 రోజు వ్యవధిలో 1జీబి డేటాను ఉచితంగా పొందే అవకాశముంటుంది. 30 రోజులు పూర్తయిన తరువాత కాల్ ఛార్జీలు సెకను 1.3 పైసలుగా ఉంటాయని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.

మూడు రకాల టాపప్ ప్లాన్స్

బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ ఎంచుకున్న యూజర్లకు రూ.577, రూ.377, రూ.178 ధరల్లో మూడు రకాల టాపప్ ప్లాన్స్ అందుబాటులో ఉంటాయి. వాటి వివరాలను పరిశీలించినట్లయిత..

రూ.577 టాపప్ ప్లాన్‌

రూ.577 టాపప్ ప్లాన్‌ను ఎంపిక చేసుకన్న యూజర్‌కు పూర్తి టాక్ టైమ్ తో పాటు 1జీబి డేటా (30 రోజుల వ్యాలిడిటీతో) లభిస్తుంది.

రూ.377 టాపప్ ప్లాన్‌

రూ.377 టాపప్ ప్లాన్‌ను ఎంపిక చేసుకన్న యూజర్‌కు పూర్తి టాక్‌టైమ్‌తో పాటు 300ఎంబి డేటా (20 రోజుల వ్యాలిడిటీతో) లభిస్తుంది.

రూ.178 టాపప్ ప్లాన్‌

రూ.178 టాపప్ ప్లాన్‌ను ఎంపిక చేసుకన్న యూజర్‌కు పూర్తి టాక్‌టైమ్‌తో పాటు 200ఎంబి డేటా (10 రోజుల వ్యాలిడిటీతో) లభిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BSNL Rs 136 'Freedom Plan' offers full talktime for 730 days. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting