జియో కంటే మెరుగైన ప్లాన్‌తో దూసుకొచ్చిన బిఎస్ఎన్ఎల్
దేశీయ టెలికాం రంగంలో దూసకుపోతున్న BSNL జియోకి అసలైన సవాల్ విసిరేందుకు రెడీ అయింది.
దేశీయ టెలికాం రంగంలో దూసకుపోతున్న BSNL జియోకి అసలైన సవాల్ విసిరేందుకు రెడీ అయింది.టెలికాం రంగంలో దూసుకుపోతున్నReliance Jio, Airtelలను ఢీకొడుతూ ముందుకువెళ్లేందుకుఈ ప్రభుత్వ రంగ దిగ్గజం గత కొద్ది నెలల నుంచి ప్రయత్నిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే ఇప్పుడు 30 రోజుల ప్లాన్ తో వినియోగదారులను అలరించేందుకు రెడీ అయింది. ప్లాన్ పూర్తి వివరాలతో పాటు ఇతర దిగ్గజ కంపెనీల ప్లాన్ల వివరాలు ఓ సారి పరిశీలిస్తే..

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.171 ప్లాన్
ఇందులో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తున్నారు. అన్‌లిమిటెడ్ కాల్స్ కూడా లభిస్తాయి. ఇక ఈ ప్లాన్ వాలిడిటీని 30 రోజులుగా నిర్ణయించారు.

జియోలో రూ.198 ప్లాన్
రూ.198 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. ప్లాన్ వాలిడిటీ Bsnl కన్నా కొన్ని రోజులు తక్కువగా ఉంది.

Airtel రూ.249 ప్లాన్
రూ.249 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. ప్లాన్ వాలిడిటీ Bsnl కన్నా కొన్ని రోజులు తక్కువగా ఉంది.

రూ.27 కే ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్
ఇదిలా ఉంటే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ రూ.27 కే ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు 1జీబీ డేటా, 300 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఇక ఈ ప్లాన్ వాలిడిటీని 7 రోజులుగా నిర్ణయించారు.

జియోలో ఇదే తరహా ప్లాన్ రూ.52
జియోలో ఇదే తరహా ప్లాన్ రూ.52లకు లభిస్తుండగా అందులో 7 రోజుల వాలిడిటీతో 1.05 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 70 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. అలాగే జియోలో రూ.49 ప్లాన్‌లో 1 జీబీ డేటా, 50 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిడెట్ కాల్స్ వస్తాయి.

ఎయిర్‌టెల్‌లో రూ.47 ప్లాన్
ఇక ఎయిర్‌టెల్‌లో రూ.47 ప్లాన్‌లో 150 నిమిషాల లోకల్, ఎస్‌టీడీ కాల్స్, 50 ఎస్‌ఎంఎస్‌లు, 500 ఎంబీ డేటా లభిస్తాయి. జియో, ఎయిర్‌టెల్‌లలో ఉన్న ప్లాన్లకు పోటీగా బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.


Click it and Unblock the Notifications








