Home
News

BSNL రూ.18 వోచర్ ఆఫర్‌లో కొత్త మార్పులు ఇవే!! ఓ లుక్ వేయండి...

ఇండియాలో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఏకైక టెల్కో బిఎస్ఎన్ఎల్ వినియోగదారులను పెంచుకోవడానికి తన యొక్క ప్లాన్లను సవరించడం ప్రారంభించింది. ఇందులో భాగంగా రూ.18 ధర వద్ద లభించే వోచర్ ఆఫర్‌ను కూడా సవరించింది. తక్కువ ధరలో అత్యంత ప్రజాదరణ పొందిన రూ.18 వోచర్ ఇప్పుడు 1GB డైలీ FUP డేటాను అందిస్తున్నది. అంటే బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.18 వోచర్‌ ప్రయోజనాలలో డేటా ఆఫర్‌ను గణనీయంగా తగ్గించింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL రూ.18 వోచర్ ఆఫర్‌ల మార్పులు

BSNL రూ.18 వోచర్ ఆఫర్‌ల మార్పులు

బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.18 వోచర్ ప్రయోజనాల కొత్త మార్పుల విషయానికి వస్తే ఈ వోచర్ ఇంతకు ముందు రెండు రోజుల వాలిడిటీతో అపరిమిత వాయిస్ కాలింగ్, అపరిమిత వీడియో కాలింగ్ మరియు రోజుకు 1.8GB డేటాను అందించేది. FUP డేటా తరువాత స్పీడ్ 80 Kbps కి తగ్గించబడుతుంది. అయితే ఇప్పుడు అందుకున్న కొత్త మార్పుల తరువాత ఇందులో అపరిమిత వీడియో కాలింగ్ మరియు వాయిస్ కాలింగ్ లభించినప్పటికీ రోజువారి డేటాను 1GB కి తగ్గించబడింది. వినియోగదారులు రోజుకు 100 SMS ప్రయోజనాన్ని అలాగే పొందుతారు. ఈ వోచర్ యొక్క చెల్లుబాటు 2 రోజులు అదే విధంగా ఉంటుంది.

BSNL రూ.18 వోచర్ ను యాక్టివేట్ చేయడం ఎలా?

BSNL రూ.18 వోచర్ ను యాక్టివేట్ చేయడం ఎలా?

బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.18 వోచర్‌ను రీఛార్జ్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మొదటిది ఆన్‌లైన్‌లో చేయడం. టెల్కో యొక్క వెబ్‌సైట్‌కు వెళ్లడం ద్వారా లేదా Paytm, PhonePe, Google Pay మరియు మరెన్నో రీఛార్జ్ యాప్ ల ద్వారా చాలా సులభంగా మరియు సౌకర్యవంతంగా రీఛార్జ్ చేసుకోవచ్చు. 'STV COMBO18' అని టైప్ చేసి 123 కి SMS పంపడం లేదా USSD కోడ్ ‘* 444 * 18 #' ఉపయోగించడం ద్వారా కూడా దీనిని రీఛార్జ్ చేయవచ్చు.

BSNL సినిమా ప్లస్ ఎంటర్టైన్మెంట్ ప్యాక్

BSNL సినిమా ప్లస్ ఎంటర్టైన్మెంట్ ప్యాక్

బిఎస్‌ఎన్‌ఎల్ సినిమా ప్లస్ ప్రస్తుతం ‘ఎంటర్టైన్మెంట్ ప్యాక్ ' అనే పేరుతో అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ యుప్ టివి స్కోప్ ఎంటర్టైన్మెంట్ ప్యాక్ గా కూడా లభిస్తుంది. ఇది రూ.129 ధర వద్ద లభిస్తూ యుప్ టివి, Zee5, సోనీలైవ్ మరియు వూట్ వంటి నాలుగు OTT చందాలను కలుపుతూ లభిస్తుంది. యుప్ టివి స్కోప్ / బిఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ అనేది ఒకేచోట OTT సభ్యత్వాలను కలుపుతుంది. సాధారణంగా రూ.199 ధర వద్ద లభించే అన్ని రకాల ప్రయోజనాలను యూజర్లు ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా రూ.129 ధర వద్ద పొందవచ్చు.

BSNL OTT యాడ్-ఆన్ ప్యాక్

BSNL OTT యాడ్-ఆన్ ప్యాక్

బిఎస్ఎన్ఎల్ సంస్థ ఇప్పుడు రెండు వేర్వేరు ధరల వద్ద ఒకే ఒక OTT యాడ్-ఆన్ ప్యాక్‌ను అందిస్తోంది. మొదటి మూడు నెలలు ఈ ప్యాక్ ను వినియోగదారులు నెలకు రూ.129 ధర వద్ద పొందుతారు. మొదటి మూడు నెలల తరువాత ఈ ప్లాన్ యొక్క ధర నెలకు రూ.199 కు పెరుగుతుంది. ఈ యాడ్-ఆన్ ప్యాక్ వినియోగదారులకు వూట్ సెలెక్ట్, సోనీలైవ్ స్పెషల్, Zee5 ప్రీమియం, YuppTV టివి లైవ్, YuppTV FDFS, YuppTV మూవీస్, సపోర్ట్ మరియు మార్కెటింగ్ కంటెంట్ వంటి OTT యాప్ లు ఉన్నాయి. పైన పేర్కొన్న ఛార్జీలలో సేవల పన్ను (GST) ఉండదని గమనించండి.

Best Mobiles in India

English summary
BSNL Rs 18 Voucher New Changes: Offers 1GB Daily Data, Unlimited Calling and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X