Home
News

ఐపీఎల్ ఆఫర్లతో దూసుకువచ్చిన బిఎస్ఎన్ఎల్,కొత్త ప్లాన్లు రెడీ

ఐపీఎల్ లీగ్ క్రికెట్ క్రికెట్ ప్రేమికులని తెగ ఉత్సాహపరుస్తోంది. వారి ఉత్సాహాన్ని క్యాష్ చేసుకునేందుకు పలు టెలికం సంస్థలు స్పెషల్ ఆఫర్స్ ప్రకటిస్తూ వినియోగదారులకు చేరువ కావాలని చూస్తున్నాయి. ఇందులో భాగ

ఐపీఎల్ లీగ్ క్రికెట్ క్రికెట్ ప్రేమికులని తెగ ఉత్సాహపరుస్తోంది. వారి ఉత్సాహాన్ని క్యాష్ చేసుకునేందుకు పలు టెలికం సంస్థలు స్పెషల్ ఆఫర్స్ ప్రకటిస్తూ వినియోగదారులకు చేరువ కావాలని చూస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఐపీఎల్ టీ -20 సందర్భంగా స్పెషల్ ఆఫర్స్‌ని ప్రకటించింది.

ఐపీఎల్ ఆఫర్లతో దూసుకువచ్చిన బిఎస్ఎన్ఎల్,కొత్త ప్లాన్లు రెడీ

తెలంగాణ, ఏపీలోని ప్రీపెయిడ్ మొబైల్ వినియోదారుల కోసం ఎస్టీవీ 199, ఎస్టీవీ 499 ఆఫర్లను తీసుకొచ్చింది.

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)

ఎస్టీవీ 199తో వినియోగదారులు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్(లోకల్, ఎస్టీడీ), రోజుకు 1జీబీ డేటా, క్రికెట్ ఎస్‌ఎంఎస్ అలర్ట్స్, ప్రీ అన్‌‌లిమిటెడ్ సాంగ్ ఛేంజ్‌ని 28 రోజుల కాలపరిమితో పొందవచ్చు.

ఎస్టీవీ-499 రీచార్జ్ చేసుకున్న వినియోగదారులకు 90 రోజుల కాలపరిమితితో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ (లోకల్, ఎస్టీడీ), రోజూ 1జీబీ డేటా, క్రికెట్ ఎస్‌ఎంస్ అలర్ట్స్, ఫ్రీ అన్‌లిమిటెడ్ సాంగ్ ఛేంజ్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చు. పూర్తి వివరాలకు 1503 లేదా 18001801503 నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు.

 

జియో అందిస్తున్న ఆఫర్లు

జియో అందిస్తున్న ఆఫర్లు

జియో కూడా రూ.197తో ఐపీఎల్ ప్లాన్‌‌ను ప్రవేశపెట్టింది. 28 రోజుల కాలపరిమితి ఉన్న ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2 బీజీ డేటాను అందించనుంది. దీనిద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఫ్రీ రోమింగ్, ఉచిత ఎస్‌ఎంఎస్‌లను అందిస్తున్నారు. హాట్‌స్టార్‌ను కూడా ఉచింతంగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక రూ.299తో రిచార్జ్ చేసుకున్నవారికి 28 రోజుల కాలపరిమితితో రోజుకు 3 జీబీ డేటాను జియో అందిస్తోంది.

ఎయిర్ టెల్ ప్లాన్లు

ఎయిర్ టెల్ ప్లాన్లు

రూ.249 ప్లానులో 28 రోజుల కాలపరిమితితో రోజుకు 2 జీబీ డేటా అందిస్తున్నారు. అలాగే 82 రోజుల కాలపరిమితితో రోజుకు 1.5 జీబీ డేటా ఇస్తున్నారు. ఈ రెండు ప్లాన్లలోనూ అన్‌లిమిటెడ్ కాల్స్, 100 మెసేజ్‌లు, ఎయిర్‌టెల్ టీవీ యాక్సెస్ అందిస్తున్నారు.

వొడాఫోన్-ఐడియా ఐపీఎల్ ఆఫర్లు

వొడాఫోన్-ఐడియా ఐపీఎల్ ఆఫర్లు

వొడాఫోన్ కూడా 84 రోజుల కాలపరిమితితో రూ.511 ప్లానులో రోజుకు 2 జీబీ డేటాను అందిస్తోంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఈ ప్లాన్ ద్వారా పొందుతారు. లైవ్ టీవీ యాక్సెస్‌ను కూడా వొడాఫోన్ అందిస్తోంది.

Best Mobiles in India

English summary
BSNL intros Rs. 199 and Rs. 499 prepaid plans for IPL season
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X