BSNL నుంచి రెండు స‌రికొత్త మంత్లీ ప్రీపెయిడ్ ప్లాన్లు విడుద‌ల‌!

|

భార‌త‌ టెలికాం రంగంలో గల ఏకైక ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) వినియోగదారులను ఆకట్టుకోవడానికి గొప్ప గొప్ప ప్లాన్‌లను అందిస్తూనే ఉంది. తాజాగా BSNL మ‌రికొన్ని కొత్త ప్రీపెయిడ్ నెల‌వారీ ప్లాన్‌ల‌ను యూజ‌ర్ల‌కు ప‌రిచ‌యం చేసింది. ప్రీపెయిడ్ ప్లాన్లు రూ.228, రూ.239 ల‌ను అందుబాటులోకి తీసుకు వ‌చ్చింది. ఈ ప్లాన్లు జులై 1వ తేదీ నుంచి యూజ‌ర్ల‌కు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్లాన్లు ఒక నెల వ్యాలిడిటీని క‌లిగి ఉండ‌నున్నాయి. నెల త‌ర్వాత మ‌ళ్లీ అదే మొత్తంలో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

BSNL monthly plans

BSNL Rs. 228 ప్రీపెయిడ్ ప్లాన్:
ఈ BSNL STV 228 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవ‌డం ద్వారా యూజ‌ర్ల‌కు ప‌లు ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌక‌ర్యాన్ని పొంద‌వ‌చ్చు. అంతేకాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 2 జీబీ డేటా సౌక‌ర్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. డైలీ డేటా లిమిట్ అయిన త‌ర్వాత నెట్ స్పీడ్ 80 కేబీపీఎస్‌కు ప‌డిపోతుంది. ఈ ప్రయోజనాలతో పాటు, BSNL ప్రీపెయిడ్ ప్లాన్ ఈ ప్లాన్‌ని ఎంచుకున్న సబ్‌స్క్రైబర్‌ల కోసం ప్రోగ్రెసివ్ వెబ్ యాప్‌లో ఛాలెంజెస్ అరేనా మొబైల్ గేమింగ్ సర్వీస్‌ను కూడా ఆఫ‌ర్‌ చేస్తుంది.

BSNL monthly plans

BSNL Rs. 239 ప్రీపెయిడ్ ప్లాన్:
ఈ BSNL STV 239 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవ‌డం ద్వారా యూజ‌ర్ల‌కు ప‌లు ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌక‌ర్యాన్ని పొంద‌వ‌చ్చు. అంతేకాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 2 జీబీ డేటా సౌక‌ర్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. రూ.10 టాక్‌టైమ్ పొంద‌వ‌చ్చు. ఈ టాక్‌టైమ్ వాల్యూ మెయిన్ అకౌంట్‌కు యాడ్ చేసే సౌక‌ర్యాన్ని క‌ల్పించారు.

ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ వ్యాలిడిటీ ఒక నెల ఉంటుంది. ప్లాన్ గ‌డువు ముగిసిన త‌ర్వాత అదే రోజున సేమ్ అమౌంట్ చెల్లించి మ‌ళ్లీ రీఛార్జ్ చేసుకోవ‌చ్చు. యూజ‌ర్ల‌కు 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ల‌తో పాటుగా, నెల రోజుల గ‌డువు ఉండే వ్యాలిడిటీ ప్లాన్ల‌ను అందించాల‌ని ఇటీవ‌ల ట్రాయ్ నెట్‌వ‌ర్క్ కంపెనీల‌కు ఆదేశాలు జారీ చేసిన నేప‌థ్యంలో BSNL ఈ ప్లాన్ల‌ను విడుద‌ల చేయ‌డం విశేషం. అయితే BSNL తాజాగా విడుద‌ల చేసిన ప్లాన్లు, ఇప్ప‌టికే Airtel, Vi నుంచి విడుద‌లైన ఇదే త‌ర‌హా ప్లాన్ల‌కు పోటీ ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ BSNL తాజా ప్లాన్లు జులై 1 నుంచి అమ‌ల్లోకి రానున్నాయి.

BSNL monthly plans

కాగా, ఇప్ప‌టికే BSNL 90 రోజుల వ్యాలిడిటీతో అప‌రిమిత కాలింగ్, పరిమిత డేటాను క‌ల్పిస్తూ రెండు ప్లాన్ల‌ను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. వాటిపైనా ఓ లుక్కేద్దాం ప‌దండి.

BSNL రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్:
BSNL వినియోగదారులు 90 రోజుల వ్యాలిడిటీతో రూ.500 లోపు పొందగలిగే మొదటి ప్లాన్ రూ.499 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ ప్లాన్. దీనితో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్, 2GB రోజువారీ డేటా మరియు రోజుకి 100 SMS ప్రయోజనాలను పొందుతారు. ఇది BSNL ట్యూన్స్‌తో కూడిన జింగ్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా అందిస్తుంది.

BSNL monthly plans

BSNL రూ.485 ప్రీపెయిడ్ ప్లాన్ :
90 రోజుల వ్యాలిడిటీతో లభించే రెండవ ప్లాన్ రూ.485 ధర వద్ద లభిస్తుంది. దీనితో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్‌, 1.5GB రోజువారీ డేటా మరియు 100 SMS/రోజుకు ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్లాన్ 90 రోజుల వాలిడిటీతో వస్తుంది. మీరు BSNL యొక్క నెట్‌వర్క్ కవరేజ్ అద్భుతంగా లభించే ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే ఈ రెండు ప్లాన్లు అద్భుతమైన ఎంపికలు అని చెప్పవచ్చు. లేకపోతే ప్లాన్‌లు సరసమైనవి అయినప్పటికీ సరైన నెట్‌వర్క్ సర్వీస్ లేకపోతే అవి మీకు పనికిరావు. BSNL ప్రస్తుతం 4Gని అందుబాటులోకి తీసుకురావడానికి పని చేస్తోంది. ఈ సంవత్సరం చివరి నాటికి ఇది విస్తృత స్థాయిలో దేశం మొత్తం మీద అందుబాటులోకి రానున్నది. అందువలన ఈ ప్లాన్‌ల ప్రయోజనం ఆకాశాన్ని తాకుతుంది. BSNL అందించే ఆఫర్‌లతో ప్రైవేట్ టెల్కోలు కొంత తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాయి.

Best Mobiles in India

English summary
BSNL Rs. 228, Rs. 239 Monthly Recharge Plans Launched

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X