Home
News

90 రోజుల అదనపు వ్యాలిడిటీతో BSNL లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్!! కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్...

ఇండియాలోని టెలికాం రంగంలో ప్రభుత్వం అద్వర్యంలో BSNL మాత్రమే పనిచేస్తోంది. ప్రైవేట్ టెల్కోలు అన్ని ఇటీవల ధరల పెంపును ప్రకటించి యూజర్లకు షాక్ ఇచ్చాయి. అయితే చాలా మంది రెండు సిమ్ లను వాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు రెండిటికి రీఛార్జ్ చేయడం అంటే అధికంగా ఖర్చు అవుతుంది. అలాగే ఇంటిలోని ప్రతి ఒక్కరికి అధిక ధరలతో రీఛార్జ్ చేయడం కూడా కొద్దిగా రిస్క్ తో కూడిన పని. డేటా అవసరం అధికంగా ఉన్న వారు అధిక ధరల వద్ద లభించే ప్లాన్ తో రీఛార్జ్ చేసుకొని కేవలం వాయిస్ కాల్స్ కోసం మాత్రమే సిమ్ ఉపయోగించే వారికి BSNL యొక్క ఆఫర్లు ఇతరుల కంటే మెరుగ్గా ఉన్నాయి. BSNL 4G నెట్వర్క్ దేశం అంతటా లేకపోయినప్పటికీ వాయిస్ కాల్స్ కోసం ఎటువంటి ఇబ్బంది లేకుండా మెరుగైన నెట్వర్క్ ను కలిగి ఉంది.

BSNL

2022 ప్రారంభంలో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారుల కోసం కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఇది పరిమిత కాల ఆఫర్ మాత్రమే కావున ఇది జనవరి 15, 2022 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ లో భాగంగా వినియోగదారులకు ఎంచుకున్న ప్రీపెయిడ్ ప్లాన్‌తో అదనంగా 90 రోజుల చెల్లుబాటులో బండిల్ చేయబడుతుంది. ఈ ఆఫర్ విభాగంలో లభించే ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL 90 రోజుల అదనపు వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్

BSNL 90 రోజుల అదనపు వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) టెల్కో రూ.2399 ధర వద్ద అందించే లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు 90 రోజుల అదనపు వాలిడిటీని అందిస్తోంది. ఈ ప్లాన్ వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్, 100 SMS/రోజు మరియు 3GB రోజువారీ డేటా వంటి ప్రయోజనాలతో అందిస్తుంది. సాధారణంగా ఈ ప్లాన్ 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. కానీ ప్రస్తుత ఆఫర్ విభాగంలో వినియోగదారులు ఈ ప్లాన్‌తో 90 రోజుల అదనపు వాలిడిటీని కూడా పొందుతారు. మొత్తంగా దీని యొక్క సర్వీస్ వాలిడిటీని 455 రోజులుగా ఉంది. నెలల విభాగంలో చూస్తే ఇది దాదాపు 15 నెలలుగా ఉంటుంది.

ప్రీపెయిడ్ ప్లాన్

BSNL యొక్క రూ.2399 ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క గొప్పదనం ఏమిటంటే మీరు డేటా గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. ఇది 3GB రోజువారీ డేటాతో వస్తుంది. దేశంలో 4G నెట్‌వర్క్‌లు లేనప్పటికీ ఇది కంపెనీ నుండి లభించే పెద్ద సర్వీస్ చెల్లుబాటుతో లభించే బలవంతపు ఆఫర్ కూడా అవుతుంది. BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌లు ప్రస్తుతం దేశంలో అత్యంత సరసమైనవి మరియు ఇలాంటి ఆఫర్‌లతో మరింత ఆకర్షణీయంగా మారాయని గమనించండి. ప్రభుత్వ ఆధీనంలోని టెల్కో కూడా తన ఇంట్లో తయారు చేసిన 4G నెట్‌వర్క్‌లను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు పని చేస్తోంది.

BSNL

BSNL నుండి మీరు అధిక చెల్లుబాటుతో మరియు చాలా సరసమైన ధరలో లభించే ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే మీరు ఎంచుకోగలగడానికి రూ.1499 ప్లాన్ కూడా ఉంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు మొత్తం వాలిడిటీలో 24GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 100 SMS/రోజు ప్రయోజనాలను పొందుతారు. BSNL యొక్క రూ.1499 ప్లాన్ మొత్తం 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.

Best Mobiles in India

English summary
BSNL Rs.2399 Long Term Prepaid Plan Offers 90 Days Additional Validity
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X