బీఎస్‌ఎన్‌ఎల్‌ చోటా రీఛార్జ్ ,రూ.29కే అపరిమిత కాల్స్

దేశీయ రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియోకు పోటీగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది

By Anil
|

దేశీయ రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియోకు పోటీగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది.ఈ ఆఫర్లో భాగంగా రూ.29కే అపరిమిత కాలింగ్‌ మరియు 2 జీబీ ఉచిత డేటా ఆఫర్‌ను అందించనున్నట్టు తెలిపింది. ఈ కొత్త ఆఫర్‌ కింద అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌తో పాటు నేషనల్‌ రోమింగ్‌ను తన ప్రీపెయిడ్‌ కస్టమర్లకు అందించనున్నట్టు పేర్కొంది. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ 7 రోజులు మాత్రమే.ఈ రూ.29 ప్లాన్ తో పాటు రూ.9 ప్లాన్ కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు అందుబాటులో ఉంటుంది.

రూ.29 రీఛార్జ్‌ ప్లాన్‌

రూ.29 రీఛార్జ్‌ ప్లాన్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ తీసుకొచ్చిన ఈ రూ.29 రీఛార్జ్‌ ప్లాన్‌ అన్ని ప్రాంతాలకు లభ్యమవుతోంది. అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, 2 జీబీ ఉచిత డేటా తో 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, ఉచితంగా పర్సనలైజ్డ్‌ రింగ్‌బ్యాక్‌ టూన్లను ఆఫర్‌ చేయనుంది. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ 7 రోజులు మాత్రమే.

రూ.9 రీఛార్జ్‌ ప్లాన్‌

రూ.9 రీఛార్జ్‌ ప్లాన్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ తీసుకొచ్చిన ఈ రూ.9 రీఛార్జ్‌ ప్లాన్‌ కూడా ఢిల్లీ, ముంబై మినహా మిగతా అన్ని ప్రాంతాలకు లభ్యమవుతోంది. అపరిమిత వాయిస్‌ కాలింగ్‌తో పాటు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, ఉచితంగా పర్సనలైజ్డ్‌ రింగ్‌బ్యాక్‌ టూన్లను ఆఫర్‌ చేయనుంది. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ 1 రోజు మాత్రమే.

జియో vs బీఎస్‌ఎన్‌ఎల్‌

జియో vs బీఎస్‌ఎన్‌ఎల్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.29 ప్లాన్ తో జియో యొక్క రూ.52 ప్లాన్ పోటీపడుతుంది .కాగా జియో రూ.52 ప్లాన్ తో యూజర్ కు 1.5 జీబీ 4g డేటా , అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వీటితో పాటు 70 ఎస్ఎమ్ఎస్ లు ఉచితంగా లభిస్తాయి . ఈ ప్లాన్‌ వాలిడిటీ కూడా 7 రోజులు మాత్రమే.మరో బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.9 ప్లాన్ తో జియో యొక్క రూ.19 ప్లాన్ పోటీపడుతుంది ఈ ప్లాన్ లో యూజర్ కు 150 MB 4g డేటా , అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి . ఈ ప్లాన్‌ వాలిడిటీ కూడా 1 రోజు మాత్రమే

బీఎస్‌ఎన్‌ఎల్‌  రూ.29 ప్లాన్ తో మ్యాచ్ అయ్యే ఇతర టెలికాం కంపెనీ ప్లాన్స్

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.29 ప్లాన్ తో మ్యాచ్ అయ్యే ఇతర టెలికాం కంపెనీ ప్లాన్స్

ఎయిర్టెల్ రూ. 47 ప్లాన్ ఇందులో యూజర్ 150 నిమిషాల లోకల్,STD,రోమింగ్ కాల్స్ లభిస్తాయి. దీనితో పాటు 500 MB 3/4g డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 27 రోజులు మాత్రమే.వోడాఫోన్ రూ. 47 ప్లాన్ ఇందులో యూజర్ 125 నిమిషాల లోకల్,STD,రోమింగ్ కాల్స్ లభిస్తాయి. దీనితో పాటు 500 MB 3/4g డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 27 రోజులు మాత్రమే

Best Mobiles in India

English summary
BSNL Rs. 29, Rs. 9 Recharges With Unlimited Calls, Data Launched Ahead of Independence Day.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X