వన్ మంత్ వాలిడిటీతో రోజుకి 3GB డేటాతో BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌!!

|

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ప్రభుత్వ టెలికాం సంస్థ ఇప్పుడు తన యొక్క వినియోగదారులకు 3GB రోజువారీ డేటాతో ఒక నెల మొత్తం వాలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. 4G నెట్‌వర్క్ త్వరలోనే అందుబాటులోకి రానున్నది. కావున హై-స్పీడ్ డేటా అయిపోతుందనే ఆందోళన చెందకుండా ప్రతిరోజూ అధిక మొత్తంలో డేటాను వినియోగించే వినియోగదారులకు ఇది మంచి ఎంపిక. ఇప్పటికి ఇంటి వద్ద నుండి పని చేస్తున్న (WFH) వారికి ఉపయోగకరంగా ఉంటుంది. 4G నెట్‌వర్క్ కొన్ని నెలల వ్యవధిలో అందుబాటులోకి వచ్చినప్పుడు ఇటువంటి ఛాన్స్ లభిస్తుందో లేదో తెలియదు కావున ముందుగా పొందడం తప్పు కాదు. అధిక మొత్తంలో డేటాను వినియోగించే వినియోగదారుల కోసం 3GB రోజువారీ డేటాతో లభించే ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

ఒక నెల వాలిడిటీతో 3GB/రోజుకి డేటాతో BSNL ప్రీపెయిడ్ ప్లాన్

ఒక నెల వాలిడిటీతో 3GB/రోజుకి డేటాతో BSNL ప్రీపెయిడ్ ప్లాన్

BSNL టెల్కో ఒక నెల పూర్తి వాలిడిటీతో అందించే ప్రీపెయిడ్ ప్లాన్ రూ.299 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ 30 రోజుల చెల్లుబాటుతో స్వల్పకాలిక ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంద. దీనితో వినియోగదారులు 3GB రోజువారీ డేటాను పొందుతారు. అంటే వినియోగదారులు మొత్తం చెల్లుబాటు కాలంలో 90GB హై-స్పీడ్ డేటాను పొందుతారు. FUP డేటా వినియోగించబడిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 80 Kbpsకి తగ్గించబడుతుంది. డేటా ప్రయోజనంతో పాటు వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను కూడా పొందుతారు. ప్రైవేట్ టెల్కోలు అదే ధర వద్ద అందిస్తున్న ప్లాన్ లతో పోలిస్తే ఇది అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్.

అమెజాన్ మాంసూన్ కార్నివాల్ సేల్స్ లో ఈ ఫోన్‌లపై 40% వరకు భారీ డిస్కౌంట్అమెజాన్ మాంసూన్ కార్నివాల్ సేల్స్ లో ఈ ఫోన్‌లపై 40% వరకు భారీ డిస్కౌంట్

BSNL STV_399 ప్రీపెయిడ్ ప్లాన్‌
 

BSNL STV_399 ప్రీపెయిడ్ ప్లాన్‌

BSNL టెల్కో రూ.500 ధరలోపు అందించే జాబితాలోని మొదటి ప్లాన్ STV_399. ఇది 80 రోజుల చెల్లుబాటు కాలానికి అపరిమిత వాయిస్ కాల్‌లతో పాటు రోజుకు 1GB డేటాను మరియు 100 SMS/రోజుకు ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ అదనంగా BSNL ట్యూన్‌లు మరియు లోక్‌ధున్ కంటెంట్‌కు కూడా ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. జాబితాలోని తదుపరి STV_429 ప్లాన్ కొంచెం మెరుగైన ప్రయోజనాలతో లభిస్తుంది. ఇది రోజుకు 81 రోజుల చెల్లుబాటుతో రోజుకు 1GB డేటా, అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. అదనపు ప్రయోజనాలలో ఇది Eros Now ఎంటర్‌టైన్‌మెంట్ సేవలకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది.

BSNL 5G కోసం స్పెక్ట్రమ్‌లో భారీ కేటాయంపు?? 2023 లో అందుబాటులోకి...BSNL 5G కోసం స్పెక్ట్రమ్‌లో భారీ కేటాయంపు?? 2023 లో అందుబాటులోకి...

భారతీ ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా వన్ మంత్ వాలిడిటీ ప్లాన్లు

భారతీ ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా వన్ మంత్ వాలిడిటీ ప్లాన్లు

వోడాఫోన్ ఐడియా (Vi) మరియు భారతి ఎయిర్‌టెల్ టెలికాం సంస్థలు రూ.299 ధర వద్ద అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌లతో 1.5GB రోజువారీ డేటాను మాత్రమే అందిస్తున్నాయి. ఇది BSNL వినియోగదారులకు అందించే దానిలో సగం మాత్రమే. అంతేకాకుండా ప్రైవేట్ టెల్కోలు రూ.299 ధరల వద్ద అందించే ప్లాన్లు 28 రోజుల చెల్లుబాటుతో మాత్రమే లభిస్తాయి. BSNL అందించని ఇతర అదనపు ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఇది ఇప్పటికీ ప్రైవేట్ టెల్కోలు అందించే దాని కంటే BSNL యొక్క రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్‌ను మెరుగ్గా ఉంచుతుంది.

Best Mobiles in India

English summary
BSNL Rs.299 Prepaid Plan Comes With 3GB Daily Data For One Full Month Validity

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X