BSNL రూ.397 ప్లాన్‌తో యూజర్లు 600GB డేటాను 300 రోజుల వాలిడిటీతో పొందవచ్చు!!
ఇండియాలోని ప్రైవేట్ టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్-ఐడియా(Vi) వంటివి ఇటీవల తమ ప్రీపెయిడ్ ప్లాన్‌లను చాలా ఖరీదైనవిగా మార్చాయి. అయితే మరోవైపు ప్రభుత్వ యాజమాన్యంలోని BSNL ఇప్పటికీ అత్యుత్తమ డేటా మరియు ఉచిత కాలింగ్‌తో అద్భుతమైన ప్లాన్‌లను అందిస్తోంది. అదనంగా ఈ ప్లాన్‌లు తక్కువ ధరలో అత్యధిక వాలిడిటీతో వస్తాయి. ఇంటిలో అధిక మంది ఉన్నపుడు డేటాతో అవసరం లేకుండా కేవలం ఫోన్ కాల్ కోసం ఉపయోగిస్తున్న వారికి BSNL యొక్క సిమ్ ఉపయోగకరంగా ఉంటుంది. BSNL నుండి ఎక్కువ రోజుల వాలిడిటీ ఉన్న ఉత్తమ ప్లాన్‌లలో ఒకటి రూ.397 ధర వద్ద లభించే ప్లాన్. ఈ ప్లాన్ ఉచిత SMS, అపరిమిత కాలింగ్ మరియు అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఇదే ధర విభాగంలో ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఏవి కూడా అధిక వాలిడితో లభించవు. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL రూ.397 ప్లాన్
రూ.397 ధర వద్ద లభించే BSNL యొక్క ఈ ప్లాన్ 2GB రోజువారీ డేటా ప్రయోజనంతో వస్తుంది. అంతేకాకుండా అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్, 100 SMS మరియు PRBT సౌకర్యం ప్రయోజనాలను ఇవ్వబడుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో అందుబాటులో ఉన్న సేవలను 60 రోజులు మాత్రమే ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ వినియోగదారులు 300 రోజుల వరకు కాల పరిమితిని పొందుతారు. రోజువారీ డేటాను ఉపయోగించిన తర్వాత డేటా స్పీడ్ 80kbpsకి తగ్గించబడుతుంది. అదనంగా మీరు లోక్‌ధున్ కంటెంట్‌కి కూడా యాక్సెస్ పొందుతారు. అలాగే రూ.97 ధర వద్ద లభించే డేటా వోచర్ అపరిమిత కాల్స్ మరియు 2GB రోజువారీ డేటాను అందిస్తుంది. 2GB డేటా వినియోగం తర్వాత వేగం 80 Kbpsకి తగ్గించబడుతుంది.

ఎయిర్‌టెల్ రూ. 449 ప్లాన్
ఎయిర్‌టెల్ టెల్కో రూ.449 ధర వద్ద అందించే ప్లాన్ వినియోగదారులకు 28 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. ఇది వినియోగదారులకు ప్రతిరోజూ 2.5 GB డేటాను అందిస్తుంది. అంతేకాకుండా ప్రతిరోజూ 100 ఉచిత SMSలు మరియు అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. SMS పరిమితి ముగిసిన తర్వాత ప్రతి స్థానిక SMSకి ఒక రూపాయి మరియు STD SMS కోసం రూ. 1.5 చెల్లించాలి. అలాగే రూ. 99 వద్ద ఎయిర్‌టెల్ యొక్క ఎంట్రీ-లెవల్ ప్లాన్ పరిగణించవలసిన మరొక తక్కువ-టారిఫ్ ప్రీపెయిడ్ ప్లాన్. టెలికాం సర్వీస్ ప్రొవైడర్ 200 MB డేటాను, రూ. 99 విలువైన టాక్ టైమ్, సెకనుకు ఒక పైసాతో టారిఫ్ కాల్స్ మరియు లోకల్ SMS కోసం రూ. 1 మరియు STD SMS కోసం రూ. 1.50కి టెక్స్ట్ సందేశాలను అందిస్తుంది. Airtel యొక్క రూ. 99 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.

రిలయన్స్ జియో రూ. 419 ప్లాన్
రిలయన్స్ జియో రూ.419 ధర వద్ద అందించే ప్లాన్‌లో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతిరోజూ 3GB డేటా మరియు 100 SMS ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. అదనంగా మీరు ఈ ప్లాన్‌తో జియో టీవీ, సినిమాలు, సెక్యూరిటీ మరియు క్లౌడ్‌కు ఉచితంగా యాక్సెస్ ను పొందుతారు. ఈ ప్లాన్ కేవలం 28 రోజుల వాలిడిటీతో మాత్రమే వస్తుంది.

Vi రూ. 409 ప్లాన్
Vodafone-Idea యొక్క రూ. 409 ప్లాన్ ప్రతిరోజూ 2.5 GB డేటా, అపరిమిత కాలింగ్ ప్రయోజనాలు మరియు ప్రతిరోజూ 100 ఉచిత SMSలతో వస్తుంది. మీరు ఈ ప్లాన్‌లో బింగే ఆల్ నైట్ మరియు వీకెండ్ డేటా రోల్‌ఓవర్ నుండి కూడా ప్రయోజనం పొందుతారు. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. అలాగే రూ.129 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్ 24 రోజుల వాలిడిటీ కాలానికి అపరిమిత వాయిస్ కాల్స్ మరియు 300 SMS ప్రయోజనాలతో అందిస్తుంది. ఈ ప్యాక్‌లో 2GB 3G/4G డేటా కేటాయింపు కూడా ఉంది. కోటాను దాటిన తర్వాత సబ్‌స్క్రైబర్‌కు MBకి 50 పైసల చొప్పున అదనపు డేటా కోసం ఛార్జీ విధించబడుతుంది. ప్యాక్‌లో విలువ ఆధారిత సేవలు లేదా స్ట్రీమింగ్ సేవలకు యాక్సెస్ ఉండదు.


Click it and Unblock the Notifications








