Home
News

BSNL హోలీ ధమాకా, జియో కన్నా ఎక్కువ డేటా !

దేశీయ టెలికాం రంగంలో చుక్కలు చూపిస్తున్న జియోకు పోటీగా ప్రభుత్వ రంగ దిగ్గజం BSNL హోలీ ధమాకా పేరుతో మార్కెట్లో సరికొత్త ప్లాన్లను లాంచ్ చేసింది.

By Hazarath Aiah

దేశీయ టెలికాం రంగంలో చుక్కలు చూపిస్తున్న జియోకు పోటీగా ప్రభుత్వ రంగ దిగ్గజం BSNL హోలీ ధమాకా పేరుతో మార్కెట్లో సరికొత్త ప్లాన్లను లాంచ్ చేసింది. రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా సెల్యులార్‌ డేటా టారిఫ్‌లకు గట్టి పోటీగా ఈ ప్లాన్ నిలవనుంది. రూ. 399 ప్లాన్‌ కింద పోస్టుపెయిడ్‌ కస్టమర్లకు అపరిమిత వాయిస్‌ కాల్స్‌, 30 జీబీ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లందరూ ఈ కొత్త ప్లాన్‌ను 2018 మార్చి 1 నుంచి వినియోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తున్న 30జీబీ డేటాలో రోజువారీ పరిమితి లేదు. ఎప్పుడైనా వాడుకోవచ్చు. కాగా హోమ్‌ సర్కిల్‌ వెలుపలు చేసుకునే రోమింగ్‌ కాల్స్‌ కూడా ఈ ప్లాన్‌ కింద ఉచితంగా అందిస్తోంది.

 కేరళ సర్కిల్‌లో మాత్రమే 4జీ..

కేరళ సర్కిల్‌లో మాత్రమే 4జీ..

బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రస్తుతం కేరళ సర్కిల్‌లో మాత్రమే 4జీ ఇంటర్నెట్‌ను అందిస్తోంది. మిగతా సర్కిళ్లన్నింటిలో 3జీ ఇంటర్నెటే. ఇటీవలే బీఎస్‌ఎన్‌ఎల్‌, నోకియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో 10 టెలికాం సర్కిళ్లలో 4జీ వాయిస్‌ఓవర్‌ ఎల్‌టీఈ సర్వీసులను ఆవిష్కరించబోతుంది.

ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌లు కూడా..

ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌లు కూడా..

ప్రత్యర్థి కంపెనీలు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌లు కూడా రూ.399 ప్లాన్‌ను తన కస్టమర్లకు అందిస్తున్నాయి. అయితే అవి ఈ ప్లాన్‌ కింద కేవలం 20జీబీ డేటాను ఆఫర్‌ చేస్తున్నాయి. జియో కూడా 30జీబీ డేటాను రూ.409కు అందిస్తోంది.

రోజుకు 1జిబి

రోజుకు 1జిబి

ఇప్పటికే ఏడాదిపాటు రోజుకు 1జిబి డేటా చొప్పున వచ్చే ఫ్రీ పెయిడ్ ప్లాన్ లాంచ్ చేసిన సంగతి విదితమే. రూ.999తో  రీఛార్జ్ చేసుకుంటే ఏడాది పాటు రోజుకు ఒక జీబీ డేటా, ఆరు నెలల పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ వినియోగించుకోవచ్చు. డేటా పరిమితి దాటిన తర్వాత 40 కేబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ వస్తుంది. ఇక ప్రతిరోజూ 100 ఎస్సెమెస్‌లు ఉచితంగా లభిస్తాయి.

365 జీబీ Data

365 జీబీ Data

జమ్మూ కాశ్మీర్, అస్సాం, ఈశాన్య భారత రాష్ట్రాల్లో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లోని బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ కస్టమర్లకు ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 1జీబీ చొప్పున ఏడాదిపాటు మొత్తం 365 జీబీ డేటా ఈ ప్లాన్ ద్వారా పొందవచ్చు. ఇక ఇదే ప్లాన్ జియో, ఎయిర్‌టెల్‌లలో లభిస్తుండగా, వాటికి 60జీబీ డేటాను 90 రోజుల వాలిడిటీతో మాత్రమే అందిస్తున్నారు.

84 రోజుల పాటు లభించే బెస్ట్ ప్లాన్లు ఇవే.

84 రోజుల పాటు లభించే బెస్ట్ ప్లాన్లు ఇవే.

ఈ సంధర్భంగా 84 రోజుల ప్లాన్లపై కూడా ఓ లుక్కేయండి.

Airtel రూ. 399 ప్లాన్ 

ఇంతకు ముందు దీని వ్యాలిడిటీ 70 రోజుల వ్యాలిడిటీతో ఉంది. కాగా దీన్ని ఇప్పుడు 84 రోజుల వరకు వ్యాలిడిటీని ఇచ్చింది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు 84 రోజుల పాటు రోజుకు 1జిబి 3జి/4జి డేటాను పొందుతారు. అలాగే అపరిమిత లోకల్ , నేషనల్ కాల్స్ లభిస్తాయి. డైలీ 100 ఎసెమ్మెస్ లు ఉచితంగా లభిస్తాయి. 

జియో ప్రీ పెయిడ్ ప్లాన్లు

జియో ప్రీ పెయిడ్ ప్లాన్లు

రూ. 9,999 360 రోజుల పాటు 750 జిబి డేటా రోజుకు ఎటువంటి పరిమితి లేదు. ఉచిత కాల్స్ అందుబాటులో ఉంటాయి. రూ. 4,999 360 రోజుల పాటు 350 జిబి డేటా రోజుకు ఎటువంటి పరిమితి లేదు. అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎసెమ్మెస్‌లు రూ. 1,999 180 రోజుల పాటు 125 జిబి డేటా రోజుకు ఎటువంటి పరిమితి లేదు. అన్ లిమిటెడ్ కాల్స్. రూ. 999 90 రోజుల పాటు 60 జిబి డేటా రోజుకు ఎటువంటి పరిమితి లేదు. అన్ లిమిటెడ్ కాల్స్. రూ. 799 28 రోజుల పాటు రోజుకు 3 జిబి డేటా, అన్ లిమిటెడ్ కాల్స్. రూ. 509 49 రోజుల పాటు రోజుకు2 జిబి డేటా, అన్ లిమిటెడ్ కాల్స్.

వొడాఫోన్‌ ప్లాన్‌ రూ.399

వొడాఫోన్‌ ప్లాన్‌ రూ.399

వొడాఫోన్‌ ప్లాన్‌ రూ.399 కింద నెలకు 30జీబీ 3జీ/4జీ డేటాను ఆఫర్‌ చేయనున్నట్టు పేర్కొంది. డేటాతో పాటు అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌, నేషనల్‌ రోమింగ్‌, 100 ఎస్‌ఎంఎస్‌లు కస్టమర్లకు లభించనున్నాయి. వొడాఫోన్‌ ప్లే సర్వీసు ద్వారా రూ.4000 విలువైన మూవీలకు ఉచిత యాక్సస్‌ లభించనుంది. నాలుగు నెలల పాటు 3500 ఈ-మ్యాగజైన్లను చదువుకునేలా మ్యాగ్‌జటర్‌ సబ్‌స్క్రిప్షన్‌ను వొడాఫోన్‌ ఆఫర్‌ చేయనుంది. ఇతర ప్లాన్స్‌ మాదిరిగానే కొత్త రూ.399 వొడాఫోన్‌ రెడ్‌ప్లాన్‌ అపరిమిత కాల్స్‌లో రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు మాత్రమే మాట్లాడుకోవాలి.

ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్‌ ప్లాన్‌

ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్‌ ప్లాన్‌

రూ.389 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్‌ ప్లాన్‌..

అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాలింగ్‌, ఉచిత ఇన్‌కమింగ్‌ రోమింగ్ కాల్స్‌, 10 జీబీ హైస్పీడ్‌ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌, మూవీలు, గేమ్స్‌, మ్యూజిక్‌కు 12 నెలల వరకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌

రూ.499 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్‌ ప్లాన్‌..

అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాలింగ్‌, ఉచిత ఇన్‌కమింగ్‌, అవుట్‌గోయింగ్‌ రోమింగ్ కాల్స్‌, 20 జీబీ హైస్పీడ్‌ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌, 200జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్‌ లిమిట్‌

రూ.649 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్‌ ప్లాన్‌..

అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాలింగ్‌, నేషనల్‌ రోమింగ్‌పై ఉచిత ఇన్‌కమింగ్‌, అవుట్‌గోయింగ్‌ కాల్స్‌, నెలంతా 35 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌, 200జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్‌ లిమిట్‌

రూ.999 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్‌ ప్లాన్‌..

అపరిమిత కాలింగ్‌, నేషనల్‌ రోమింగ్‌పై ఉచిత ఇన్‌కమింగ్‌, అవుట్‌గోయింగ్‌ కాల్స్‌, నెలంతా 60 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌, 200జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్‌ లిమిట్‌

ఐడియా

ఐడియా

ఐడియా నిర్వానా ప్లాన్లు రూ.1,299
అపరిమిత కాలింగ్‌, ఉచిత రోమింగ్‌ కాల్స్‌, ఉచితంగా 100 ఇంటర్నేషనల్‌ కాలింగ్‌ నిమిషాలు, నెలంతా 85 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌, 200జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్‌ లిమిట్‌
రూ.1,699 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్‌ ప్లాన్‌..
అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాలింగ్‌, ఉచిత ఇన్‌కమింగ్‌, అవుట్‌గోయింగ్‌ రోమింగ్‌ కాల్స్‌, 110జీబీ హైస్పీడ్‌ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌, 500జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్‌ లిమిట్‌
రూ.1,999 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్‌ ప్లాన్‌..
అపరిమిత కాలింగ్‌, నేషనల్‌ రోమింగ్‌పై ఉచిత ఇన్‌కమింగ్‌, అవుట్‌గోయింగ్‌ కాల్స్‌, ఉచితంగా 200 ఇంటర్నేషనల్‌ నిమిషాలు, నెలంతా 135జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌, 500జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్‌ లిమిట్‌
రూ.2,999 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్‌ ప్లాన్‌..
అపరిమిత కాలింగ్‌, ఉచిత రోమింగ్‌ కాల్స్‌, ఉచితంగా 200 ఇంటర్నేషనల్‌ నిమిషాలు, నెలంతా 220జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌, 500జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్‌ లిమిట్‌

Best Mobiles in India

English summary
BSNL Rs. 399 Postpaid Plan With 30GB Data, Unlimited Calls Launched Mobile News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X