BSNL Rs.551 ప్లాన్: రోజుకు 5GB డేటా ప్రయోజనాలతో
ప్రభుత్వ యాజమాన్యంలోని టెల్కో సంస్థ బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ టెలికాం సర్వీసు ప్రొవైడర్ల మాదిరిగా ఎటువంటి ధరల పెంపును అమలు చేయలేదు. ఈ కారణాల వలన చందాదారులను ఆకట్టుకొంటున్నది. డిసెంబర్ 2019 లో బిఎస్ఎన్ఎల్ రిలయన్స్ జియో కంటే ఎక్కువ మంది చందాదారులను కొత్తగా చేర్చుకున్నది.

డేటా-ఓన్లీ ప్యాక్
వోడాఫోన్ ఐడియా డేటా యొక్క 1GB ధరను రూ.35 ధర వద్ద అందిస్తోంటే బిఎస్‌ఎన్‌ఎల్ మాత్రం 1GB 2G / 3G డేటాను కేవలం 1.24 రూపాయలకు అందిస్తోంది. కొన్ని రోజుల క్రితం బిఎస్ఎన్ఎల్ యొక్క డేటా-ఓన్లీ ప్యాక్ రూ.318 గురించి తెలియజేసాము. అది 2GB రోజువారీ డేటాను 84 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది.

బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న మరొక కొత్త రూ.551 ప్రీపెయిడ్ డేటా-ఓన్లీ రీఛార్జ్ ప్లాన్ రోజువారి 5GB డేటాతో 90 రోజుల చెల్లుబాటు కాలానికి వస్తుంది. అంటే వినియోగదారులు ప్రతి 1GB డేటాను రూ.1.24 ధర వద్ద 90రోజుల మొత్తం చెల్లుబాటు కాలంలో 450GB 2 జి / 3 జి డేటాను పొందవచ్చు. ఇది డేటా-ఓన్లీ ప్లాన్ కాబట్టి వినియోగదారులకు వాయిస్ కాలింగ్ లేదా SMS ప్రయోజనాలు లభించవు. ఈ ప్లాన్ గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టెలికాం ఆపరేటర్ల డేటా-ఓన్లీ ప్లాన్‌లు
ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు చందాదారులకు లాంగ్-వాలిడిటీ డేటా ప్లాన్‌లను అందించడం ప్రస్తుతం మానుకున్నారు. రిలయన్స్ జియో సంస్థ రూ.251 ధర వద్ద గల డేటా ప్యాక్ ను 51 రోజుల వాలిడిటీ కాలానికి అందిస్తున్నది. అలాగే ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా సంస్థలు తమ వినియోగదారులకు కేవలం 28 రోజుల వాలిడిటీ కాలానికి మాత్రమే డేటా ప్యాక్‌లను అందిస్తున్నాయి. ప్రస్తుతం బిఎస్‌ఎన్‌ఎల్ ఆఫర్‌లలో వివిధ రకాల డేటా ప్యాక్‌లను అందిస్తున్నాయి. వాటిలో రూ.97, రూ.198, రూ.318, రూ.551 మరియు రూ.998 ధరల వద్ద ప్లాన్‌లు ఉన్నాయి.

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.551 ప్లాన్ ఆఫర్స్
బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క రూ.551 డేటా-ఓన్లీ రీఛార్జ్ ప్లాన్ ఆసక్తికరమైనదిగా ఉంది. ఈ ప్లాన్ రోజుకు 5GB డేటాను 90 రోజుల మొత్తం చెల్లుబాటు కాలానికి అందిస్తోంది. ఈ ప్లాన్‌కు వాయిస్ కాలింగ్ మరియు SMS వంటి ప్రయోజనాలు ఏవి లేవు. బిఎస్‌ఎన్‌ఎల్ రూ. 551 డేటా ప్యాక్‌ను వివిధ సర్కిల్‌లలో అందిస్తోంది. పేటిఎమ్ వంటి ఏదైనా మూడవ పార్టీ రీఛార్జ్ పోర్టల్ ద్వారా మీ సర్కిల్‌లో ఈ ప్యాక్ లభ్యత ఉందొ లేదో అని తనిఖీ చేయవచ్చు. ఈ రీఛార్జ్ మీ సంబంధిత సర్కిల్‌లో చెల్లుబాటు అయితే బిఎస్‌ఎన్‌ఎల్ అధికారిక వెబ్‌సైట్ మరియు మొబైల్ యాప్ కూడా మీకు నోటిఫికేషన్ ను చూపుతుంది.

లభ్యత
బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క రూ.551 డేటా ప్యాక్ చాలా తరచుగా ప్రయాణం చేసే వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే బిఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రస్తుతానికి 4G సేవలు అన్ని చోట్ల అందుబాటులో లేవు కాబట్టి యూజర్లు 3 జి డేటాతో స్థిరపడవలసి ఉంటుంది. మీ ప్రాంతంలో బిఎస్‌ఎన్‌ఎల్‌కు సరైన 3 జి కవరేజ్ ఉంటే అప్పుడు రూ .551 డేటా గొప్ప ఎంపిక అవుతుంది.

బిఎస్ఎన్ఎల్ రోజువారీ 2GB డేటా ప్లాన్
భారతదేశంలో 240 రోజుల చెల్లుబాటుతో డేటా-ఓన్లీ ప్లాన్‌ను అందించే టెలికాం సర్వీస్ ప్రొవైడర్ బిఎస్‌ఎన్‌ఎల్ మాత్రమే. బిఎస్ఎన్ఎల్ యొక్క లాంగ్-వాలిడిటీ రూ.998 ప్లాన్ రోజుకు 2GB డేటాతో 240 రోజుల చెల్లుబాటు కాలానికి వస్తుంది. కంపెనీ దీనిని పరిమిత కాల ఆఫర్‌ను కూడా రన్ చేస్తున్నది. అందులో భాగంగా వారు రూ .998 ప్లాన్‌పై 30 రోజుల అదనపు యాక్సిస్ ను పొందవచ్చు. మార్చి 31, 2020 వరకు రూ.998 డేటా-ఓన్లీ ప్లాన్ ఆఫర్ చేస్తున్న సర్కిల్‌లలో 270 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.

బిఎస్ఎన్ఎల్ పండుగ ఆఫర్లు
హోలీ 2020 సందర్భంగా బిఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్లను ప్రవేశపెడుతుందని భావిస్తున్నారు. భారతదేశంలో ప్రతి పెద్ద పండుగకు ప్రచార ఆఫర్లను తీసుకురావడానికి ఈ సంస్థ ప్రసిద్ది చెందింది. రూ .1,999 వార్షిక ప్రణాళికపై బిఎస్‌ఎన్‌ఎల్ ఇప్పటికే 60 రోజుల అదనపు చెల్లుబాటును అందిస్తోంది. కాబట్టి వచ్చే వారం బిఎస్‌ఎన్‌ఎల్ ఎటువంటి ఆఫర్లను అందిస్తుందో ఆసక్తికరంగా చూడాలి.


Click it and Unblock the Notifications








