Home
News

BSNL రూ.699 ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీ 20 రోజులు పెరిగింది!! వివరాలు ఇవ్ ఇవిగో

భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఒకే ఒక టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఇప్పుడు తన వినియోగదారులను ఆకట్టుకోవడానికి రూ.699 ప్లాన్ ప్లాన్ యొక్క వాలిడిటీని పెంచింది. ఈ ప్లాన్ జనవరి 2021 లో 160 రోజుల చెల్లుబాటుతో ప్రకటించబడింది. అయితే ఇప్పుడు ప్రమోషనల్ ఆఫర్లో భాగంగా రూ.699 వోచర్ వినియోగదారులకు 180 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. కొన్ని రోజుల క్రితమే సెప్టెంబర్ 28, 2021 లోపు ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులు 180 రోజుల చెల్లుబాటును పొందుతారని ప్రకటించింది. ఇప్పుడు టెల్కో అదే ప్రమోషనల్ ఆఫర్‌ను పొడిగించింది. ఇది సెప్టెంబర్ 29, 2021 నుండి అమలులోకి లభిస్తూ డిసెంబర్ 27, 2021 వరకు అమలులో ఉంటుంది. BSNL యొక్క ఈ ప్లాన్ వినియోగదారులకు అందించే ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL రూ.699 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

BSNL రూ.699 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

BSNL యొక్క రూ.699 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రస్తుతం 180 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. ఇది వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. ఇంకా వినియోగదారులు ఈ ప్లాన్‌తో 0.5GB రోజువారీ డేటాను కూడా పొందుతారు. రోజువారీ ఫెయిర్-యూసేజ్-పాలసీ (FUP) డేటాను వినియోగించిన తర్వాత డేటా వేగం 80 Kbps కి పడిపోతుంది. వినియోగదారులు ఈ ప్లాన్ తో మొదటి 60 రోజుల పాటు కంపెనీ యొక్క ఉచిత PRBT సర్వీసును కూడా పొందుతారు. ఈ ప్రమోషనల్ ఆఫర్ యొక్క కొత్త ప్రయోజనాలు అన్ని టెలికాం సర్కిళ్లలోని వినియోగదారులకు వర్తిస్తాయి. అన్ని టెలికాం సర్కిల్‌లకు తమ వెబ్‌సైట్‌లో ఆఫర్‌ను అప్‌డేట్ చేయాలని మరియు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కి నివేదించాలని సంస్థ ఆదేశించింది.

BSNL

ఈ ప్లాన్ కొత్త కస్టమర్‌లు, BSNL కి పోర్ట్ చేసిన కస్టమర్‌లతో సహా అందరికీ అందుబాటులో ఉంటుంది. రూ.699 ప్లాన్‌తో రీఛార్జ్ చేయడానికి వినియోగదారులు తమ సమీప రీఛార్జ్ రిటైల్ దుకాణాన్ని సందర్శించవచ్చు లేదా BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్‌లు మరియు ఆన్‌లైన్ పోర్టల్‌లకు కూడా వెళ్లవచ్చు. ఇంకా వినియోగదారులు రీఛార్జ్ పూర్తి చేయడానికి టెల్కో యొక్క మొబైల్ అప్లికేషన్‌ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఒక కొత్త రీఛార్జ్ యాప్ అందుబాటులో ఉంది. అది 'BSNL సెల్ఫ్‌కేర్' ఇది మీ స్మార్ట్‌ఫోన్‌లో వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

BSNL రూ.396 ప్రీపెయిడ్ ప్లాన్

BSNL రూ.396 ప్రీపెయిడ్ ప్లాన్

PV396 గా జాబితా చేయబడిన BSNL యొక్క మరో ప్రీపెయిడ్ ప్లాన్ రూ.396 ధర వద్ద లభిస్తుంది. ప్లాన్ పొడిగింపు విభాగం కింద జాబితా చేయబడిన BSNL యొక్క ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ 90 రోజుల వ్యవధిలో చందాదారులు రోజుకు 2GB డేటాను పొందుతారు. దీనితో పాటు వారు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను కూడా పొందుతారు. ఇంతకు ముందు BSNL టెల్కో రూ.485 ధర వద్ద అందించే ప్రీపెయిడ్ ప్లాన్ కూడా 90 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అయితే ఇది రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది. రూ.396 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రారంభంతో ఇప్పుడు చందాదారులు ఖరీదైన ప్లాన్ కంటే తాజా ప్లాన్ కోసం వెళ్లే అవకాశం ఉంది. అయితే రూ.485 ప్లాన్ మరియు రూ.396 ప్లాన్ ల మధ్య ఉన్న ఏకైక వ్యత్యాసం డేటా మాత్రమే కాదు. ఎందుకంటే రూ.485 ప్లాన్ EROS సబ్‌స్క్రిప్షన్‌తో కూడా వస్తుంది.

BSNL రూ.2,399 ప్లాన్‌లో మార్పులు

BSNL రూ.2,399 ప్లాన్‌లో మార్పులు

వినియోగదారులకు మొదటగా 365 రోజుల చెల్లుబాటును అందించే రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు 425 రోజుల వాలిడిటీతో వస్తుంది అంటే 60 రోజులు ఎక్కువ. ఈ ఆఫర్ 2021 ఆగస్టు 21 నుండి నవంబర్ 19 మధ్య రీఛార్జ్ చేసుకున్న వారికి వర్తిస్తుంది. వినియోగదారులు ఈ ప్లాన్ ద్వారా రోజువారీ 3GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను పొందుతారు. వీటితో పాటుగా వినియోగదారులకు ఇరోస్ నౌ మరియు BSNL ట్యూన్స్ యొక్క అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. BSNL మార్పులు చేసిన వాటిలో రూ.1,999 ప్లాన్‌ కూడా ఉంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 100GB అదనపు డేటాను కూడా పొందుతారు. ఈ ప్లాన్ కూడా 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇంకా ఈ ప్లాన్‌తో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS లతో పాటుగా లోక్‌ధన్ కంటెంట్ మరియు ఈరోస్ నౌ సబ్‌స్క్రిప్షన్‌ని ఉచితంగా పొందవచ్చు. ఇంతకుముందు ఈ కంపెనీ ఈ ప్లాన్‌తో 500GB సాధారణ డేటాను అందించేది కానీ ఇప్పుడు అది మొత్తంగా 600GB డేటాను అందిస్తుంది. అయితే FUP డేటా వినియోగం తర్వాత వినియోగదారులు డేటాను 80 Kbps వేగంతో బ్రోజ్ చేయడానికి అనుమతిస్తుంది.

Best Mobiles in India

English summary
BSNL Rs 699 Prepaid Plan Validity Increased Up to 20 Days: Here are Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X